Bhola Shankar Day 3 Collections: భోళా శంకర్ డిజాస్టర్.. దారుణంగా బాక్సాఫీస్ కలెక్షన్లు-bhola shankar day 3 collections are far less ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bhola Shankar Day 3 Collections: భోళా శంకర్ డిజాస్టర్.. దారుణంగా బాక్సాఫీస్ కలెక్షన్లు

Bhola Shankar Day 3 Collections: భోళా శంకర్ డిజాస్టర్.. దారుణంగా బాక్సాఫీస్ కలెక్షన్లు

Hari Prasad S HT Telugu
Aug 14, 2023 04:05 PM IST

Bhola Shankar Day 3 Collections: భోళా శంకర్ డిజాస్టర్ గా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. మూడో రోజు కూడా ఆ సినిమా బాక్సాఫీస్ కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి. ఇక బ్రేక్ ఈవెన్ చేరుకోవడం అసాధ్యమే.

భోళా శంకర్ పోస్టర్ (Photo: Twitter)
భోళా శంకర్ పోస్టర్ (Photo: Twitter)

Bhola Shankar Day 3 Collections: మెగాస్టార్ చిరంజీవి నటించిన భోళా శంకర్ మూవీ అతని కెరీర్లోని అతిపెద్ద డిజాస్టర్లలో ఒకటిగా మిగిలిపోవడం ఖాయంగా కనిపిస్తోంది. తొలి రోజు తొలి షో నుంచే సినిమాకు నెగటివ్ రివ్యూలు రావడంతో బాక్సాఫీస్ కలెక్షన్లు పడిపోతూ వస్తున్నాయి. తొలి రోజు రూ.15 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ మూవీ.. తర్వాతి రెండు రోజులు అందులో ఐదో వంతు మాత్రమే వసూలు చేసింది.

రెండు, మూడు రోజుల్లో మరీ దారుణంగా మూడేసి కోట్లు మాత్రమే రావడం గమనార్హం. ఈ సినిమా ప్రీరిలీజ్ బిజినెస్ రూ.79 కోట్లు కాగా.. ఫస్ట్ వీకెండ్ ముగిసే సమయానికి రూ.40 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఇందులో షేర్ కేవలం రూ.25 కోట్లు మాత్రమే. అంటే బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయిన రూ.80 కోట్లకు మరో రూ.55 కోట్ల దూరంలో ఉంది. ఈ లెక్కన బ్రేక్ ఈవెన్ అందుకోవడం అసాధ్యమే.

దీంతో భోళా శంకర్ డిజాస్టర్ గా మిగిలిపోనుంది. తెలంగాణ, ఏపీల్లో కలిసి తొలి మూడు రోజుల్లో ఈ సినిమా రూ.32.8 కోట్ల గ్రాస్ (రూ.21.68 కోట్ల షేర్) మాత్రం రాబట్టింది. రెండో రోజు రూ.3.13 కోట్లు, రెండో రోజు రూ.3.17 కోట్లు వచ్చాయి. లాంగ్ వీకెండ్ అయినా కూడా భోళా శంకర్ సినిమాకు వచ్చిన నెగటివ్ పబ్లిసిటీ దానిని కాపాడలేకపోయాయి. దీనికితోడు జైలర్, ఓఎంజీ2, గదర్ 2లాంటి ఇతర భాషల సినిమాల నుంచి కూడా భోళా శంకర్ కు గట్టి పోటీ ఎదురైంది.

భోళా శంకర్ సినిమాను ఆసక్తికరంగా తెరకెక్కించడంలో దర్శకుడు మెహర్ రమేశ్ పూర్తిగా విఫలమయ్యారు. ఔట్ డేటెడ్ కంటెంట్‍తో విసుగెత్తించారు. దశాబ్దాల క్రితం నాటి స్టైల్‍లో సీన్లతో ప్రేక్షకులకు ఆకట్టుకోలేకపోయారు. మొత్తంగా మెహర్ రమేశ్ డైరెక్షన్ పూర్తిగా నిరాశపరుస్తుంది. గతంలో డిజాస్టర్ సినిమాలను తెరకెక్కించి పదేళ్లుగా డైరెక్షన్‍కు దూరంగా ఉన్న మెహర్ రమేశ్.. మరోసారి భోళా శంకర్‌తో పూర్తిగా నిరాశపరిచారు.

భోళా శంకర్ సినిమాలో కథనం పేలవంగా ఉంది. ఫైట్లు చాలానే ఉన్నా ఎఫెక్టివ్‍గా లేవు. కామెడీ సీన్లు ఓ దశలో విసుగు తెప్పిస్తాయి. చిరంజీవి, కీర్తి సురేశ్ మధ్య సెంటిమెంట్‍ సీన్లను కూడా డైరెక్టర్ పండించలేకపోయారు. చిరంజీవి లాంటి యాక్టర్ ఉన్నా.. సరిగా ఉపయోగించుకోలేకపోయారు. వేదాళం మూవీలోని సీన్లను కూడా మెహర్.. భోళా శంకర్‌లో సరిగా తెరకెక్కించలేకపోయారు.

భోళా శంకర్ చిత్రానికి బలంగా నిలుస్తుందనుకున్న కామెడీ.. తెరమీదకు వచ్చేసరికి చాలా చోట్ల బోల్తా కొట్టింది. జబర్దస్త్ కమెడియన్లు, వెన్నెల కిశోర్ ఉన్నా ఈ సినిమాలో కామెడీ సరిగా పండలేదు. సాధారణంగా చిరంజీవికి ఉన్న కామెడీ టైమింగ్ మరొకరికి ఉండదు. కానీ డైరెక్టర్ దీన్ని కూడా వినియోగించుకోలేకపోయారు. చిరంజీవి, శ్రీముఖి మధ్య ఖుషి నడుము సీన్.. భోళా శంకర్ చిత్రంలో బ్యాక్‍ఫైర్ అయింది. ప్రేక్షకులు ఈ సీన్‍కు విసుగెత్తిపోయారు.

Whats_app_banner