తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu July 29th Episode: రిషి ఈజ్ బ్యాక్ - ఎట్ట‌కేల‌కు నిజం బ‌య‌ట‌పెట్టిన రంగా - వ‌సుధార సంబ‌రం

Guppedantha Manasu July 29th Episode: రిషి ఈజ్ బ్యాక్ - ఎట్ట‌కేల‌కు నిజం బ‌య‌ట‌పెట్టిన రంగా - వ‌సుధార సంబ‌రం

29 July 2024, 9:07 IST

google News
  • Guppedantha Manasu Serial: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌ జూలై 29 ఎపిసోడ్‌లో తానే రిషి అనే విష‌యాన్నిత‌ల్లి ఫొటో ముందు బ‌య‌ట‌పెడ‌తాడు రంగా. రిషిగా చేయ‌లేని కొన్ని ప‌నుల‌ను రంగాగా చేయ‌డానికి ఈ నాట‌కం ఆడాల్సివ‌చ్చింద‌ని అంటాడు.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్‌

Guppedantha Manasu Serial: శైలేంద్ర డీల్‌కు ఒప్పుకున్న రంగా అత‌డితో క‌లిసి సిటీకి వెళ‌తాడు. తాను వెళ్లిపోతూ వ‌సుధార‌కు ఓ గిఫ్ట్ బాక్స్ ఇవ్వ‌మ‌ని నాన‌మ్మ‌కు ఇస్తాడు. రంగా ఇచ్చిన గిఫ్ట్ బాక్స్‌ను ఓపెన్ చేసి వ‌సుధార ఎమోష‌న‌ల్ అవుతుంది. రిషి త‌న‌కు ఇచ్చిన ప్రేమ జ్ఞాప‌కాలు అన్ని ఆ గిఫ్ట్ బాక్స్‌లో ఉంటాయి.

రిషి, వ‌సుధార పెళ్లి ఫొటో కూడా ఉంటుంది. వ‌సుధార‌ను తాను రాసిన ఫ‌స్ట్ ల‌వ్ లెట‌ర్‌ను కూడా గిఫ్ట్ బాక్స్‌లో రిషి పెడ‌తాడు. అవ‌న్నీ చూసి రంగానే త‌న రిషి అని వ‌సుధార సంబ‌ర‌ప‌డుతుంది. మీరే నా రిషి అని వీటి సాక్షిగా నాకు చెప్పారా అంటూ వ‌సు త‌న‌లో తాను అనుకుంటూ సంతోషంలో తేలియాడ‌తుంది.

రిషి క‌న్నీళ్లు...

జ‌గ‌తి ఫొటో చూడ‌గానే రిషి క‌న్నీళ్లు పెట్టుకుంటాడు. త‌ల్లి త‌నకు దూర‌మైన సంఘ‌ట‌న‌లు గుర్తుచేసుకొని ఎమోష‌న‌ల్ అవుతాడు. నేనే రిషి అని ఈ పాటికి వ‌సుధార‌కు తెలిసే ఉంటుంద‌ని రిషి మ‌న‌సులో అనుకుంటాడు. నేను ఎక్క‌డ ఉంటావ‌ని ఆలోచిస్తుంటావు...నా మ‌న‌సులో నువ్వు ఉన్నావ‌ని మొద‌టిసారి గుర్తించిన దేవ‌త ద‌గ్గ‌ర ఉన్నాన‌ని రిషి అనుకుంటాడు.

వ‌సుధార‌కు నేనే ప్రాణం...

మీరు చెప్పిందే నిజం..మీ శిష్యురాలికి ప్రాణం నేనే. నేను చ‌నిపోయాన‌ని లోకం మొత్తం న‌మ్మిన వ‌సుధార మాత్రం న‌మ్మ‌లేద‌ని జ‌గ‌తి ఫొటో చూస్తూ రిషి అంటాడు. వ‌సుధార న‌మ్మ‌క‌మే నిజ‌మైంద‌ని, నేను బ‌తికే ఉన్నాన‌ని రిషి చెబుతాడు. నేను రాధ‌మ్మ మ‌న‌వ‌డు రంగాను కాదు..

