Guppedantha Manasu Serial: శైలేంద్ర కోసం రిషిగా మారనున్న రంగా - విలన్స్ చేతిలోకి కాలేజీ - వసుధారతో సరోజ రచ్చ!
Guppedantha Manasu Serial: గుప్పెడంత మనసు సీరియల్ జూలై 24 ఎపిసోడ్‌లో రిషి రూపంలో రంగా ద్వారా డీబీఎస్‌టీ కాలేజీని తమ సొంతం చేసుకోవాలని శైలేంద్ర, దేవయాని ప్లాన్ వేస్తారు. అతడిని ఎలాగైనా సిటీకి తీసుకురావాలని అనుకుంటాడు.
Guppedantha Manasu Serial: రంగా గురించి ఎంక్వైరీ చేయడానికి అతడి ఇంటికి వస్తాడు శైలేంద్ర. అతడి కంట వసుధార పడకుండా తెలివిగా ప్లాన్ చేసి ఆమెను దాచేస్తాడు రంగా. ఆటో కడుతుతున్నట్లుగా నటిస్తూ వసుధారపై కావాలనే నీళ్లు పోస్తాడు. తడిచిపోయిన డ్రెస్‌ను మార్చుకోవడానికి వసుధార లోపలికి వెళ్లగానే బయటి నుంచి డోర్ గడియపెడతాడు. శైలేంద్ర వాయిస్‌ను వసుధార గుర్తుపడుతుంది. కానీ డోర్ గడియపెట్టి ఉండటంతో అతడిని కలవలేకపోతుంది.
రిషి కాదు రంగానే...
శైలేంద్రను తీసుకొని సరోజ ఇంటికి బయలుదేరుతాడు రంగా. దారిలో రంగా స్నేహితుడితో పాటు ఓ బామ్మ, మరికొందరు ఊరివాళ్లు కూడా ఎదురై రంగా బాగోగులు కనుక్కుంటారు. వారందరూ చిన్నతనం నుంచి రంగా తెలిసినట్లుగా మాట్లాడటంతో అతడు రిషి కాదు రంగా అనే శైలేంద్ర ఫిక్సవుతాడు.
ఎంక్వైరీ కంప్లీట్...
తన ఎంక్వైరీ పూర్తికావడంతో సరోజ ఇంటికి వెళ్లకుండానే తనకు అర్జెంట్ పని పడిందని సిటీకి వెళ్లాలని రంగాతో చెబుతాడు శైలేంద్ర. సరోజ సంబంధం మాకు నచ్చిందని ఈ విషయం నువ్వే మీ మావయ్యకు చెప్పాలని రంగాతో అంటాడు శైలేంద్ర.వెళ్లబోతూ వసుధార ఫొటోను రంగాతో పాటు బుజ్జికి చూపించి ఈ అమ్మాయిని ఎక్కైడైనా చూశారా అని అడుగుతాడు శైలేంద్ర. వసుధార ఫొటో చూసి బుజ్జిషాకవుతాడు. అతడు నిజం చెప్పబోతుండగా రంగా అడ్డుకుంటాడు. ఈ అమ్మాయిని మేము ఎప్పుడు చూడలేదని అబద్ధం ఆడుతాడు.
బుజ్జి అనుమానం...
రంగా అబద్ధం ఆడటం చూసిబుజ్జిలో అనుమానం మొదలవుతుంది. వసుధారపై కావాలనే నీళ్లుపోయడం,శైలేంద్రకు ఆమె కనిపించకుండా దాచేయడం...ఇప్పుడు ఫొటోలో వసుధారను చూసి తెలియదని అనడం చూసి రంగా విషయంలో డౌట్ పడతాడు. వసుధార చెప్పినట్లు రంగానే రిషి అనుకుంటాడు. వసుధార తెలియదని ఎందుకు చెప్పావని రంగాను అడుగుతాడు బుజ్జి.
శైలేంద్ర ప్రవర్తనపై అనుమానంతోనే అలా అబద్ధం ఆడానని రంగా అంటాడు. వసుధార ఫొటో శైలేంద్ర దగ్గర ఎందుకు ఉందా అని బుజ్జి తన మనసులో ఉన్న డౌట్‌ను బయటపెడతాడు. అదే నాకు తెలియడం లేదని రంగా బదులిస్తాడు.
సరోజ ఫైర్...
రంగా, శైలేంద్రలను వెతుక్కుంటూ సరోజ ఇంటికొస్తుంది వసుధార. కానీ అక్కడ రంగా కనిపించడు. రంగా కోసం వచ్చిన వసుధారపై సరోజ ఫైర్ అవుతుంది. నువ్వు ఉండగా మా బావ నా దగ్గరకు ఎందుకొస్తాడని దెప్పిపొడుస్తుంది.
మా బావ నన్ను పెళ్లిచేసుకోకపోవడానికి, మా నాన్న నాకు మరొకరితో పెళ్లి ఫిక్స్ చేయడానికి కారణం నువ్వే అంటూ వసుధార పట్ల తన మనసులో ఉన్న ద్వేషం మొత్తం బయటపెడుతంది సరోజ.
బావ అంటే నాకు ప్రాణం..బావకు నేను అంటే ఇష్టం...కానీ నువ్వే బావ మనసులో నా పట్ల ఉన్న ఇష్టం , ప్రేమ మొత్తాన్ని చంపేశావని, రిషి అంటూ పిలుస్తూ అతడిని నీ వైపుకు తిప్పుకున్నావని కోప్పడుతుంది. అసలు నీ రిషి ఉన్నాడో చచ్చాడో తెలియదని నోరు జారుతుంది సరోజ.
అప్పుడే అక్కడికి ఎంట్రీ ఇచ్చిన రంగా నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని సరోజను హెచ్చరిస్తాడు. తెలియకుండా ఓ మనిషిపై నిందలు వేయద్దని అంటాడు.
ఈ జన్మకు జరగదు…
నిన్ను వసుధార రిషి అని ఎందుకు పిలుస్తుంది...ఆ రిషి నిజంగా నువ్వేనా అని రంగాను అడుగుతుంది సరోజ. కాదని రంగా బదులిస్తాడు. రంగా అయితే వసుధారను ఎందుకు భరిస్తున్నావని నిలదీస్తుంది. అది నా ఇష్టం అని రంగా సమాధానం చెబుతాడు.
ఇవన్నీ కాదు నీ మనసులో నేను ఉన్నానా లేదా ఇప్పుడే చెప్పాలని రంగాను నిలదీస్తుంది సరోజ. నువ్వే కాదు నా మనసులో ఎవరూ లేరని రంగా ఆన్సర్ ఇస్తాడు. . నాకు నువ్వు కావాలని సరోజ అంటుంది. అది ఈ జన్మకు జరగదని రంగా తేల్చేస్తాడు. వసుధారను అనవసరంగా నిందించడం కరెక్ట్ కాదని సరోజకు క్లాస్ ఇస్తాడు.
పెళ్లి చేసుకోనన్న సరోజ…
పెళ్లివాళ్లు మా ఇంటికి వచ్చారని, సరోజ నచ్చిందని చెప్పామన్నారని మావయ్యతో అంటాడు రంగా. నేను ఈ పెళ్లిచేసుకోనని సరోజ పట్టుబడుతుంది. నా కోసం ఈ పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే ఎలాంటి ప్రయోజనం ఉండదని సరోజకు చెప్పి వసుధారను తీసుకొని అక్కడి నుంచి వెళ్లిపోతాడు రండా.
పేరు కూడా తెలియదు…
సరోజను చూడటానికి వచ్చిన పెళ్లివారు మీకు తెలుసా అని రంగాను అడుగుతుంది వసుధార. తెలియదని రంగా బదులిస్తాడు. కనీసం వారి పేర్లు అయినా తెలుసానని వసుధార మరో ప్రశ్న వేస్తుంది. అది కూడా తెలియదని కోపంగా రంగా అనడం వసుధార సెలైంట్ అవుతుంది.
ఇంట్లో వాళ్లు మీకు ఫోన్ చేయాలంటే మీ దగ్గర ఫోన్ లేదు...మీకు మీ ఇంట్లో వాళ్ల నంబర్ తెలిసి కూడా వారికి ఎందుకు ఫోన్ చేయడం లేదని వసుధారను అడుగుతాడు బుజ్జి. ఒకవేళ రిషి ఇంటికి తిరిగొచ్చి మీ కోసం ఎదురుచూస్తున్నాడు కావచ్చునని, మీ ఇంటికి వెళ్లిపోతే మంచిదని వసుధారకు సలహా ఇస్తాడు బుజ్జి. ఈ మాట నువ్వే అంటున్నావా మీ రంగా అడగమన్నాడా అని వసుధార తిరిగి ప్రశ్నిస్తుంది.
శైలేంద్ర ఆనందం...
తన ఎంక్వైరీలో రంగా గురించి కనిపెట్టిన విషయాలు ఫోన్ చేసి తల్లికి చెబుతాడు శైలేంద్ర. రంగాను చిన్నప్పటి నుంచి చూశామని, పల్లెటూరిలోనే పెరిగాడని ప్రతి ఒక్కరూ చెప్పారని శైలేంద్ర అంటాడు. వసుధార ఫొటో రంగాకు చూపించి ఈవిడ తెలుసా అని అడిగితే తెలియదని అతడు బదులిచ్చాడని శైలేంద్ర అంటాడు. రంగా రూపంలో ఉన్నది రిషి కాదని, రిషి లేడు, ఇక రాడని శైలేంద్ర తేల్చేస్తాడు.
రిషి ద్వారా కాలేజీ సొంతం...
డీబీఎస్‌టీ కాలేజీ దక్కించుకోవడానికి, నువ్వు ఎండీ కావడానికి రంగా మనకు మంచి అవకాశం ఇచ్చాడని కొడుకుతో అంటుంది దేవయాని. రిషి వసుధార ఇద్దరిలో ఏ ఒక్కరు ఎండీగా నీ పేరు చెబితే...నీకే ఆ పదవి ఇస్తానని మినిస్టర్ అన్న మాటలను శైలేంద్రకు దేవయాని గుర్తుచేస్తుంది. రంగాను రిషిగా మార్చి ఎండీ సీట్ సొంతం చేసుకోవడానికి ప్లాన్ వేస్తారు. ఎలాగైనా రంగాను సిటీకి తీసుకురావాలని అనుకుంటారు. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.