Netizens Slams Hansal Mehta: నెటిజన్‌ను దారుణంగా తిట్టిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్.. సోషల్ మీడియాలో ఫుల్ ట్రోల్
26 April 2023, 8:15 IST
- Netizens Slams Hansal Mehta: సినిమాల సక్సెస్‌ను అంచనా వేయడం అంత సులభమైన విషయం కాదు. ఈ అంశంపై మాట్లాడిన బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ హన్సల్ మెహతా షాకింగ్ కామెంట్స్ చేశారు. కొన్ని చెత్త సినిమాలకు డబ్బులొస్తాయని స్పష్టం చేశారు. అయితే తనను వ్యతిరేకించిన నెటిజన్ ను హన్సల్ ఇడియట్ అని తిట్టడం గమనార్హం.
హన్సల్ మెహతాపై నెట్టింట ఫైర్
Movie Success Estimation: కొన్ని సార్లు సినిమా ఎంత బాగున్నా కమర్షియల్‌గా సక్సెస్ కాలేదు. థియేటర్లలో ప్రేక్షకుల ఆదరణ నొచుకేలేక, బాక్సాఫీస్ వద్ద వసూళ్ల రాక మూవీ ఫ్లాప్ అవుతుంది. ఈ అండర్ రేటెడ్ మూవీస్ బుల్లితెరపై వచ్చినప్పుడు విశేష ఆదరణ పొందిన దాఖలాలు ఇప్పటికే పలుమార్లు చూశాం. ఇదే సమయంలో సినిమాలో విషయం లేకపోయినప్పటికీ వసూళ్ల వర్షాన్ని కురిపించిన చిత్రాలు ఉన్నాయి. ఇటీవల కాలంలో ఇలాంటి సినిమాలు ఎక్కువగా వస్తున్నాయి. దీంతో మూవీ క్వాలిటీని జడ్జ్ చేయడానికి బాక్సాఫీస్ కలెక్షన్లు ఒక్కటే ప్రధానంగా తీసుకోకూడదని బాలీవుడ్ దర్శక, నిర్మాత హన్సల్ మెహతా అభిప్రాయపడ్డారు. సినిమాలు దారుణంగా ఉన్నా కొన్నిసార్లు డబ్బు బాగా వస్తుంటాయని ఆయన అన్నారు.
"కొన్నిసార్లు సినిమాలో విషయం లేకపోయినా డబ్బులు బాగా వస్తాయి. బదులుగా ఈ మూవీ మన పెట్టే సొమ్ముకు న్యాయం చేస్తుందా అనే విషయంపై ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. డబ్బు సంపాదించి పెట్టడానికి వారు సినిమాలు చూడరు? ఈ బిజినెస్‌లో పాల్గొనాలని వాళ్లు అనుకోరు. ఫిల్మ్ బిజినెస్‌తో వారికేంటి సంబంధం?" అని హన్సల్ మెహతా ప్రశ్నించారు.
హన్సల్ మెహతా వ్యాఖ్యలను బట్టి చూస్తుంటే ఇటీవల కాలంలో విడుదలైన పఠాన్, వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాల గురించి పరోక్షంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఈ చిత్రాల కథలో కంటెట్ పెద్దగా లేకపోయినప్పటికీ గణనీయంగా లాభాలను తీసుకొచ్చిపెట్టిన విషయం తెలిసిందే.
హన్సల్ మెహతా వ్యాఖ్యలపై మాత్రం నెటిజన్లు ఫుల్ ఫైర్ అవుతున్నారు. సినిమాలకు రెస్పెక్ట్ ఇవ్వడం నేర్చుకోవాలని, సినిమాల ఓపెనింగ్స్‌ను కలెకన్ల బట్టి కాకుండా ఎలా నిర్ణయిస్తారంటూ ఓ యూజర్ ఆయనపై ఫైర్ అవుతారు. ఇందుకు హన్సల్ మెహతా కూడా స్పందిస్తూ అతడిని ఇడియట్ అనడం చర్చనీయాంశంగా మారింది.
మాట్లాడే హక్కు అందరికీ ఉంటుందని, ఆయన అభిప్రాయాన్ని ఇష్టపడకపోతే ఆ విధంగా తిట్టాలా అంటూ నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెటిజన్‌ను ఇడియట్ అని తిట్టడం సరికాదని మళ్లీ ఆయనను ట్రోల్ చేస్తున్నారు. కమర్షియల్ సినిమాలకు కలెక్షన్లను ఓ అవార్డు లాంటిదని, వాటిని మనం సింపుల్ గా పక్కనపెట్టలేమని స్పష్టం చేస్తున్నారు.
ఇదే సమయంలో కంటెంట్ బేస్ చిత్రాలకు బాక్సాఫీస్ వద్ద లాభాలు లేకపోయినప్పటికీ దీర్ఘకాలంలో క్లాసిక్‌లుగా నిలిచిపోతాయి. కాబట్టి సినిమాల సక్సెస్‌ను అంచనా వేయడం కష్టం. మూవీ విజయం ఎప్పుడూ ఆర్టిస్టిక్ మెరిట్ లేదా ఎంటర్టైన్మెంట్ వ్యాల్యూ సూచించదని అర్ధం చేసుకోవడం ముఖ్యం. కమర్షియల్‌గా ఫర్వాలేదనిపించే చాలా సినిమాలు విమర్శకుల ప్రశంసలు అందుకున్నాయి. అలాగే కల్ట్ క్లాసిక్స్‌గా మారాయి.