Sai Pallavi Controversy: సాయి పల్లవి నోరుజారిందా? అమరన్ మూవీ సక్సెస్ మీట్‌లో ఆ వ్యాఖ్యలపై నెటిజన్లు ఫైర్
Sivakarthikeyan Hits In Telugu: శివ కార్తికేయన్ గురించి అమరన్ సక్సెస్ మీట్‌లో సాయి పల్లవి మాట్లాడిన సరదా మాటలు వివాదానికి దారితీశాయి. సినిమా పేర్లు చెప్పి మరీ.. నెటిజన్లు కౌంటర్స్.
సౌత్‌లో ఉన్న క్రేజీ హీరోయిన్లలో ఒకరిగా సాయి పల్లవి సాధారణంగా వివాదాలకి దూరంగా ఉంటుంది. బహిరంగ వేదికలపైనే కాదు.. సోషల్ మీడియాలోనూ చాలా హుందాగా వ్యవహరిస్తుంటుంది. శివ కార్తికేయన్‌తో కలిసి ఆమె నటించిన అమరన్ మూవీ దీపావళి రోజున విడుదలై హిట్ టాస్‌తో థియేటర్లలో సందడి చేస్తోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో చిత్ర యూనిట్ సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేయగా.. ఆ మీట్‌లో శివ కార్తికేయన్‌ని తక్కువగా చూస్తూ సాయి పల్లవి నోరుజారినట్లు కొంత మంది నెటిజన్లు ఆరోపిస్తున్నారు.
మేజర్ ముకుంద్‌గా శివ కార్తికేయన్ ఆ సినిమాలో కనిపించగా.. ఆయన సతీమణి ఇందు రెబెక్కా వర్గీస్‌గా సాయి పల్లవి నటించింది. ఈ సినిమా సక్సెస్ మీట్‌లో మాట్లాడిన సాయి పల్లవి.. శివకార్తికేయన్‌కు తెలుగులో తొలి బ్లాక్ బస్టర్ అని సాయి పల్లవి చెప్పుకొచ్చింది. కానీ.. కొంత మంది అభిమానులు మాత్రం మరోలా అర్థం చేసుకుని సాయి పల్లవిపై సోషల్ మీడియాలో మండిపడుతూ కామెంట్స్ పెడుతున్నారు.
సాయి పల్లవి ఏం చెప్పిదంటే?
‘‘శివ కార్తికేయన్ అంటున్నారు తమిళ్‌లో నీకు నాతో బ్లాక్ బాస్టర్ వచ్చిందని.. నేను ఇక్కడ చెప్తున్నాతెలుగులో శివ కార్తికేయన్‌కి నాతో తొలి బ్లాక్ బస్టర్ వచ్చింది’’ అని సాయి పల్లవి సరదాగా చెప్పుకొచ్చింది. ఈ మాటలు వేదిక కింద నుంచి విన్న శివ కార్తికేయన్ కూడా ఒప్పుకున్నట్లు హావభావాలు ఇచ్చాడు. కానీ.. కొంత మంది నెటిజన్లు మాత్రం సాయి పల్లవిని నిందిస్తూ ఎక్స్‌లో ట్రోల్ చేస్తున్నారు.
గత మూడేళ్లలో రెండు హిట్
నెటిజన్స్ కామెంట్స్ ఎలా ఉన్నాయంటే?.. ‘‘శివ కార్తికేయన్ నటించిన డాక్టర్ (2021), డాన్ (2022) సినిమాలు కూడా తెలుగులో హిట్. . సాయి పల్లవి మర్చిపోయిందేమో’’ అని ఒకరు కామెంట్ చేయగా.. మరొకరు "డాక్టర్, డాన్ ఇప్పటికే తెలుగులో హిట్ ఎవడైనా ఆమెకి చెప్పండ్రా’’ అంటూ వెటకారం చేశాడు. మరో అభిమాని ‘‘అమరన్ కంటే ముందే కార్తికేయన్ మూడు సినిమాలు తెలుగులో హిట్ అయ్యాయి. సాయి పల్లవి మీరు మాట్లాడే ముందు ఒకసారి నిజానిజాలు చెక్ చేసుకోండి. 2016లో వచ్చిన రెమో, ఆ తర్వాత డాక్టర్, డాన్ ఇక్కడ హిట్’’ అంటూ రాసుకొచ్చాడు.
సాయి పల్లవికి ఫ్యాన్స్ సపోర్ట్
సాయి పల్లవిని కొందరు కావాలనే ట్రోల్ చేస్తుండటంతో.. ఆమె అభిమానులు మద్దతుగా నిలిచారు. సాయి పల్లవి మాట్లాడిన మాటల్లో తప్పు లేదని.. డాక్టర్, డాన్ హిట్.. కానీ అమరన్ మూవీ అమరన్ మూవీ బ్లాక్ బాస్టర్ అని ఇదే విషయాన్ని సాయి పల్లవి చెప్పిందంటూ సమర్థిస్తున్నారు.
రూ.200 కోట్లకి చేరువవుతున్న అమరన్
అమరన్ మూవీ ఇప్పటి వరకు ప్రపంచవ్యాప్తంగా రూ.176.5 కోట్ల వసూళ్లని రాబట్టింది. ఈ సినిమాకి గురువారం వరకూ లక్కీ భాస్కర్, క సినిమాలు పోటీలో ఉన్నాయి. అయితే.. శుక్రవారం కొత్త సినిమాలు రిలీజ్ కాబోతుండటంతో.. కలెక్షన్లు తగ్గే అవకాశం ఉంది.