తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ileana Partner: ఇలియానా బిడ్డకు తండ్రి ఇతడేనా? ఫొటో షేర్ చేసిన గోవా బ్యూటీ

Ileana Partner: ఇలియానా బిడ్డకు తండ్రి ఇతడేనా? ఫొటో షేర్ చేసిన గోవా బ్యూటీ

Hari Prasad S HT Telugu

02 June 2023, 16:38 IST

google News
    • Ileana Partner: ఇలియానా బిడ్డకు తండ్రి ఇతడేనా? తాజాగా ఈ గోవా బ్యూటీ షేర్ చేసిన ఫొటో చూస్తే అదే సందేహం కలుగుతోంది. తాను ప్రెగ్నెంట్ అంటూ ఆమె ఏప్రిల్ నెలలో వెల్లడించిన విషయం తెలిసిందే.
ఇలియానా బేబీ బంప్ ఫొటోలు
ఇలియానా బేబీ బంప్ ఫొటోలు

ఇలియానా బేబీ బంప్ ఫొటోలు

Ileana Partner: ఒకప్పుడు టాలీవుడ్ ను ఊపేసిన జీరో సైజ్ బ్యూటీ ఇలియానా.. పెళ్లి కాకుండాతనే తల్లయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియా ద్వారా గత ఏప్రిల్ నెలలో ఆమె ఈ విషయాన్ని వెల్లడించడం సంచలనం రేపింది. చాలా మంది అభిమానులు ఆ బిడ్డకు తండ్రి ఎవరు అని ప్రశ్నించారు. అయితే ఆ విషయాన్ని మాత్రం ఇల్లీ బేబీ వెల్లడించలేదు.

ఇప్పటికీ అతడు ఎవరు అన్నది తెలియదు. అయితే బాలీవుడ్ నటి కత్రినా కైఫ్ సోదరుడు సెబాస్టియన్ తో ఆమె కొన్నాళ్లుగా డేటింగ్ లో ఉండటంతో అతడే ఆ బిడ్డకు తండ్రి కావచ్చని భావించారు. తమ రిలేషన్‌షిప్ పై ఇలియానా కానీ, సెబాస్టియన్ కానీ ఓపెన్ అవలేదు. కానీ తాజాగా ఇలియానా తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో షేర్ చేసిన ఓ ఫొటో ఆకర్షించింది.

అందులోని వ్యక్తుల ముఖాలు కనిపించకపోయినా.. వాళ్ల చేతులు, వేళ్లకు ఉన్న రింగ్స్ ఆసక్తి కలిగించాయి. తాను తల్లి కావడానికి కారణమైన వ్యక్తి అతడే అన్నట్లుగా ఆమె హింట్ ఇచ్చింది. ఇద్దరి చేతి వేళ్లకూ ఉంగరాలు ఉండటంతో.. వాళ్లు ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్లు కూడా పరోక్షంగా వెల్లడించింది. "నా రొమాన్స్ చేసే విధానం ఇదీ.. కచ్చితంగా అతన్ని ప్రశాంతంగా తిననివ్వను" అనే క్యాప్షన్ తో ఆ ఫొటో షేర్ చేసింది.

ఇద్దరూ డిన్నర్ డేట్ లో ఉన్నట్లు ఫొటో చూస్తే స్పష్టమవుతోంది. అయితే ఆ ఫొటోలోని వ్యక్తి ఎవరు అన్నది మాత్రం ఇలియానా చెప్పలేదు. ఈ మధ్యే తాను బేబీమూన్ ఎంజాయ్ చేస్తున్నట్లు కూడా ఇన్‌స్టా ఫొటోల ద్వారా ఆమె వెల్లడించింది. ఈ సందర్భంగా బీచ్ లో దిగిన ఫొటోలను షేర్ చేసింది. తన బేబీ బంప్ కూడా చూపించింది.

ఇలియానా షేర్ చేసిన ఫొటో ఇదే

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం