Samantha Cryptic Post: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి ఫొటోలు వైరల్.. ఎమోషనల్ పోస్ట్ పెట్టిన సమంత
Samantha Cryptic Post: నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి అయ్యి ఐదు రోజులే అవుతోంది. ఈ గ్యాప్‌లో సోషల్ మీడియాలో రెండు పోస్టులు పెట్టిన సమంత.. ఇండైరెక్ట్‌గా నాగచైతన్యపై సెటైర్స్ వేస్తున్నట్లు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.
అక్కినేని నాగచైతన్య, శోభిత ధూళిపాళ్ల పెళ్లి ఫొటోలు ఆదివారం నుంచి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. డిసెంబరు 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఈ జంట పెళ్లి చేసుకోగా.. వివాహా వేడుకలకి సంబంధించిన ఎక్స్‌క్లూజివ్ ఫొటోల్ని శోభిత ధూళిపాళ్ల షేర్ చేశారు. దాంతో సినీ సెలెబ్రిటీలతో పాటు నెటిజన్లు ఈ నూతన వధూవరులను ఆశీర్వదిస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో.. సమంత సోషల్ మీడియాలో పెట్టిన ఒక పోస్ట్ చర్చనీయాంశంగా మారింది.
శునకం ప్రేమ..
సమంత తన పెంపుడు శునకం సాషాని ముద్దాడుతూ ‘‘సాషా ప్రేమ లాంటి ప్రేమ మరొకటి లేదు’’ అని క్యాప్షన్ పెట్టింది. దాంతో.. ఈ పోస్ట్‌ను అక్కినేని నాగచైతన్యకి కనెక్ట్ చేస్తున్న కొంత మంది నెటిజన్లు.. సమంతపై మండిపడుతున్నారు. వాళ్లు శుభమా అని పెళ్లి చేసుకుంటే.. ఎందుకు ఇలా పోస్టులు పెడుతున్నావ్? అంటూ కొంత మంది నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. పెళ్లి రోజు కూడా ఒక అబ్బాయి, ఒక అమ్మాయి బాక్సింగ్ రింగ్‌లో ఫైట్ చేస్తూ.. అమ్మాయి ఓడిపోతున్న వీడియోను సమంత పోస్ట్ చేసిన విషయం తెలిసిందే.
నాలుగేళ్లకే విడిపోయిన జంట
నాగచైతన్య, సమంత కొన్నేళ్ల పాటు డేటింగ్‌లో ఉండి.. పెద్దల్ని ఒప్పించి 2017లో పెళ్లి చేసుకున్నారు. కానీ.. నాలుగేళ్ల వ్యవధిలోనే మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. ప్రస్తుతం సమంత.. ఎక్కువగా బాలీవుడ్‌లో సినిమాలు, వెబ్ సిరీస్‌లు చేస్తోంది. నాగచైతన్య కూడా వరుసగా సినిమాలు చేస్తున్నారు.. అతను నటించిన తండేల్ మూవీ వచ్చే ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలోకి రానుంది.
శోభితతో రెండేళ్లు డేటింగ్
సమంతతో విడాకులు తర్వాత రెండేళ్ల పాటు శోభిత ధూళిపాళ్లతో డేటింగ్‌లో ఉన్న నాగచైతన్య.. ఇరు పక్షాల పెద్దల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. ఈ ఏడాది ఆగస్టులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట.. డిసెంబరు 4న వివాహ బంధంతో ఒక్కటైంది. పెళ్లి తర్వాత శ్రీశైలం ఆలయానికి వెళ్లిన నూతన వధూవరులు అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు.