Kohli Instagram post: ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు కోహ్లి ఎంత అందుకుంటాడో తెలుసా?-kohli instagram post will get him richer by 5 crores ,స్పోర్ట్స్ న్యూస్
Telugu News  /  Sports  /  Kohli Instagram Post Will Get Him Richer By 5 Crores

Kohli Instagram post: ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు కోహ్లి ఎంత అందుకుంటాడో తెలుసా?

ప్రియాంకా చోప్రా, విరాట్ కోహ్లి, కత్రినా కైఫ్
ప్రియాంకా చోప్రా, విరాట్ కోహ్లి, కత్రినా కైఫ్

Kohli Instagram post: ఒక్కో ఇన్‌స్టాగ్రామ్ పోస్టుకు కోహ్లి ఎంత తీసుకుంటాడో తెలుసా? ఈ మధ్యే 25 కోట్ల ఫాలోవర్లతో ఇండియాలో మరే ఇతర సెలబ్రిటీకీ సాధ్యం కాని రికార్డును అతడు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Kohli Instagram post: విరాట్ కోహ్లి ఇండియాలో ఓ యూత్ ఐకాన్. క్రికెట్ ఫీల్డ్ లో తాను సాధించిన రికార్డులను అతడు ఎక్కడైనా డబ్బు రూపంలోకి మార్చుకోగలడు. నిజానికి అతడే కాదు ఏ సెలబ్రిటీ అయినా అంతే. అయితే యూత్ మెచ్చే ఇన్‌స్టాగ్రామ్ లో ఈ మధ్యే 25 కోట్ల ఫాలోవర్ల మార్క్ అందుకున్న కోహ్లి.. అందులో తాను చేసే ఒక్కో పోస్టుకు భారీగానే వసూలు చేస్తాడన్న విషయం మీకు తెలుసా?

ట్రెండింగ్ వార్తలు

ఇప్పటి వరకూ ఇండియాలో ఎవరికీ సాధ్యం కాని రీతిలో ఇన్‌స్టాలో కోహ్లి ఫాలోవర్ల సంఖ్య 25 కోట్లకు చేరింది. దీంతో అతడు చేసే పోస్టులకు కూడా డిమాండ్ పెరిగింది. ఒక్కో పోస్టుకు కోహ్లి సుమారు రూ.3.5 కోట్ల నుంచి రూ.5 కోట్ల వరకూ వసూలు చేస్తాడట. తాను చేసే పోస్టును బట్టి ఈ మొత్తం మారుతూ ఉంటుంది. అత్యధిక ఫాలోవర్లు ఉండటంతో ఒక్కో పోస్టుకు అత్యధిక మొత్తం అందుకునే సెలబ్రిటీగానూ కోహ్లి నిలిచాడు.

ఇక ఇన్‌స్టా స్టోరీకి మాత్రం కాస్త తక్కువే వస్తుంది. ఎందుకంటే పోస్టు ఎప్పటికీ అలాగే ఉంటుంది కానీ స్టోరీ మాత్రం 24 గంటల్లోనే తొలగిపోతుంది. ఇక కోహ్లి తర్వాత ఇలా ఒక్కో పోస్టుకు కోట్లు అందుకునే సెలబ్రిటీల్లో మొత్తం బాలీవుడ్ హీరోయిన్లే ఉండటం విశేషం.

ఒక్కో ఇన్‌స్టా పోస్టుకు ఎవరికెంత?

విరాట్ కోహ్లి (25 కోట్లు ఫాలోవర్లు) - రూ.3.5 - రూ. 5 కోట్లు

ప్రియాంకా చోప్రా (8.77 కోట్లు ఫాలోవర్లు) - రూ.2 కోట్లు

శ్రద్ధా కపూర్ (8.08 కోట్ల ఫాలోవర్లు) - రూ.1.5 కోట్లు

ఆలియా భట్ (7.74 కోట్ల ఫాలోవర్లు) - రూ.2 కోట్లు

దీపికా పదుకోన్ (7.41 కోట్ల ఫాలోవర్లు) - రూ.2 కోట్లు

కత్రినా కైఫ్ (7.28 కోట్ల ఫాలోవర్లు) - రూ.1 కోటి

WhatsApp channel