తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Most Popular Stars: మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్-2024 జాబితాలో తెలుగు హీరోకి ఛాన్స్.. టాప్-10లో ఏడుగురు హీరోయిన్స్

Most Popular Stars: మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్-2024 జాబితాలో తెలుగు హీరోకి ఛాన్స్.. టాప్-10లో ఏడుగురు హీరోయిన్స్

Galeti Rajendra HT Telugu

12 December 2024, 14:11 IST

google News
  • Most Popular Indian Stars of 2024: ఇండియాలోని మోస్ట్ పాపులర్ స్టార్స్‌లో సౌత్ నుంచి కూడా ఈసారి సెలెబ్రిటీలకి చోటు దక్కింది. నాగచైతన్య నిశ్చితార్థం, పెళ్లి కారణంగా.. ఇద్దరు హీరోయిన్స్‌కి టాప్-10లో చోటు దక్కడం గమనార్హం. 

ఇండియన్ మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితా విడుదల
ఇండియన్ మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితా విడుదల

ఇండియన్ మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితా విడుదల

ఈ ఏడాది ఇండియన్ మోస్ట్ పాపులర్ స్టార్స్ జాబితాలో టాలీవుడ్ హీరో‌కి ఛాన్స్ దక్కింది. ఐఎండీబీ నిర్వహించే ఈ సర్వేలో గత కొన్నేళ్లుగా బాలీవుడ్ నటులు ఆధిపత్యం చెలాయిస్తూ వచ్చారు. టాప్-10లోనూ షారూక్ ఖాన్, సల్మాన్ ఖాన్, దీపికా పదుకొణె, రణబీర్ కపూర్ తదితరులు కనిపించేవారు. కానీ.. ఈసారి సౌత్ నుంచి కూడా కొంత మంది స్టార్స్‌కి ఈ టాప్-10 జాబితాలో చోటు దక్కింది.

ఐఎండీబీ ర్యాంకింగ్స్

ఐఎండీబీ ఈ ర్యాంకింగ్ జాబితాను తాజాగా విడుదల చేసింది. ప్రపంచ వ్యాప్తంగా 250 మిలియన్లకు పైగా సినిమా ప్రేక్షకుల అభిప్రాయాలను, ఇంటర్నెట్‌లో యాక్టర్స్ గురించి నెటిజన్లు శోధించిన తీరుని పరిగణలోకి తీసుకుని ఐఎండీబీ ఈ ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది. ఈ జాబితాలో యానిమల్ సినిమాతో నేషనల్ క్రష్‌గా మారిపోయిన తృప్తి దిమ్రి టాప్‌లో నిలవగా.. టాప్-10లో సమంత, శోభిత ధూళిపాళ్ల, ప్రభాస్ తదితరులు నిలిచారు.

మోస్ట్ పాపులర్ ఇండియన్ స్టార్స్ -2024లో టాప్-10లో నిలిచిన యాక్టర్స్

  • 1. తృప్తి దిమ్రి
  • 2. దీపికా పదుకొణె
  • 3. ఇషాన్ ఖత్తర్
  • 4. షారూక్ ఖాన్
  • 5. శోభిత ధూళిపాళ్ల
  • 6. శార్వరి
  • 7. ఐశ్వర్యరాయ్ బచ్చన్
  • 8. సమంత
  • 9. అలియా భట్
  • 10. ప్రభాస్

తృప్తి దిమ్రి.. కాలా, బుల్ బుల్, యానిమల్, లైలా మజ్ను, భూల్ భులైయా 3 వంటి చిత్రాల్లో నటించి యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది. 29 ఏళ్ల ఇషాన్ ఖట్టర్ బియాండ్ ది క్లౌడ్స్ (2017), ఎ సూటబుల్ బాయ్ (2020) చిత్రాల్లో నటించి.. అంతర్జాతీయ సిరీస్ ది పర్ఫెక్ట్ కపుల్‌లో నికోల్ కిడ్మన్ సరసన నటించడం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయ్యారు.

పఠాన్, జవాన్, డంకీ సినిమాల తర్వాత గత ఏడాది టాప్‌లో నిలిచిన షారుఖ్ ఖాన్ .. ఈ ఏడాది నాలుగో స్థానానికి పడిపోయారు. ఇక శోభిత ధూళిపాళ్ల మంకీ మ్యాన్ చిత్రంతో హాలీవుడ్‌లో అరంగేట్రం చేసి లవ్- సితారలో ఇటీవల నటించారు. నాగచైతన్యతో నిశ్చితార్థం, వివాహంతో ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. సమంత ఇటీవల ‘సిటాడెల్: హనీ బన్నీ’ వెబ్ సిరీస్‌లో నటించి తన పాపులారిటీని పెంచుకుంది. అలానే నాగచైతన్య పెళ్లి టాపిక్ వచ్చిన ప్రతిసారి సమంత అప్‌డేట్స్ కోసం నెటిజన్లు తెగ వెతికారు. ప్రభాస్ కల్కి 2898 AD సినిమాతో దేశవ్యాప్తంగా తన పాపులారిటీని మరింత పెంచుకున్నారు.

తదుపరి వ్యాసం