తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Thriller Movie: తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులో వస్తున్న హాలీవుడ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Thriller Movie: తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులో వస్తున్న హాలీవుడ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

15 October 2024, 21:04 IST

google News
    • OTT Thriller Movie: మిల్లర్స్ గర్ల్ సినిమా తెలుగులోనూ ఇండియాలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ హాలీవుడ్ చిత్రం మొత్తంగా ఐదు భాషల్లో స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఈ థ్రిల్లర్ చిత్రాన్ని ఎక్కడ చూడొచ్చంటే..
OTT Thriller Movie:తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులో వస్తున్న హాలీవుడ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..
OTT Thriller Movie:తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులో వస్తున్న హాలీవుడ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

OTT Thriller Movie:తొమ్మిది నెలల తర్వాత ఓటీటీలోకి తెలుగులో వస్తున్న హాలీవుడ్ చిత్రం.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..

తెలుగు డబ్బింగ్‍లో ఓటీటీల్లోకి వస్తున్న హాలీవుడ్ సినిమాల సంఖ్య పెరుగుతోంది. ఈ క్రమంలో మరో చిత్రం కూడా ఈ జాబితాలో చేరుతోంది. హాలీవుడ్ ఎరోటిక్ థ్రిల్లర్ చిత్రం ‘మిల్లర్స్ గర్ల్’ ఇండియాలో స్ట్రీమింగ్‍కు అడుగుపెడుతోంది. జనవరిలో ఈ చిత్రం థియేటర్లలో రిలీజైంది. ఇప్పుడు ఇండియాలో ఓటీటీలో అందుబాటులోకి రానుంది.

స్ట్రీమింగ్ వివరాలివే..

‘మిల్లర్స్ గర్ల్’ సినిమా ఇండియాలో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అక్టోబర్ 17వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మరాఠి భాషల్లోనూ అందుబాటులోకి వస్తుంది. మరో రెండు రోజుల్లోనే ఈ చిత్రం ప్రైమ్ వీడియో ఓటీటీలోకి అడుగుపెట్టనుంది.

మిల్లర్స్ గర్ల్ సినిమాలో మార్టిన్ ఫ్రెమన్, జెన్నా ఒర్టెగా, బషీర్ సలాహుద్దీన్, గిడియన్ అడ్లోన్, డగ్మారా డొమిన్‍జిక్ ప్రధాన పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి జేడ్ హాలీ బార్లెట్ దర్శకత్వం వహించారు. ధనవంతురాలైన ఓ టీనేజ్ అమ్మాయి చుట్టూ ఈ మూవీ స్టోరీ తిరుగుతుంది. క్రియేటివ్ రైటింగ్ నేర్పించేందుకు వచ్చిన వ్యక్తితో ఆమె పరిచయం, ఈ క్రమంలో ఎదురయ్యే పరిస్థితులతో ఈ మూవీ ఉంటుంది.

మిల్లర్స్ గర్ల్ చిత్రాన్ని గుడ్ యూనివర్స్, పాయింట్ గ్రే పిక్చర్స్ బ్యానర్లపై సేత్ రోగెన్, ఇవాన్ గోల్డ్ బర్గ్, జేమ్స్ వీవర్, జోష్ ఫాగెన్, మేరీ మార్గరెట్ కుంజే ప్రొడ్యూజ్ చేశారు. ఎలీసా సామ్సెల్ మ్యూజిక్ అందించిన ఈ చిత్రానికి డానియెల్ బ్రదర్స్ సినిమాటోగ్రఫీ చేశారు.

మిల్లర్స్ గర్ల్ చిత్రం ఈ ఏడాది జనవరి 26న అమెరికాలో రిలీజ్ అయింది. అయితే, బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం పెద్దగా కలెక్షన్లను రాబట్టలేకపోయింది. కమర్షియల్‍గా సక్సెస్ కాలేకపోయింది. ఇప్పుడు సుమారు తొమ్మిది నెలల తర్వాత ఇండియాలో ప్రైమ్ వీడియోలో ఈ చిత్రం అందుబాటులోకి వస్తోంది.

జియోసినిమాలో ‘ఫ్యూరియోసా’

ఫ్యూరియోసా: ఎ మ్యాడ్‍ మ్యాక్స్ సినిమా ఇండియాలో రెంట్ లేకుండా జియోసినిమా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. అక్టోబర్ 23వ తేదీన ఈ హాలీవుడ్ యాక్షన్ చిత్రం స్ట్రీమింగ్‍కు అడుగుపెట్టనుంది. ఇంగ్లిష్‍తో పాటు తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, బెంగాలీ, మరాఠి భాషల్లో ఈ చిత్రం స్ట్రీమ్ అవనుంది. ఈ ఏడాది మే నెలలో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ ఇప్పుడు రెంట్ లేకుండా స్ట్రీమింగ్‍కు వస్తోంది. ఫ్యూరియోసా: ఎ మ్యాడ్‍ మ్యాక్స్ మూవీలో క్రిస్ హేమ్స్‌వర్త్, అన్య టేలర్ జాయ్ లీడ్ రోల్స్ చేశారు. ఈ భారీ యాక్షన్ చిత్రానికి జార్జ్ మిల్లర్ దర్శకత్వం వహించారు.

తదుపరి వ్యాసం