Guppedantha Manasu August 5th Episode: శైలేంద్ర కాలర్ పట్టుకున్న సరోజ - దేవయాని టెస్ట్‌లో రంగా పాస్ - అలిగిన వసుధార
05 August 2024, 9:16 IST
Guppedantha Manasu August 5th Episode: గుప్పెడంత మనసు ఆగస్ట్ 5 ఎపిసోడ్‌లో రంగాను వెతుక్కుంటూ శైలేంద్ర ఇంటికి వస్తుంది సరోజ. మా బావను ఏం చేశావని శైలేంద్ర కాలర్ పట్టుకొని నిలదీస్తుంది.
గుప్పెడంత మనసు ఆగస్ట్ 5 ఎపిసోడ్
Guppedantha Manasu August 5th Episode: రంగగా తమ ముందు నాటకం ఆడుతుంది రిషి అని అనుమానపడుతుంది దేవయాని. ఆ నిజం బయటపెట్టడానికి టెస్ఠ్ పెడుతుంది. రంగాను వసుధార రూమ్‌లోకి పంపిస్తుంది. వసుధార రూమ్‌లోకి రంగాను ఎందుకు పంపించావని తల్లితో శైలేంద్ర గొడవపతాడు. వాడు రిషినో, రంగానో తెలుసుకోవడానికి ఆ పని చేశానని కొడుకుతో చెబుతుంది దేవయాని.
శైలేంద్రకు క్లాస్…
రిషి అయితే వసుధార రూమ్‌లోనే ఉంటాడు...ఒకవేళ రంగా అయితే రూమ్ నుంచి బయటకు వస్తాడని అంటుంది. రంగా ప్రవర్తన చూస్తుంటే నాకు అనుమానంగా ఉందని, అందుకే ఈ టెస్ట్ పెట్టానని చెబుతుంది.
నువ్వు డౌట్ పడాల్సింది నా మీద కాదని, రంగాపై అని కొడుకుకు క్లాస్ ఇస్తుంది దేవయాని. రంగాది జెన్యూన్ క్యారెక్టర్ అని, డబ్బుల కోసం తప్పనిసరి పరిస్థితుల్లో ఈ నాటకం ఆడుతున్నాడని శైలేంద్ర అంటాడు. ఇప్పుడే ఈ విషయం తేల్చేద్దామని దేవయాని, శైలేంద్ర ఇంట్లోకివస్తారు.
వసుధార ఎమోషనల్...
వీఆర్ అని రాసిన ఉంగరాన్ని చూసి వసుధార ఎమోషనల్ అవుతుంది. వీ ఫర్ వసుధార...ఆర్ ఫర్ అని వసుధార అంటోండగా రంగా అని రిషి సమాధానమిస్తాడు. రంగాగా ఇన్ని రోజులు నన్ను ఏడిపించింది చాలని వసుధార అలుగుతుంది. రిషి, రంగా పేరు ఏదైనా రూపం ఒకటేనని వసుధారను బుజ్జగిస్తాడు మిమ్మల్ని రిషి అని పిలవడమే నాకు ఇష్టం అని వసుధార అంటుంది.
నీతో అలా పిలిపించుకోవడమే నాకు ఇష్టమని రిషి బదులిస్తాడు. రిషిధారలు ఎప్పటికి ఒకటిగానే ఉండాలని వసుధార అంటుంది. రిషికి ఉంగరం ఇచ్చి తన వేలికి తొడగమని చెబుతుంది. వసుధార వేలికి ఉంగరం తొడిగిన రిషి ఆమె చేతిపై ముద్దిస్తాడు. అది చూసి వసుధార సంబరపడుతుంది.
జీవితాంతం రిషి కౌగిలోనే...
రిషి భుజంపై వసుధార వాలిపోతుంది. జీవితాంతం మీ కౌగిలిలో ఒదిగిపోవాలనిపిస్తుందని అంటుంది. మీ లాలన, పాలన, మీ గుండెచప్పుడు, ప్రేమ..నా జీవితానికి ఇవి చాలని, ఇంకేం వద్దని వసుధార ప్రేమగా అంటుంది. ఇవి తప్ప తనకు ఆశలు, ఆశయాలు లేవని చెబుతుంది.
నువ్వు కోరుకుంటున్న ప్రేమను నీకు అందించాలని, జీవితాంతం నీ పెదాలపై చిరునవ్వు, కళ్లలో కాంతిని, ముఖంలో ఆనందాన్ని చూస్తూ బతకాలని అనిపిస్తుందని వసుధారపై తనకున్న ప్రేమను రిషి కూడా బయటపెడతాడు.
రిషి అనుమానం...
వసుధార రూమ్ నుంచి బయటకు వెళ్లబోతాడు రిషి. అతడిని వసుధార ఆపుతుంది శైలేంద్ర దృష్టిలో తాను రంగానని, నీ రూమ్‌లోనే నేను ఉంటే రిషిని అనే సంగతి అతడు కనిపెడతాడని వసుధారకు చెబుతాడు రిషి. నా అనుమానం నిజమైతే శైలేంద్ర, దేవయాని రూమ్ బయటే తన కోసం కనిపెట్టుకొని ఉంటారని వసుధారతో చెప్పి బయటకు వస్తాడు రిషి. అతడు అనుమానించినట్లే శైలేంద్ర, దేవయాని బయటే అతడి కోసం ఎదురుచూస్తుంటారు.
శైలేంద్ర ఆనందం...
రిషి బయటకురావడం చూసి శైలేంద్ర ఆనందపడతాడు. అతడు రంగానేనని తల్లితో చెబుతాడు. తనను వసుధార బంధం నుంచి విముక్తి చేస్తే తాను ఊరెళ్లిపోతానని, ఆమె భర్తగా నటించడం తన వల్ల కాదని శైలేంద్రతో కావాలనే అంటాడు రిషి.
నువ్వు వెళ్లిపోతే కథ మొదటికి వస్తుందని శైలేంద్ర ఆన్సర్ ఇస్తాడు. వసుధార కాలేజీని చూసుకుంటుందని కదా ఇంకా నేను ఎందుకని వెళ్లిపోవాల్సిందేనని రిషి పట్టుపడతాడు. పదే పదే వెళ్లిపోతానని అనకు అని రిషికి దండం పెడతాడు శైలేంద్ర. నువ్వు వెళ్లిపోతా అంటుంటే ప్రాణం పోయేలా ఉందని చెబుతాడు.
రిషి అంటే ఇష్టమేనా...
మీ తమ్ముడు అంటే మీకు నిజంగా ఇష్టమేనా అని శైలేంద్రను అడుగుతాడు రిషి. అతడు కనిపించకుండా పోతే మీరు ఎందుకు వెతకలేదని అనుమానంగా శైలేంద్రతో అంటాడు. రిషి కోసం చాలా వెతికానని, కానీ ఎక్కడ కనిపించలేదని, చివరకు అతడు చనిపోయాడని పోలీసులు చెప్పారని శైలేంద్ర ఆన్సర్ ఇస్తాడు. అయినా అవన్నీ నీకు ఎందుకు అని టాపిక్ డైవర్ట్ చేస్తాడు.
మహేంద్ర కన్నీళ్లు...
మహేంద్ర రూమ్‌లో పడుకోవడానికి వెళతాడు రిషి. కొడుకును చూసి మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. కన్నీళ్లు పెట్టుకుంటాడు. తండ్రిని ఓదార్చుతాడు రిషి. ఇవీ కన్నీళ్లు కాదని, ఆనంద బాష్పాలని మహేంద్ర చెబుతాడు. నువ్వు ఎప్పటికా రావని, నిన్ను చూడలేనని ఇన్నాళ్లు ఎంతో బాధను అనుభవించానని, జీవితం మీదే విరక్తి పుట్టిందని రిషితో అంటాడు మహేంద్ర.
ఎలాంటి ఫీలింగ్స్ లేకుండా మొండిగా బతికానని అంటాడు. నువ్వు నా పక్కన ఉంటే చాలు...ఈ జీవితానికి ఏం అక్కరలేదని మహేంద్ర అంటాడు. నువ్వు నన్ను ఎప్పటికీ వదిలేసి వెళ్లిపోవుగా, నువ్వు వెళ్లిపోతే నా ఊపిరి ఆగిపోతుందని మహేంద్ర ఎమోషనల్ అవుతాడు. మిమ్మల్ని చాలా బాధపెట్టానని తండ్రికి రిషి క్షమాపణలు చెబుతాడు.
మను ఆలోచనలు...
మను ధీర్ఘంగా ఆలోచిస్తుంటాడు. ఏం ఆలోచిస్తున్నావని కొడుకును అడుగుతుంది అనుపమ. రిషిని మహేంద్ర కలిశాడని, తాను మాత్రం తన తండ్రిని కలిసేది ఎప్పుడా అని ఆలోచిస్తున్నానని అంటాడు.
నీ ఎదురుచూపులు, ఓపికకు ఫలితం దక్కేరోజు దగ్గరలోనే ఉందని అనుపమ బదులిస్తుంది. ఒకసారి రిషి, వసుధారలను కలవాలని ఉందని మను అంటాడు. కానీ ఇప్పుడు వద్దని, కొన్నాళ్లు ఆగి వెళదామని అనుపమ కొడుకుతో అంటుంది. ప్రతి చిన్న విషయానికి ఏవేవో కారణాలు చెప్పి ఎందుకు నన్ను ఆపుతున్నావని తల్లిపై ఫైర్ అవుతాడు మను. నీకంటే ఎక్కువగా నాకు వారిని కలవాలని అనిపిస్తుందని, కానీ ఎందుకు ఆగమంటున్నానో అర్థం చేసుకోమని కొడుకుకు సర్ధిచెబుతుంది.
సరోజ ఎంట్రీ...
రంగాను వెతుక్కుంటూ శైలేంద్ర ఇంటికి వస్తుంది సరోజ. ఇంట్లో అడుగుపెడుతూనే మా బావ ఎక్కడ అని ధరణితో గొడవపడుతుంది. ఆమె గొడవకు ఫణీంద్ర, మహేంద్ర కిందకొస్తారు. మీ బావ ఈ ఇంట్లో ఎందుకు ఉంటాడు..నువ్వు ఏదో పొరపడి తప్పుడు అడ్రెస్‌కు వచ్చావని సరోజకు సర్ధిచెప్పబోతాడు మహేంద్ర.
అప్పుడే శైలేంద్ర అక్కడికి వస్తాడు. నువ్వు మా రంగా బావను ఏం చేశావని శైలేంద్ర కాలర్ పట్టుకుంటుంది సరోజ. అది చూసి అందరూ షాకవుతారు. మీ బావ ఎవరో నాకు తెలియదని శైలేంద్ర అంటాడు. నువ్వు అబద్దాలు ఆడుతున్నావని, మీ ఇద్దరికి రంగా తెలుసు, మీరే మా బావను తీసుకెళ్లారని శైలేంద్రతో గొడవ పడుతుంది సరోజ.
రిషి డైలామా...
అప్పుడే రిషి వస్తాడు. అతడిని చూసి సరోజ ఆనందపడుతుంది. సరోజను చూసి రిషి డైలామాలో పడతాడు. నన్ను వదిలేసి ఎందుకెళ్లావు..అమ్మమ్మ కూడా నీ మీద బెంగపెట్టుకుందని రంగా రూపంలో ఉన్న రిషితో అంటుంది. అతడు రంగా కాదని నా కొడుకు రిషి సరోజతో అంటాడు మహేంద్ర. అక్కడితో నేటి గుప్పెడంత మనసు సీరియల్ ముగిసింది.