మీ కొడుకు రిషిని అని జ‌గ‌తి ఫొటో ముందు అస‌లు నిజాన్ని బ‌య‌ట‌పెడ‌తాడు రంగా కొన్ని ప‌రిస్థితుల్ల వ‌ల్ల వ‌సుధార ద‌గ్గ‌ర కూడా ఈ నిజం దాచాల్సి వ‌చ్చింద‌ని రంగా అంటాడు. త‌న వ‌ల్ల వ‌సుధార‌కు ఎలాంటి వేద‌న ఉండ‌కూడ‌ద‌నే ఆమెకు దూరంగా వెళ్లిపోవాల్సివ‌చ్చింద‌ని రంగా బాధ‌ప‌డ‌తాడు. రిషిలా చేయ‌లేని కొన్ని ప‌నులు రంగాలా చేసి చూపిస్తాన‌ని మ‌న‌సులో అనుకుంటాడు. మ‌రోవైపు రిషి... రంగాలా ఎందుకు మారాడో తెలుసుకోవాల‌ని వ‌సుధార అనుకుంటుంది.

రిషి చెడ్డ‌వాడా?

జ‌గ‌తి ఫొటో వైపు రంగా త‌దేకంగా చూస్తుండ‌గా అత‌డి భుజంపై శైలేంద్ర చేయివేస్తాడు. ఈ ఫొటో ఎవ‌రిదని శైలేంద్ర‌ను అడుగుతాడు రంగా. మీ అమ్మ అంటూ శైలేంద్ర బ‌దులిస్తాడు. ఈవిడ‌ను చూడ‌గానే మా అమ్మ గుర్తొచ్చింద‌ని రంగా అంటాడు. రిషి బ‌తికి ఉండ‌గా ఏ రోజు జ‌గ‌తిని అమ్మ అని పిల‌వ‌లేద‌ని, త‌ల్లిని చాలా ద్వేషించేవాడ‌ని శైలేంద్ర చెబుతాడు. ఆ పిలుపు కోసం పిన్ని ఎన్నో ఏళ్లు ఎదురుచూసింద‌ని శైలేంద్ర అంటాడు.

జ‌గ‌తి చ‌నిపోయే చివ‌రి క్ష‌ణాల్లోనే రిషి ఆమెను త‌ల్లిగా అంగీక‌రించాడ‌ని, జ‌గ‌తిని అమ్మ అని పిలిచాడ‌ని శైలేంద్ర జ‌రిగిన క‌థ మొత్తం చెబుతాడు. రిషి చెడ్డ‌వాడా అని రంగా డౌట్‌ప‌డ‌తాడు. ఎంత మాట అన్న‌వ్ బ్ర‌ద‌ర్‌...రిషి చాలా మంచివాడంటూ శైలేంద్ర నిజం చెబుతాడు.

కానీ త‌ల్లి విష‌యంలో మాత్రం రిషి చాలా క‌ఠినంగా వ్య‌వ‌హ‌రించాడ‌ని శైలేంద్ర బ‌దులిస్తాడు. ఇప్పుడు ఇద్ద‌రు స్వ‌ర్థంలో ఉండిఉంటార‌ని, అక్క‌డే త‌ల్లికొడుకుల‌ ప్రేమ‌ను అనందంగా అనుభ‌విస్తూ ఉంటార‌ని శైలేంద్ర మంచివాడిలా డైలాగ్‌లు చెబుతాడు.

నోరు జారిన రంగా...

త‌ల్లి మ‌న‌సును అర్థం చేసుకోలేని నేను చాలా మూర్ఖుడిని అంటూ రంగా నోరు జారుతాడు. శైలేంద్ర డౌట్ ప‌డ‌తాడు. అదే త‌ల్లి ప్రేమ‌ను అర్థం చేసుకోలేని రిషి గురించి చెబుతున్నానంటూ క‌వ‌ర్ చేస్తాడు. రిషి వాకింగ్ స్టైల్‌, మ్యాన‌రిజ‌మ్స్‌ను రంగా చేత ప్రాక్టీస్ చేయిస్తాడు శైలేంద్ర‌.

