తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu July 3rd Episode: గుప్పెడంత మనసు- వసుధారలో తల్లిని చూసుకుని రంగా ఎమోషనల్- వసుకు టీచర్‌గా జాబ్

Guppedantha Manasu July 3rd Episode: గుప్పెడంత మనసు- వసుధారలో తల్లిని చూసుకుని రంగా ఎమోషనల్- వసుకు టీచర్‌గా జాబ్

Sanjiv Kumar HT Telugu

03 July 2024, 8:22 IST

google News
  • Guppedantha Manasu Serial July 3rd Episode: గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 3వ తేది ఎపిసోడ్‌లో వసుధారకు స్కూల్‌లో టీచింగ్ జాబ్ చూస్తాడు రంగా. అందుకోసం ఆటోలో వెళ్తుంటే వసుధారలో తన తల్లి కనిపిస్తుందని ఎమోషనల్ అవుతాడు రంగా. ఇలా గుప్పెడంత మనసు సీరియల్ నేటి ఎపిసోడ్‌లో..

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 3వ తేది ఎపిసోడ్‌
గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 3వ తేది ఎపిసోడ్‌

గుప్పెడంత మనసు సీరియల్‌‌ జూలై 3వ తేది ఎపిసోడ్‌

Guppedantha Manasu Serial Today Episode: గుప్పెడంత మనసు సీరియల్‌ నేటి ఎపిసోడ్‌లో మీకు నేను కలలో ఎలా కనిపించాను అని రంగా అడిగితే.. గొప్పగా చెబుతుంది వసుధార. హో.. మీకు అలా కనిపించానా. థ్యాంక్యూ థ్యాంక్యూ అని రంగా అంటాడు. కలలో కాదు రియల్‌గా అలాగే ఉండేవారు. ఇప్పుడు ఇలా ఎందుకు ఉంటున్నారు. ఎందుకు అని వసుధార అడుగుతుంది. మేడమ్ మళ్లీ మొదలుపెట్టకండి అని రంగా అంటాడు.

ఊహించికుని తీసుకొచ్చా

సరే నాకు నచ్చిన కలర్స్, డిజైన్స్ ఎలా తీసుకొచ్చారు. కనీసం కొలతలు కూడా అడగలేదు అని వసుధార అనుమానిస్తుంది. దాంట్లో ఏముందండి. మొత్తానికి పది కలర్స్ ఉంటున్నాయి. వాటిలో ఎక్కువగా అమ్మాయిలకు పింక్ నచ్చుతుంది. మిగతా వారికి మిగతావి. డిజైన్స్ అంటారా షాప్ వాడిని అడిగితే.. చాలా రకాలు చూపించాడు. వాటిలో మిమ్మల్ని ఊహించుకుని ఏది బాగుంటుందో తీసుకొచ్చాను. ఇక కొలతలకు నా మరదలి బట్టలు తీసుకెళ్లాను అని రంగా వివరిస్తాడు.

మీరు ప్రతిదానికి ఏదో కారణాలు చెబుతూనే ఉన్నారు. ఎందుకిలా అని వసుధార అంటే.. ఏంటీ మేడమ్ గారు.. నాకు డబ్బులు తిరిగి ఇవ్వాల్సి వస్తుందని టాపిక్ ఇలా డైవర్ట్ చేస్తున్నారా. నేను ఎన్నిసార్లు చెప్పిన వినకుండా అని రంగా అంటాడు. నేనెందుకు అలా చేస్తాను. మీరు రిషి సారే. సరే నాకు ఏదైనా పని చూడండి. పని చేసి డబ్బులు తిరిగి ఇస్తాను అని వసుధార అంటుంది. నేను డబ్బులు అడగడం లేదు. అయినా మీరు చదువుకున్న వారు. చదువు రాని నన్ను పని చూడమంటే ఎలా చూడగలను అని రంగా అంటాడు.

వసుధారకు టీచింగ్ జాబ్

మీరు చూడగలరు. నాకు తెలుసు. చూడండి అని వసుధార వెళ్లిపోతుంది. తర్వాత రాధమ్మా, వసుధార కూరగాయలు కోస్తుంటారు. ఇంతలో వచ్చిన రంగా గుడ్ మార్నింగ్ చెబుతాడు. ఇదేంటీ కొత్తగా గుడ్ మార్నింగ్ చెబుతున్నాడు అని వసుధార అనుకుంటుంది. మీరు పని చూడమని చెప్పారు కదా. చూశాను. ఏ పని చూశానో చెప్పుకోండి అని రంగా అంటాడు. వసుధార గెస్ చేస్తుంది. కానీ, అవి కాదని రంగా అంటాడు.

ఇంతలో ఏరా పొలం పనులు కానీ చూశావా అని రాధమ్మ అంటుంది. తనకు పొలం పనులు వస్తాయో లేదో నాకెలా తెలుస్తుందని రంగా అంటాడు. క్యాబ్ డ్రైవర్‍గా చూశారా అని వసుధార అంటే.. మీకు డ్రైవింగ్ వచ్చా అని రంగా అంటే.. వచ్చు సార్. గతంలో రిషి సార్ నేర్పించారు అని వసుధార అంటుంది. తర్వాత మేడమ్‌ను చూస్తే బాగా చదువుకున్నవాళ్లలా అనిపిస్తుంది. అందుకే చదువు చెప్పే పని చూశాను. స్కూల్ విద్యార్థులకు చెప్పాలి. హెడ్ మాస్టర్‌తో మాట్లాడుతా. ఆయన నా మాట కాదనరు అని రంగా అంటాడు.

టిఫిన్ చేయమన్న సరోజ

దాంతో వసుధార సంతోషపడుతుంది. తాను చదువు చెబుతానని వసుధార అంటుంది. దాంతో ఇద్దరూ హెడ్ మాస్టర్‌ను కలవడానికి వెళ్లాలనుకుంటారు. వసుధార రెడీ అయి వస్తానని వెళ్తుంది. మరోవైపు రంగా బుజ్జి బట్టల కోసం చేసిన అప్పు గురించి మాట్లాడుకుంటారు. నాలుగు రోజులు గట్టిగా ఆటో తీస్తే అప్పు తీర్చొచ్చు అని రంగా అంటాడు. ఇంతలో సరోజ వచ్చి టిఫిన్ చేయమని, పెసరట్టు ఉప్మా తెచ్చినట్లు చెబుతుంది. క్యారెయర్ ఇద్దరికీ ఇస్తుంది.

రంగా చేతులు కడుక్కుని వస్తాడు. ఇంతలో రంగా తెచ్చిన డ్రెస్ వేసుకుని వసుధార కనిపిస్తుంది. వసుధారను చూసిన రంగా అలాగే చూస్తూ ఉండిపోతాడు. చాలా బాగుంది అన్నట్లుగా రంగా ఎక్స్‌ప్రెషన్ ఉంటుంది. రంగా అలాగే చూస్తూ ఉంటే సరోజ స్పృహలోకి వచ్చేదాకా తడుతుంది. ఇప్పుడు బయటకు వెళ్లేపని ఉందని, వచ్చాకా టిఫిన్ చేస్తానని, లేట్ అయితే హెడ్ మాస్టర్ వెళ్లిపోతాడు అని అంటాడు రంగా. దాంతో మేడమ్‌కు టీచర్ జాబ్ చూశాడని బుజ్జి చెబుతాడు.

ఎమోషనల్ అయిన రంగా

తర్వాత వసుధార, రంగా మాత్రమే వెళ్లిపోతారు. సరోజ, బుజ్జి అలా చూస్తూ ఉండిపోతారు. సరోజ అన్న మారిపోయాడు. చాలా మారిపోయాడు. తినడానికి వచ్చేవాడు కూడా తినకుండా వెళ్లిపోయాడంటే ఏంటీ. ఇంతకుముందు నువ్ పెట్టింది తినకుండా ఉన్నాడా. ఆ మేడమ్ గారు ఏం చెబితే అలా తల ఆడిస్తున్నాడు. ఇలా అయితే కష్టమే. నేను పెసరట్టు లాగిస్తాను అని బుజ్జి అంటాడు. దాంతో ఏంట్రా లాగించేది అని టిఫిన్ కిందపడేస్తుంది సరోజ.

ఆటోలో వెళ్తుంటే.. ఏంటీ సార్ అలా చూస్తున్నారు ఏమైంది. మీరు ఎమోషనల్‌గా చూస్తున్నారు అని వసుధార అడుగుతుంది. ఏం లేదు. ఈ డ్రెస్సులో మిమ్మల్ని చూస్తుంటే ఇంకొకరు గుర్తుకు వస్తున్నారని రంగా అంటాడు. ఎవరు సరోజ అని వసుధార అంటుంది. కాదు. మా అమ్మ. మా అమ్మ నాకోసం పరితపిస్తూ ఉండేది. నేను బాగుండాలని కష్టాలన్ని మా అమ్మ అనుభవించేది. ఎంత బాధ ఉన్న మనసులో పెట్టుకుని నా ముందు సంతోషంగా ఉండేది. మా అమ్మ నాకోసం చాలా చేసింది. బాగా చూసుకోవాలనుకున్నాను అని రంగా అంటాడు.

బాధపడిన వసుధార

కానీ, అన్ని మనం అనుకున్నట్లు జరగవు కదా మేడమ్. మా బంధంపైన దేవుడికి అసూయ పుట్టిందేమో. మా బంధానికి ముగింపు పలికాడు. అమ్మ అంటే ఒక జ్ఞాపకంగా మిగిలేలా చేశాడు. మా అమ్మ గారు చనిపోయారు మేడమ్ గారు. కానీ, మా అమ్మ నాతోనే ఉంది మేడమ్ గారు. ఇక్కడ నా గుండెల్లో పదిలంగా తన జ్ఞాపకాలను పదిలంగా దాచుకున్నాను అని రంగా ఎమోషనల్‌గా చెబుతాడు. జగతి గురించి వసుధార తలుచుకుని ఏడుస్తుంది.

అది చూసిన రంగా క్షమించండి. మా అమ్మ గురించి చెప్పి బాధపెట్టాను. నిజానికి నా ఫీలింగ్స్ ఎవరికీ చెప్పను. మీకు చెప్పాలనిపించి చెప్పాను. అయినా నాకు ఈ బాధ అలవాటే. మీరు బాధపడకండి అని రంగా అంటాడు. ఇంతలో స్కూల్ వస్తుంది. స్కూల్ చూసి వసుధార చాలా సంతోషిస్తుంది. స్కూల్ లైఫ్ మళ్లీ తిరిగి రాదు కదా. చిన్నతనంలో చేసిన అల్లరి భలేగా ఉండేది. జీవితంలో ఎవరు వచ్చిన స్కూల్ ఫ్రెండ్స్‌తో ఉండే బాండింగ్ వేరే అండి అని రంగా అంటాడు.

సర్టిఫికేట్ తీసుకొచ్చారా

కరెక్ట్ అందరికీ స్కూల్ లైఫ్ చాలా స్పెషల్. కానీ, నాకు మాత్రం కాలేజీ లైఫ్ చాలా స్పెషల్. నా కాలేజే నా లైఫ్‌కు టర్నింగ్ ఇచ్చింది. అక్కడే నాకు బాగా కావాల్సినవాళ్లను కలుసుకున్నాను అని వసుధార చెబుతుంది. మళ్లీ రిషి గురించే చెప్పబోతుందని డౌట్ వచ్చి స్కూల్ లోపలికి తీసుకెళ్తాడు రంగా. హెడ్ మాస్టర్‌ను కలిసి వసుధార గురించి చెబుతాడు రంగా. మా కాలేజీలో వేకెన్సీ చాలా ఉంది. ప్రభుత్వానికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవట్లేదు. టెంపరరీగా అయినా ఇలా వేకెన్సీ ఫిల్ చేయాలనుకుంటున్నామని హెడ్ మాస్టర్ అంటాడు.

రంగా స్కూల్ కోసం చాలా హెల్ప్ చేస్తుంటాడని హెడ్ మాస్టర్ అంటే.. స్కూల్‌కే కాదు చాలా మందికి హెల్ప్ చేస్తుంటారు అని వసుధార మనసులో అనుకుంటుంది. మీ సర్టిఫికేట్స్ తీసుకొచ్చారా అని హెడ్ మాస్టర్ అడిగితే.. అది అని వసుధార ఇబ్బంది పడుతుంది. ఇంతలో ఎపిసోడ్ ముగుస్తుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం