తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Amaran Movie: అమరన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్‌కి గిఫ్ట్ ఇచ్చిన శివ కార్తికేయన్.. ఫార్ములా-1 బ్రాండ్‌

Amaran Movie: అమరన్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్‌కి గిఫ్ట్ ఇచ్చిన శివ కార్తికేయన్.. ఫార్ములా-1 బ్రాండ్‌

Galeti Rajendra HT Telugu

09 November 2024, 16:00 IST

google News
  • Sivakarthikeyan gift: అమరన్‌ మూవీని యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ తన మ్యూజిక్‌తో నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లాడు. మరీ ముఖ్యంగా.. క్లైమాక్స్‌లో వచ్చే ఎమోషన్స్ సీన్స్‌లో ప్రేక్షకుల్ని కట్టిపడేశాడు. 

అమరన్‌లో సాయిపల్లవి, శివ కార్తికేయన్
అమరన్‌లో సాయిపల్లవి, శివ కార్తికేయన్

అమరన్‌లో సాయిపల్లవి, శివ కార్తికేయన్

దీపావళి రోజున విడుదలై సూపర్ హిట్‌గా నిలిచిన అమరన్ మూవీ మరో వారం రోజులు థియేటర్లలో జోరు కొనసాగించే అవకాశం కనిపిస్తోంది. శివ కార్తికేయన్, సాయి పల్లవి జంటగా నటించిన ఈ సినిమా అక్టోబరు 31న విడుదలై రూ.200 క్లబ్‌‌కి చేరువగా ఉంది. తమిళ్‌లోనే కాదు తెలుగు రాష్ట్రాల్లోనూ అమరన్ మూవీ పాజిటివ్‌ మౌత్ టాక్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది.

రాజ్‌కుమార్ పెరియాసామి దర్శకత్వం వహించిన ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్‌ మ్యూజిక్ అందించాడు. సినిమాలో యాక్షన్ సీన్స్‌తో పాటు ఎమోషన్ సీన్లకీ మ్యూజిక్‌ అదనపు బలాన్ని జోడించింది. దాంతో జీవీ ప్రకాశ్ కుమార్‌కి ఒక ఖరీదైన బహుమతిని అమరన్ హీరో శివ కార్తికేయన్ ఇచ్చాడట. ఈ మేరకు సోషల్ మీడియాలో జీవీ ప్రకాశ్ కుమార్‌ ఒక పోస్ట్ పెట్టాడు.

కాస్లీ బ్రాండెడ్ వాచీ

టీఏజీ హ్యూయర్ మెన్స్ ఫార్ములా- 1 బ్రాండ్‌ స్టెయిన్ లెస్ స్టీల్ స్టైలిష్ వాచ్‌ను తనకి శివ కార్తికేయన్ గిఫ్ట్‌గా ఇచ్చినట్లు జీవీ ప్రకాశ్ కుమార్‌ ఒక ఫొటో పెట్టాడు. ఈ వాచీ ధర సుమారు రూ.3 లక్షల వరకు ఉంటుందని నెటిజన్లు అంచనా వేస్తున్నారు

జీవీ ప్రకాశ్

మేజర్ బయోపిక్

దివంగత మేజర్ ముకుంద్ వరదరాజన్ బయోపిక్‌గా ఈ అమరన్ మూవీ తెరకెక్కింది. సీనియర్ నటులు కమల్ హాసన్ తన రాజ్ కమల్ బ్యానర్‌పై సోనీ పిక్చర్స్‌తో కలిసి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించాడు. తెలుగు, తమిళ్ ప్రేక్షకులు ఈ అమరన్ మూవీని ఆదరిస్తున్నారు. కానీ.. కన్నడ, మలయాళంలో మాత్రం ఈ సినిమాకి ఆశించిన మేర ఆదరణ దక్కలేదు. సాయి పల్లవి ఉన్నా.. మలయాళంలో నామమాత్రపు కలెక్షన్లతో ఈ సినిమా సరిపెడుతోంది.

ఓటీటీలోకి అమరన్

అమరన్ మూవీ నవంబరు చివర్లోనే ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. భారీ ధరకి ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని నెట్‌ప్లిక్స్‌ కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అయితే ప్రస్తుతం థియేటర్లలో పెద్ద సినిమాలు ఏమీ లేకపోవడంతో మరికొన్ని రోజులు అమరన్ కొనసాగే సూచనలు కనిపిస్తున్నాయి. దాంతో ఒక వారం పాటు ఆలస్యమైనా ఆశ్చర్యపోలేం.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం