Game Changer: ఫస్ట్ హాఫ్ అద్భుతం -ఇంటర్వెల్ బ్లాక్‌బస్టర్ -రామ్ చరణ్ గేమ్ ఛేంజర్‌కు ఫస్ట్ రివ్యూ ఇచ్చిన సుకుమార్
22 December 2024, 19:00 IST
Game Changer First Review: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ రివ్యూను సుకుమార్ ఇచ్చాడు. ఈ సినిమా ఫస్ట్ హాఫ్ అద్భతమని, ఇంటర్వెల్ బ్లాక్‌బస్టర్ అని సుకుమార్ పేర్కొన్నాడు. గేమ్ ఛేంజర్‌తో రామ్ చరణ్‌కు నేషనల్ అవార్డు రావడం ఖాయమని సుకుమార్ చెప్పాడు.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్
Game Changer First Review: చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ ఫస్ట్ రివ్యూ వచ్చేసింది. గేమ్ ఛేంజర్ చూసిన పుష్ప 2 డైరెక్టర్ సుకుమార్ ఈ మూవీ రివ్యూ చెప్పేశాడు. గేమ్ ఛేంజర్ ఫస్ట్ హాఫ్ అద్భుతమని, ఇంటర్వెల్ బ్లాక్‌బస్టర్ అని ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ పేర్కొన్నాడు. సెకండాఫ్‌లో ఫ్లాష్ బ్యాక్ గూస్ బంప్స్, ఫినామినల్ అని సుకుమార్ అన్నాడు..
జెంటిల్‌మెన్, భారతీయుడు...
చిరంజీవితో కలిసి గేమ్ ఛేంజర్ మూవీ చూశానని, జెంటిల్‌మెన్, భారతీయుడు చిత్రాలను చూసి ఎంతగా ఎంజాయ్ చేశానో మళ్లీ అంతే ఎంజాయ్ గేమ్ ఛేంజర్ చూసినప్పుడు కలిగిందని సుకుమార్ అన్నాడు. . రంగస్థలం మూవీతో రామ్ చరణ్‌కు జాతీయ అవార్డు వస్తుందని అనుకున్నాను.
కానీ రాలేదు. ఇక గేమ్ చేంజర్ క్లైమాక్స్‌లో రామ్ చరణ్ నటనకు జాతీయ అవార్డు పక్కాగా వస్తుందని సుకుమార్ తెలిపాడు. గేమ్ ఛేంజర్ మూవీకి గురించి డైరెక్టర్ సుకుమార్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతోన్నాయి. సుకుమార్ కామెంట్స్‌తో రామ్ చరణ్ అభిమానులు తెగ ఖుషి అవుతోన్నారు.
ప్రీ రిలీజ్ ఈవెంట్...
గేమ్ ఛేంజర్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ శనివారం అమెరికాలోని డల్లాస్‌లో జరిగింది. ఈ వేడుకకు సుకుమార్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సుకుమార్ మాట్లాడుతూ నిర్మాత “దిల్ రాజు గారు నాకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చాడు. నన్ను నిలబెట్టినందుకు దిల్ రాజు గా రుణం ఎప్పటికీ తీర్చుకోలేను. డైరెక్టర్ శంకర్ చేతుల మీదుగా ఫస్ట్ ఫిల్మ్ ఫేర్ అవార్డు తీసుకున్నాను. చిరంజీవి ఎందుకు శంకర్ తో సినిమా చేయలేదు.. శంకర్ ఎందుకు తెలుగు సినిమా చేయడం లేదు? అని అనుకునేవాళ్లం.
కానీ శంకర్ తో రామ్ చరణ్ సినిమా చేస్తున్నాడని తెలియగానే తెగ ఆనంద పడ్డాను. ఈ విషయాన్ని రామ్ చరణ్ మొదటగా నాకే చెప్పినట్లు గుర్తు. ఓ హీరోతో సినిమా చేసినప్పుడు ఆ హీరోని ఎక్కువగా ప్రేమిస్తాను. రంగస్థలం అయిపోయాక కూడా ఆ అనుబంధం రామ్ చరణ్‌తో మాత్రమే కొనసాగింది. రామ్ చరణ్‌తో ఎప్పుడూ టచ్‌లోనే ఉంటాను” అని అన్నాడు.
కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా...
రామ్ చరణ్ మాట్లాడుతూ.. "శంకర్ చేసిన స్నేహితుడు సినిమాకు గెస్టుగా వెళ్లాను. ఆ టైంలో ఆయనతో మాట్లాడేందుకు కూడా చాలా టెన్షన్ పడ్డాను. నాతో కాకపోయినా ఎవరితో అయినా సరే ఓ తెలుగు సినిమా చేయండని అడుగుదామని కూడా అడగలేకపోయాను.
కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా.. క్రికెట్‌కు సచిన్ ఎలాగో.. ఇండియన్ సినిమాకు శంకర్ అలా.. డైరెక్టర్లకే డైరెక్టర్ ఆయన. అలాంటి శంకర్ గారితో పని చేయడం నా అదృష్టం. నా నుంచి సోలో ఫిల్మ్ వచ్చి ఐదేళ్లు అవుతోంది. గేమ్ ఛేంజర్ నాకు చాలా స్పెషల్ మూవీ. ఈ సినిమా ఏ ఒక్కర్నీ నిరాశపర్చదు" అని అన్నాడు.
50వ సినిమా...
"కో డైరెక్టర్ గారి ద్వారా శంకర్ తెలుగు సినిమా చేయాలని అనుకుంటున్నారని తెలిసింది. అప్పుడే ఆర్ఆర్ఆర్ షూట్‌లో రామ్ చరణ్ ఉన్నారు. అప్పుడు ఈ కథ ఆయనకు చెప్పడం, నచ్చడం అలా గేమ్ ఛేంజర్ జర్నీ మొదలైంది. మా బ్యానర్లో ఇది 50వ సినిమా.
ఇంత పెద్ద బడ్జెట్‌తో నేను ఎప్పుడూ సినిమాలు తీయలేదు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ వల్లే ఈ సినిమా ఈ స్థాయికి వచ్చింది. ఈ సారి మామూలుగా కొట్టడం లేదు. గట్టిగా కొట్టబోతోన్నాం. రెండు రాష్ట్రాల్లో జరిగే రాజకీయ అంశాలు చాలా ఈ సిఇమాలో కనిపిస్తాయి. కానీ ఇవన్నీ నాలుగేళ్ల క్రితం శంకర్ రాసుకున్నారు. అవి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నాయి" అని దిల్ రాజు అన్నాడు.
చిరంజీవి...మహేష్‌బాబు...
డైరెక్టర్ ఎస్.శంకర్ మాట్లాడుతూ.. “పోకిరి, ఒక్కడు లాంటి మాస్ మసాలా ఎంటర్టైనర్ చేయాలని అనుకున్నాను. కానీ అందులో కూడా నా మార్క్ ఉండాలని అనుకున్నాను. అలాంటి ఓ సినిమానే గేమ్ చేంజర్. తెలుగులో చిరంజీవి . మహేష్ బాబు, ప్రభాస్‌తో సినిమాలు చేయాలని ప్రయత్నించా వర్కవుట్ కాలేదు. రామ్ చరణ్‌తోనే సినిమా చేయాలని రాసి పెట్టి ఉంది. అందుకే ఈ గేమ్ చేంజర్ వచ్చింది. గవర్నమెంట్ ఆఫీసర్, పొలిటీషియన్ మధ్య వచ్చే ఘర్షణ, వార్ మీదే ఈ చిత్రం ఉంటుంది. రామ్ చరణ్ కాలేజ్ లుక్‌లో చాలా ఫైర్ ఉంటుంది. పంచెకట్టులో అప్పన్నగా అద్భుతంగా నటించాడు” అని తెలిపాడు.
రామ్ చరణ్.. గేమ్ చేంజర్ చిత్రంలో రెండు పవర్‌ఫుల్ పాత్రల్లో రామ్‌చరణ్ కనిపించబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోన్న ఈ మూవీలో అంజలి, శ్రీకాంత్, ఎస్‌జే సూర్య కీలక పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమాకు తమన్ మ్యూజిక్ అందించాడు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ మూవీ రిలీజ్ కాబోతోంది.