తెలుగు న్యూస్ / ఫోటో /
Rajnikanth In Himalayas: హిమాలయాల్లో రజనీకాంత్.. ఏం చేస్తున్నాడో చూడండి
Rajnikanth In Himalayas: ఇటు జైలర్ సినిమా రిలీజై, సక్సెస్ సాధించి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటుంటే.. అటు రజనీకాంత్ మాత్రం ఇవేవీ తనకు పట్టవన్నట్లు హిమాలయాల్లో సేదదీరుతున్నాడు. మూవీ రిలీజ్ రోజే హిమాలయాలకు బయలుదేరిన రజనీ.. కొన్ని రోజులుగా అక్కడే ఉన్నాడు.
(1 / 6)
Rajnikanth In Himalayas: సినిమా హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా ఓ యోగిలా సాధారణ జీవితం గడుపుతాడని రజనీకాంత్ కు పేరుంది. అందుకే ఇప్పుడు జైలర్ మూవీ బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకున్నా.. రజనీ మాత్రం దానితో పెద్దగా పట్టింపు లేదన్నట్లుగా హిమాలయాలకు వెళ్లి గడుపుతున్నాడు.
(2 / 6)
Rajnikanth In Himalayas: జైలర్ రిలీజ్ రోజే హిమాలయాలకు వెళ్లిన సూపర్ స్టార్.. అక్కడ తన స్నేహితులతో కలిసి సేదదీరుతున్న ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.
(3 / 6)
Rajnikanth In Himalayas: హిమాలయాల్లో ఉన్న తన ఆధ్యాత్మిక గురువు దయానంద సరస్వతి సమాధిని సందర్శించి నివాళులర్పించాడు.
(4 / 6)
Rajnikanth In Himalayas: ఎన్నో దశాబ్దాలుగా హిమాలయాలకు వెళ్లి గడపడం రజనీకి అలవాటు. ఆ మధ్య సినిమాలకు శాశ్వతంగా ఫుల్ స్టాప్ పెట్టి పూర్తిగా అక్కడే గడపాలని కూడా నిర్ణయించుకున్నా.. తర్వాత మళ్లీ మనసు మార్చుకున్నాడు.
(5 / 6)
Rajnikanth In Himalayas: సినిమాల సక్సెస్, తాను సాధించిన స్టార్డమ్ తో లభించని సంతృప్తి, సంతోషం హిమాలయాలకు వెళ్తే లభిస్తుందని రజనీకాంత్ తరచూ చెబుతుంటాడు.
ఇతర గ్యాలరీలు