అచ్చం రిషిలానే క‌నిపించి శైలేంద్ర‌కు షాకిస్తాడు రంగా. ఏంటి అన్న‌య్య ఇక్క‌డ ఉన్నావేంటి అని రిషిలాగే శైలేంద్ర‌తో డైలాగ్ చెబుతాడు. రంగా ప‌ర్ఫార్మెన్స్ చూసి రిషిలాగ కాదు రిషి క‌ళ్ల ముందుకు వ‌చ్చిన‌ట్లు ఉంద‌ని శైలేంద్ర అంటాడు. ఇలాగే న‌టిస్తే నిన్ను ఎవ‌రూ గుర్తుప‌ట్ట‌లేర‌ని చెబుతాడు.

డాడ్ గురించి ఎంక్వైరీ...

డాడ్ ఎక్క‌డ ఉన్నార‌ని శైలేంద్ర‌ను అడుగుతాడు రంగా. మా బాబాయ్‌ని రిషి డాడ్ అని పిలుస్తాడ‌ని నేను నీకు చెప్ప‌లేదుగా శైలేంద్ర అనుమానంగా రంగాను అడుగుతాడు. . రిషి నాలాగా ప‌ల్లెటూళ్ల‌లో పుట్ట‌లేద‌ని, పెద్ద పెద్ద చ‌దువులు చ‌దివాడు, సిటీలో పుట్టి పెరిగాడు కాబ‌ట్టి డాడ్ అనే పిలుస్తాడ‌ని ఊహించి అలా అన్నాన‌ని రంగా అంటాడు.

ప్లాన్ ఇదే...

రేపు కాలేజీని గ‌వ‌ర్న‌మెంట్ హ్యాండోవ‌ర్ చేసుకోబోతుంద‌ని, అదే టైమ్‌లో నువ్వు కాలేజీలోకి ఎంట్రీ ఇవ్వాల‌ని రంగాకు త‌న ప్లాన్ మొత్తం వివ‌రిస్తాడు శైలేంద్ర‌. నేను క్షేమంగా తిరిగి వ‌చ్చాను కాబ‌ట్టి కాలేజీ ఎండీ బాధ్య‌తల గురించి ఆలోచించి నిర్ణ‌యం తీసుకుంటాన‌ని బోర్డ్ మీటింగ్‌లో ప్ర‌క‌టించాల‌ని రంగాకు చెబుతాడు శైలేంద్ర‌.

త‌న కుటుంబ‌స‌భ్యుల ఫొటోలు చూపిస్తూ ఒక్కొక్క‌రిని ప‌రిచ‌యం చేస్తారు. ఎవ‌రిని ఏమ‌ని పిల‌వాలో చెబుతాడు. తండ్రి ఫొటోను చూసి ఇత‌డు మ‌హేంద్ర అని రంగా నోరుజారుతాడు. మా బాబాయ్ పేరు నేను చెప్ప‌కుండా నీకు ఎలా తెలిసింది రంగాను నిల‌దీస్తాడు శైలేంద్ర‌. మీరే చెప్పార‌ని రంగా బుకాయిస్తాడు.

వసుధారకు క్లారిటీ…

రిషి ఎక్క‌డికి వెళ్లాడా అని వ‌సుధార ఆలోచిస్తుంటుంది. అప్పుడే అక్క‌డికి వ‌స్తాడు బుజ్జి. రంగా ఇచ్చిన రింగ్‌తో పాటు శైలేంద్ర‌తో అత‌డు క‌లిసి దిగిన ఫొటోను చూపిస్తాడు. రిషితో శైలేంద్ర ఉండ‌టం చూసి వ‌సుధార షాక‌వుతుంది. రిషిని శైలేంద్ర‌ ఎందుకు క‌లిశాడు, ఇద్ద‌రు ఎక్క‌డికి వెళ్లి ఉంటారా అని ఆలోచిస్తుంది.

ఇద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన డీల్ గురించి బుజ్జి ద్వారా తెలుసుకుంటుంది. రంగాకు శైలేంద్ర డ‌బ్బులు కూడా ఇచ్చాడ‌నే విష‌యం బ‌య‌ట‌పెడ‌తాడు. అత‌డి మాట‌ల‌తో శైలేంద్ర‌తో క‌లిసి రిషి అత‌డి ఇంటికి వెళ్లిన‌ట్లు అర్థం చేసుకుంటుంది. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం