NG Ranga University : ఎన్‌జీ రంగా వర్సిటీ అగ్రి కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా ప్రవేశాలు, దరఖాస్తు గడువు పొడిగింపు
NG Ranga University : ఆచార్య ఎన్జీ రంగా అగ్రికల్చర్ యూనివర్సిటీలో వ్యవసాయ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్ల దరఖాస్తుల గడువు ఆగస్టు 13 వరకు పొడిగించారు. 2024-25 విద్యా సంవత్సరానికి అగ్రికల్చరల్ బీఎస్సీ కోర్సుల్లో ప్రవేశాలకు ఇటీవల దరఖాస్తులు ఆహ్వానించారు.
NG Ranga University : ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ (ఏఎన్‌జీఆర్‌ఏయూ) వ్యవసాయ కోర్సుల్లో ఎన్ఆర్ఐ కోటా సీట్లకు దరఖాస్తుల దాఖలకు గడువు పొడిగించారు. ఆగస్టు 13 గడువు పొడిగిస్తూ ఏఎన్‌జీఆర్‌ఏయూ నిర్ణయం తీసుకుంది. 2024-25 విద్యా సంవత్సరానికి అగ్రికల్చరల్ బీఎస్సీ చేసేందుకు ఈ దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అగ్రికల్చరల్, అగ్రికల్చరల్ ఇంజినీరింగ్, ఫుడ్ టెక్నాలజీ, కమ్యూనిటీ సైన్స్ వంటి కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ యూనివర్సిటీ పరిధిలోని కళాశాల్లో 2024-25 విద్యా సంవత్సరానికి గానూ అడ్మిషన్లలో ఎన్ఆర్ఐ కోటా కింద కొన్ని సీట్లను అందుబాటులో ఉన్నాయి. వీటికి దరఖాస్తులను యూనివర్సిటీ ఆహ్వానిస్తుంది. అప్లికేషన్ దాఖలు చేసేందుకు 2024 డిసెంబర్ 31 నాటికి 17 ఏళ్లు వయస్సు పూర్తి అయి ఉండాలి. అలాగే 22 ఏళ్లు వయస్సు దాటి ఉండకూడదు.
దరఖాస్తు ఎలా చేయాలి?
దరఖాస్తు ఆఫ్‌లైన్‌లో చేయాల్సి ఉంటుంది. యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్ డైరెక్ట్ లింక్
https://angrau.ac.in/downloads/Admissions/NRI_UG/NRI%20Application%20with%20Brochure%2024-25%20date%20Extended.pdf ను క్లిక్ చేస్తే అప్లికేషన్ ఓపెన్ అవుతుంది. దీన్ని డౌన్‌లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవాలి. అప్లికేషన్‌లో అడిగిన సమాచారాన్ని పూర్తి చేయాలి.
అప్లికేషన్ ఫీజు
అప్లికేషన్ ఫీజు రూ.2,000 ఉంటుంది. దీనిని యూనివర్సిటీ అకౌంట్‌కి ఆన్‌లైన్ ద్వారా, లేక డీడీ రూపంలో ఆఫ్‌లైన్‌లోనై చెల్లించొచ్చు.
- అకౌంట్ పేరు : COMPTROLLER, ANGRAU
- అకౌంట్ నెంబర్ : 921020016224308,
- బ్యాంక్ పేరు : AXIS BANK, GUNTUR,
- ఐఎఫ్ఎస్‌సీ కోడ్ : UTIB0000070 కి చెల్లించాలి.
అలాగే ప్రొసెసింగ్ ఫీజు రూ.4,420 ఉంటుంది. ట్యూషన్ ఫీజు రూ.8,050, హాస్టల్ డిపాజిట్ రూ.8,050, మెస్ అడ్వాన్స్ రూ.8,050, హాస్టల్ ఎస్టాబ్లిస్‌మెంట్ ఛార్జీస్ (ప్రతి నెల) రూ.1,030, లేబొరటొరీ డిపాజిట్ రూ.2,060, హాస్టల్ రూమ్ రెంట్ (ప్రతి సెమిస్టర్) రూ.2,060, లైబ్రరీ డిపాజిట్ రూ.2,060, ఇతర స్పెషల్ ఫీజులు 15,069 కలిపి మొత్తం రూ.46,429 ఉంటుంది.
కోర్సులు...సీట్లు
బీఎస్సీ ఆనర్స్ అగ్రికల్చర్ కోర్సులో 147 సీట్లు, బీటెక్ అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సులో 20 సీట్లు, బీటెక్ ఫుడ్ టెక్నాలజీ కోర్సులో 23 సీట్లు, బీఎస్సీ ఆనర్స్ కమ్యూనిటీ సైన్స్ కోర్సులో 15 సీట్లు అందుబాటులో ఉంటాయి. ఈ కోర్సుల్లో చేరేందుకు రెండేళ్ల ఇంటర్మీడియట్, లేకపోతే 12 ఏళ్ల స్కూలింగ్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయోలజీ, ఇంగ్లీష్, మాథ్యమెటిక్స్ సబ్జిట్స్‌లో సమాన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
అప్లికేషన్‌తో జత చేయాల్సిన ధ్రువీకరణ పత్రాలు
అభ్యర్థి, పేరెంట్స్ రూ.200 స్టాంప్ డ్యూటీపై నోటరీ చేయించాలి. అలాగే స్పాన్సర్ ఉంటే దానికి సంబంధించి కూడా రూ.200 స్టాంప్ డ్యూటీపై నోటరీ చేయించాలి. ఎన్ఆర్ఐ స్టేటస్ సర్టిఫికేట్. ఎస్ఎస్‌సీ మార్క్స్ లిస్టు, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, నాలుగో తరగతి నుంచి 12వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్లు. టీసీ, మైగ్రేంట్ సర్టిఫికేట్, మెడికల్ ఫిట్‌నెస్ సర్టిఫికేట్ తదితర ధ్రువీకరణ పత్రాలు అప్లికేషన్‌కు జత చేయాలి.
అదనపు సమాచారం కోసం ఈ క్రింద ఫోన్ నెంబర్లను సంప్రదించండి.
0863-2347005, 7331148417, 9441127501, 8008987458, 7893520988 ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు సంప్రదించొచ్చు.
జగదీశ్వరరావు జరజాపు, హిందుస్తాన్ టైమ్స్ తెలుగు
సంబంధిత కథనం