Guppedantha Manasu: గుప్పెడంత మనసు రీ టెలికాస్ట్ - ఫ్యాన్స్ ఫుల్ ఖుషి - కొత్త రూమర్‌లో నిజమెంతా?
07 October 2024, 11:02 IST
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రీ టెలికాస్ట్ కాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. గురువారం నుంచి శనివారం వరకు వారంలో మూడు రోజులు ఈ సీరియల్‌ను తిరిగి ప్రసారం చేయాలని స్టార్ మా నిర్ణయించుకున్నట్లు చెబుతోన్నారు. గుప్పెడంత మనసు రీ టెలికాస్ట్ న్యూస్‌పై ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు.
గుప్పెడంత మనసు సీరియల్
Guppedantha Manasu: గుప్పెడంత మనసు సీరియల్ రీ టెలికాస్ట్ కాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ సీరియల్ పట్ల అభిమానుల్లో ఉన్న ఆదరణను దృష్టిలో పెట్టుకొని మరోసారి సీరియల్‌ను తిరిగి ప్రసారం చేయాలని స్టార్ మా నిర్ణయించుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
వారంలో మూడు రోజులు మాత్రమే...
ఇదివరకు ఈ సీరియల్ సోమవారం నుంచి శనివారం వరకు వారంలో ఆరు రోజులు స్టార్ మాలో ప్రసారమయ్యేది. అయితే రీ టెలికాస్ట్‌లో కేవలం మూడు రోజులు మాత్రమే ప్రసారం కానున్నట్లు చెబుతోన్నారు. గురువారం నుంచి శనివారం వరకు సాయంత్రం ఐదున్నర గంటల నుంచి ఆరు గంటల స్లాట్‌ను గుప్పెడంత మనసు సీరియల్ కోసం స్టార్ మా కేటాయించినట్లు చెబుతోన్నారు.
ఫ్యాన్స్ హ్యాపీ...
గుప్పెడంత మనసు రీ టెలికాస్ట్ కానుందనే వార్త చూసి సీరియల్ ఫ్యాన్స్ ఖుషి అవుతోన్నారు. రిషిధారల ప్రేమకథను మళ్లీ చూడబోతుండటం ఆనందంగా ఉందని అంటున్నారు. మరికొందరు నెటిజన్లు గుప్పెడంత మనసుకు సీక్వెల్ వస్తే బాగుంటుందని అంటున్నారు.
ఆగస్ట్ 31తో ముగింపు...
గుప్పెడంత మనసు సీరియల్‌కు ఆగస్ట్ 31తో ఏండ్ కార్డ్ వేసింది స్టార్ మా. డీబీఎస్‌టీ కాలేజీని తమ సొంతం చేసుకునేందుకు దేవయాని, శైలేంద్ర చేసిన కుట్రలు రిషికి తెలిసిపోయినట్లుగా చూపించారు. దేవయాని, శైలేంద్ర మంచి మనుషులుగా మారినట్లు చూపించి సీరియల్‌కు మేకర్స్ ఎండ్ కార్డ్ వేశారు. అంతే మను, రిషి సొంత అన్నదమ్ములు అంటూ ఓ ట్విస్ట్ కూడా ఇచ్చారు.
1168 ఎపిసోడ్స్...
గుప్పెడంత మనసు సీరియల్‌ను అర్ధాంతరగా ముగించడం పట్ల ఫ్యాన్స్ అసంతృప్తిగా ఫీలయ్యారు. బిగ్‌బాస్ కోసమే కావాలనే అసంపూర్తిగా సీరియల్‌ను ముగించారంటూ కామెంట్స్ చేశారు. దాదాపు మూడున్నరేళ్ల పాటు టెలికాస్ట్ అయిన ఈ సీరియల్ 1168 ఎపిసోడ్స్‌తో ముగిసింది.
గుప్పెడంత మనసు సీరియల్‌లో రిషి పాత్రలో ముఖేష్ గౌడ, వసుధారగా రక్షా గౌడ నటించారు. ఈ సీరియల్ తెలుగులో వీరిద్దరికి మంచి పేరుతెచ్చిపెట్టింది. సాయికిరణ్, సురేష్‌బాబు, సంగీత ప్రధాన పాత్రలు పోషించారు. కన్నడంలో హొంగనాసు పేరుతో గుప్పెడంత మనసు డబ్ అయ్యింది. అక్కడ కూడా ముఖేష్ గౌడ, రక్షా గౌడ లీడ్ రోల్స్ చేశారు.
రెండు సినిమాలు...
గుప్పెడంత మనసు రిషి ప్రస్తుతం రెండు సినిమాలు చేస్తున్నాడు. తెలుగులో గీతాశంకరం మూవీలో నటిస్తోన్నాడు. కన్నడ, తెలుగు భాషల్లో ప్రియమైన నాన్నకు పేరుతో మరో మూవీని అంగీకరించాడు. వచ్చే ఈ ఏడాదిఈ రెండు సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి