Guppedantha Manasu August 3rd Episode: రిషి డ‌బుల్ గేమ్ - శైలేంద్ర‌కు చుక్క‌లు చూపించిన వ‌సు - జ‌గ‌తిని చూసిన మ‌హేంద్ర‌-guppedantha manasu august 3rd episode shailendra warns to rishi guppedantha manasu serial today episode ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Guppedantha Manasu August 3rd Episode: రిషి డ‌బుల్ గేమ్ - శైలేంద్ర‌కు చుక్క‌లు చూపించిన వ‌సు - జ‌గ‌తిని చూసిన మ‌హేంద్ర‌

Guppedantha Manasu August 3rd Episode: రిషి డ‌బుల్ గేమ్ - శైలేంద్ర‌కు చుక్క‌లు చూపించిన వ‌సు - జ‌గ‌తిని చూసిన మ‌హేంద్ర‌

Nelki Naresh Kumar HT Telugu
Aug 03, 2024 07:34 AM IST

Guppedantha Manasu August 3rd Episode: గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఆగ‌స్ట్ 3 ఎపిసోడ్‌లో వ‌సుధార‌ను రిషి మేడ‌మ్ అని పిలుస్తాడు. ఆ పిలుపు విని వ‌సుధార అనుమాన‌ప‌డుతుంది. రిషిగా రంగా ఆడుతోన్న నాట‌కం బ‌య‌ట‌ప‌డ‌కుండా దేవ‌యాని, శైలేంద్ర క‌వ‌ర్ చేస్తారు.

గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఆగ‌స్ట్ 3 ఎపిసోడ్‌
గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ఆగ‌స్ట్ 3 ఎపిసోడ్‌

Guppedantha Manasu August 3rd Episode: రంగ‌గా నాట‌కం ఆడుతూ శైలేంద్ర‌, దేవ‌యాని కుట్ర‌ల‌ను బ‌య‌ట‌పెట్టాల‌ని రిషి ఫిక్స‌వుతాడు. శైలేంద్ర, దేవ‌యాని ముందు రిషి, వ‌సుధార పోటీప‌డి యాక్టింగ్ చేస్తూ వారిద్ద‌రిని బోల్తా కొట్టిస్తుంటారు. రంగా రూపంలో ఉన్న‌ది నిజంగానే రిషి అని దేవ‌యాని అపోహ‌ప‌డుతుంది

జ‌గ‌తిని చూపించిన వ‌సుధార‌...

మ‌రోవైపు జ‌గ‌తిని చూపిస్తాన‌ని మ‌హేంద్ర‌తో అంటుంది వ‌సుధార‌. ఆకాశంలో మిణుకుమిణుకు మంటూ మెరుస్తోన్న ఓ న‌క్ష‌త్ర‌మే జ‌గ‌తి అత్త‌య్య అని మ‌హేంద్ర‌కు చెబుతుంది వ‌సుధార‌. జ‌గ‌తి అత్త‌య్య‌ ఆ చుక్క‌లాగా మారిపోయిందంటూ మాట్లాడుతుంది. వ‌సుధార మాట‌ల‌తో జ‌గ‌తి త‌న క‌ళ్ల ముందుకు వ‌చ్చిన‌ట్లుగా మ‌హేంద్ర ఫీల‌వుతాడు. జ‌గ‌తి దేవ‌త‌లా క‌నిపిస్తుంద‌ని ఎమోష‌న‌ల్ అవుతాడు.

అనుప‌మ గురించి ఎంక్వైరీ...

అనుప‌మ‌, మ‌ను క‌నిపించ‌డం లేదు...ఎక్క‌డికి వెళ్లార‌ని మ‌హేంద్ర‌ను అడుగుతుంది వ‌సుధార‌. వాళ్లు ఊరు విడిచి వెళ్లిపోయిన‌ట్లు మ‌హేంద్ర బ‌దులిస్తాడు. త‌న తండ్రి ఎవ‌ర‌న్న‌ది మ‌న‌కు ఇంకా తెలియ‌లేద‌ని మ‌హేంద్ర అంటాడు. . తాను రాసిన లెట‌ర్ మ‌నుకు అంద‌లేద‌నే నిజం తెలిసి వ‌సుధార షాక‌వుతుంది. ఆ లెట‌ర్ మ‌ను కంట ప‌డ‌కుండా శైలేంద్ర‌నే ఏదో చేసి ఉంటాడ‌ని ఊహిస్తుంది.

పాండు పంచ్‌...

వ‌సుధార చంప‌కుండానే చంపాన‌ని అబ‌ద్దం ఆడిన పాండుకు వార్నింగ్ ఇవ్వాల‌ని శైలేంద్ర ఫోన్ చేస్తాడు. కానీ శైలేంద్ర‌కే పాండు పంచ్ ఇస్తాడు. వ‌సుధార‌ను పాతిపెట్టిన గోతిని త‌వ్వి చూశామ‌ని, అందులో ఆమె డెడ్‌బాడీ క‌నిపించ‌డం లేద‌ని అంటాడు. చంపి పాతిపెట్టిన శ‌వం క‌నిపించ‌డం లేద‌ని పోలీస్ కంప్లైంట్ ఇవ్వ‌మ‌ని శైలేంద్ర వెట‌కారంగా పాండుకు ఆన్స‌ర్ ఆస్తాడు.

మంచి ఐడియా ఇచ్చార‌ని, పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన త‌ర్వాత మీకు కాల్ చేస్తాన‌ని పాండు ఫోన్ క‌ట్ చేస్తాడు. వ‌సుధార‌ను రంగా ఊళ్లో తాను చూసింది నిజ‌మేన‌ని శైలేంద్ర ఫిక్స‌వుతాడు. రిషి, వ‌సుధార క‌లిసే నాట‌కం ఆడుతున్నార‌ని భ‌య‌ప‌డ‌తాడు. కానీ ఎండీ సీట్ కోసం ఏం జ‌రిగినా ఎదుర్కోవ‌డానికి సిద్ధంగా ఉండాల‌ని త‌న‌కు తానే ధైర్యం చెప్పుకుంటాడు.

స‌రోజ అనుమానాలు...

నాన‌మ్మ గురించి తెలుసుకోవ‌డానికి బుజ్జికి కాల్ చేస్తాడు రంగా. అత‌డి ద‌గ్గ‌ర నుంచి స‌రోజ ఫోన్ లాక్కుంటుంది. ఎక్క‌డున్నావు...నువ్వు వెళ్లిన‌ప్ప‌టినుంచి వ‌సుధార కూడా క‌నిపించ‌డం లేద‌ని, ఇద్ద‌రు క‌లిసే ఉన్నారా అంటూ రంగాపై ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిసిస్తుంది. రంగా మాత్రం స‌మాధానం చెప్ప‌డు. నిన్ను వెతుక్కుంటూ నేనే వ‌స్తాన‌ని స‌రోజ ఫోన్ క‌ట్ చేస్తుంది. శైలేంద్ర వెంట రంగా వెళ్లాడ‌నే నిజం బ‌య‌ట‌పెడ‌తాడు బుజ్జి. శైలేంద్ర‌, రంగాకు ఉన్న సంబంధం ఏమిటి? వ‌సుధార ఎక్క‌డికి వెళ్లిందో క‌నిపెట్టాల‌ని స‌రోజ ఫిక్స‌వుతుంది.

అనుప‌మ హ్యాపీ...

అనుప‌మ‌కు కాల్ చేస్తాడు మ‌హేంద్ర‌. కానీ మ‌హేంద్ర‌తో మాట్లాడ‌టం ఇష్టం లేక ఫోన్ లిఫ్ట్ చేయ‌దు అనుప‌మ‌. దాంతో మ‌నుకు కాల్ చేసి రిషి, వ‌సుధార తిరిగి వ‌చ్చార‌నే గుడ్‌న్యూస్ చెబుతాడు మ‌హేంద్ర‌. . రిషి తిరిగి వ‌చ్చాడ‌ని తెలియ‌గానే మ‌ను, అనుప‌మ సంతోష‌ప‌డ‌తారు.

శైలేంద్ర ఓవ‌ర్ యాక్టింగ్‌...

వ‌సుధార‌, రిషి క‌లిసి ఉండ‌గా వారి ద‌గ్గ‌ర‌కు శైలేంద్ర వ‌స్తాడు. రిషితో మాట్లాడాల‌ని ఉంద‌ని అంటాడు. వ‌సుధార మాత్రం నీతో రిషి మాట్లాడేది ఏం లేద‌ని కుండ‌బ‌ద్ద‌లుకొట్టిన‌ట్లుగా స‌మాధాన‌మిస్తుంది.

రిషి ఇన్నాళ్లు నా ప‌క్క‌న లేక‌పోవ‌డంతో నా కుడిభుజం విరిగిపోయిన‌ట్లు అయ్యింద‌ని, నాకు అండ‌గా ఉండే త‌మ్ముడు దూర‌మైన బాధ ఎంత‌గానో వేధించింద‌ని రిషిపై ప్రేమ ఉన్న‌ట్లు న‌టిస్తాడు శైలేంద్ర‌. ఎందుకు లేని ప్రేమ‌ను న‌టిస్తారు అంటూ శైలేంద్ర ఓవ‌ర్ యాక్టింగ్‌ను క‌నిపెట్టేస్తుంది. అలా అంటారేంటి మేడ‌మ్ గారు అంటూ రంగాలా మాట్లాడుతాడు రిషి.

మేడ‌మ్ అనే పిలుపు...

న‌న్ను మేడ‌మ్ అని అంటున్నారేంటి? ఆ మేడ‌మ్ ఎవ‌రు అని రిషిని నిల‌దీస్తుంది వ‌సుధార‌. వ‌సుధార‌ను రిషి మేడ‌మ్ అని పిల‌వ‌డం చూసి శైలేంద్ర కంగారు ప‌డ‌తాడు. టాపిక్ డైవ‌ర్ట్ చేయ‌డానికి కిందా మీదా ప‌డ‌తాడు. రిషితో ఒంట‌రిగా మాట్లాడాల‌ని శైలేంద్ర ఎంత ప్ర‌య‌త్నించిన అక్క‌డి నుంచి మాత్రం వ‌సుధార క‌ద‌ల‌దు. ఏం మాట్లాడినా నా ముందే మాట్లాడాల‌ని బెట్టు చేస్తుంది. చివ‌ర‌కు రిషి బ‌తిమిలాడి ఆమెను అక్క‌డినుంచి పంపిస్తాడు.

శైలేంద్ర వార్నింగ్‌..

వ‌సుధార వెళ్లిపోగానే రిషికి వార్నింగ్ ఇస్తాడు శైలేంద్ర‌. నువ్వు రంగా అనే విష‌యం మ‌ర్చిపోవ‌ద్ద‌ని, వ‌సుధార‌తో క్లోజ్ ఉంటే బాగుండ‌ద‌ని, హ‌ద్దులు దాట‌కుండా లిమిట్స్‌లో ఉండ‌మ‌ని హెచ్చ‌రిస్తాడు. వ‌సుధార పిలిచిన‌ప్పుడు వెళ్ల‌క‌పోతే మొద‌టికే మోసం వ‌స్తుంద‌ని, మ‌న నాట‌కం బ‌య‌ట‌ప‌డుతుంద‌ని శైలేంద్ర‌కు చెబుతాడు రిషి. నాకు ఇక్క‌డ ఉండాల‌ని లేద‌ని, వెళ్లిపోవాల‌ని అనిపిస్తుంద‌ని అంటాడు. వ‌సుధార త‌న‌కు స‌మ‌స్యగా మారింద‌ని, ఆమె ద‌గ్గ‌ర‌కు వ‌చ్చిన‌ప్పుడు, నాతో మాట్లాడిన‌ప్పుడు గుండె ద‌డ పెరుగిపోతుంద‌ని తాను రంగా అని శైలేంద్ర‌ను న‌మ్మిస్తాడు.

నిజం తెలిసిన రోజు...

నేను రిషిని కాదు రంగా అని తెలిసిన రోజు న‌న్ను ఎందుకు మోసం చేశార‌ని ఆమె నిల‌దీస్తే ఏం స‌మాధానం చెప్పాలో తెలియ‌డం లేద‌ని అంటాడు. అంత వ‌ర‌కు రావడానికికంటే ముందే నేను ఇక్క‌డి నుంచి వెళ్లిపోతాన‌ని రిషి ప‌ట్టుప‌డ‌తాడు. శైలేంద్ర అత‌డిని బ‌తిమిలాడ‌బోతాడు.

అప్పుడే అక్క‌డికి వ‌సుధార వ‌స్తుంది. నా వ‌ల్ల కావ‌డం లేద‌ని రిషి మీతో ఏదో చెబుతున్నాడ‌ని అదేమిట‌ని శైలేంద్ర‌ను నిల‌దీస్తుంది వ‌సుధార‌. శైలేంద్ర‌, రిషి ఏమ‌ని స‌మాధానం చెప్పాలో తెలియ‌క త‌డ‌బ‌డిపోతుంటారు.

అప్పుడే అక్క‌డికి వ‌చ్చిన దేవ‌యాని క‌వ‌ర్ చేస్తుంది. కానీ రిషి మ‌రోసారి పొర‌ప‌డి వ‌సుధార‌ను మేడ‌మ్ అని పిలిచి దొరికిపోతాడు. రిషి వాల‌కం చూస్తే నాకు ఏదో తేడా కొడుతుంద‌ని వ‌సుధార అనుమాన‌ప‌డుతుంది. ఆమెకు స‌ర్ధిచెప్పి లోప‌లికి పంపిస్తుంది దేవ‌యాని. అక్క‌డితో నేటి గుప్పెడంత మ‌న‌సు సీరియ‌ల్ ముగిసింది.