HCU Guest Faculty : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, దరఖాస్తు ఇలా!-hyderabad uoh guest faculty posts application process last date details ,తెలంగాణ న్యూస్
తెలుగు న్యూస్  /  తెలంగాణ  /  Hcu Guest Faculty : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, దరఖాస్తు ఇలా!

HCU Guest Faculty : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, దరఖాస్తు ఇలా!

Bandaru Satyaprasad HT Telugu
Jul 30, 2024 01:42 PM IST

HCU Guest Faculty : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆఫ్ లైన్ లేదా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, దరఖాస్తు ఇలా!
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలు, దరఖాస్తు ఇలా!

HCU Guest Faculty : హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గెస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 2వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు యూజీసీ నెట్ లో అర్హత సాధించి, 55 శాతం మార్కులతో మాస్టర్స్ డిగ్రీ లేదా తత్సమాన డిగ్రీ/బిజినెస్ అడ్మినిస్ట్రేషన్/సీఏ/పీజీడీఎం/ఐసీడబ్ల్యూఏ/ఎం.కామ్ / ఎంఏలో డిగ్రీతో పాటు రెండేళ్ల టీచింగ్‌ అనుభవం తప్పనిసరిగా ఉండాలి.

yearly horoscope entry point

దరఖాస్తు విధానం ఇలా?

అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను 'స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్ స్టడీస్,హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ'కి పోస్టు ద్వారా పంపించాల్సి ఉంటుంది. లేదా డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ ఎడ్యుకేషన్ టెక్నాలజీ ఈ మెయిల్ head.deet@uohyd.ac.in కు ఆన్ లైన్ లో సర్టిఫికెట్లు పంపించవచ్చు. దరఖాస్తుకు ఆగస్టు 2 చివరి తేదీ కాగా, హిందీ విభాగానికి ఆగస్టు 5 వరకు సమయం ఉంది. గెస్ట్ ఫ్యాకల్టీకి నెలకు రూ. 50,000 గౌరవ వేతనం అందిస్తారు. మరిన్ని వివరాలు https://uohyd.ac.in/ తెలుసుకోవచ్చు.

సింగరేణిలో ఉద్యోగాలు

సింగరేణి యాజమాన్యం మార్చి నెలలో విడుదల చేసిన ఎక్స్‌టర్నల్‌ సెకండ్‌ నోటిఫికేషన్‌లో భాగంగా ఏడు విభాగాల్లో 327 పోస్టులను భర్తీ చేయనుంది. ఇప్పటికే దరఖాస్తుల ప్రక్రియ కూడా పూర్తి అయింది. అయితే ఈ ఉద్యోగ రాత పరీక్షలను సింగరేణి యాజమాన్యం ఖరారు చేసింది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్షలు ఆగస్టు 6, 7 తేదీల్లో జరుగుతాయని పేర్కొంది. 7 ర‌కాల కేట‌గిరీ పోస్టుల‌కు కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్షలను నిర్వహిస్తున్నట్లు పేర్కొంది. https://scclmines.com/ వెబ్ సైట్ లోకి వెళ్లి హాల్ టికెట్ల డౌన్లోడ్ తో పాటు పరీక్షల షెడ్యూల్ ను చెక్ చేసుకోవచ్చని వివరించింది.

షెడ్యూల్ ప్రకారం మొదటి రోజు అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రెయినీ (ఎలక్ట్రికల్‌) టీఅండ్‌ఎస్‌ గ్రేడ్‌ –సీ, జూనియర్‌ మైనింగ్‌ ఇంజనీర్‌ ట్రెయినీ, ఎలక్ట్రీషియన్‌ ట్రెయినీ కేటగిరీ– 1, ఫిట్టర్‌ కేటగిరీ –1 పరీక్షలను నిర్వహించనున్నరు. ఇక రెండో రోజు అంటే ఆగస్టు 7వ తేదీన మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (ఈఅండ్‌ఎం) ఈ –2 గ్రేడ్‌, మేనేజ్‌మెంట్‌ ట్రెయినీ (సిస్టమ్‌) ఈ–2 గ్రేడ్‌, అసిస్టెంట్‌ ఫోర్‌మెన్‌ ట్రెయినీ (మెకానికల్‌) టీఅండ్‌ఎస్‌ గ్రేడ్‌ – సీ పరీక్షలు జరగనున్నాయి.

Whats_app_banner

సంబంధిత కథనం