Rishi- Vasudhara: మిస్ గాసిప్ స్టార్‌గా వసుధార - సరసాలు ఆడటంలో రిషి ఎక్స్పర్ట్!
Rishi- Vasudhara: ఆదివారం స్టార్ మా పరివారం లేటెస్ట్ ఎపిసోడ్లో గుప్పెడంత మనసు సీరియల్ ఫేమ్ రిషి, వసుధార పాల్గొనబోతున్నారు. ఈ షో ప్రోమోలో వసుధారకు మిస్ గాసిప్ స్టార్‌గా రిషి అవార్డు ఇవ్వడం ఆకట్టుకుంటోంది.
Rishi- Vasudhara: గుప్పెడంత మనసు సీరియల్లోకి రిషి అలియాస్ ముఖేష్ గౌడ ఇటీవలే రీఎంట్రీ ఇచ్చాడు. ఓ ప్రమాదం కారణంగా చాలా రోజుల పాటు సీరియల్‌కు దూరంగా ఉన్నాడు ముఖేష్ గౌడ. రిషి సీరియల్‌కు దూరం కావడం అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. రిషి క్యారెక్టర్ లేకుండా సీరియల్‌ను నడిపించడానికి కొత్త క్యారెక్టర్స్‌ను ప్రవేశపెట్టి ఇన్నాళ్లు ఎలాగోలా లొక్కొచ్చారు మేకర్స్.
రిషి, వసుధారల కెమిస్ట్రీతోనే గుప్పెడంత మనసు సీరియల్ పాపులర్ అయ్యింది. రిషి సీరియల్‌కు దూరం కావడంతో టీఆర్పీ రేటింగ్స్ పడిపోయాయి. రిషి రీఎంట్రీ తర్వాతే మళ్లీ సీరియల్‌కు ఫాలోయింగ్ పెరిగింది. రిషి, వసుధారల ప్రేమకథను ప్రజెంట్ కొత్త యాంగిల్స్‌లో మేకర్స్ నడిపిస్తోన్నారు.
ఈ షోలో గుప్పెడంత మనసు సీరియల్ నుంచి రిషి (ముఖేష్ గౌడ), వసుధార (రక్షా గౌడ), మహేంద్ర (సాయికిరణ్), శైలేంద్ర(మనోహర్), సరోజ(వినీత) పాత్రధారులు అటెండ్ అయ్యారు. మామగారు సీరియల్ నుంచి సుహాసిని తో పాటు మిగిలిన లీడ్ క్యారెక్టర్స్ చేసిన యాక్టర్స్ కనిపించబోతున్నారు.
మిస్ గాసిప్ స్టార్...
ఈ షో ప్రోమోలో వసుధారపై రిషి ఫన్నీ కామెంట్స్ చేశాడు. మిస్ గాసిప్ ఫరెవర్గా వసుధార అవార్డు ఇచ్చాడు రిషి. సీరియల్ సెట్స్‌లో రకరకాల గాసిప్స్ క్రియేట్ చేస్తుందని అన్నాడు. వినీత సెట్స్‌లో అడుగుపెట్టిన తొలిరోజే ఆమెకు నా గురించి అన్ని విషయాల్ని రక్షా చెప్పేసిందని రిషి అన్నాడు.
నాకు పెళ్లయిపోయిందని, తనది పదేళ్ల ప్రేమకథ అని ఇంకా ఏవోవో చెప్పేసిందని రిషి అన్నాడు. ఫ్యామిలీ విషయాలతో మొదలుపెట్టి ఎదుటివారి నుంచి అన్ని విషయాల్ని వసుధార ఈజీగా లాగేస్తుందని వసుధార గురించి రిషి స్టార్ మా పరివారం ప్రోమోలో చెప్పడం ఆకట్టుకుంటోంది.
గుప్పెడంత మనసు సెట్స్‌లో రిషి అందరిని బాగా ఫ్లర్టింగ్ చేస్తాడని మిగిలిన యాక్టర్స్ కామెంట్స్ చేయడం నవ్వులను కురిపిస్తోంది. సుహాసిని ఫ్లర్ట్ చేయమని రిషికి యాంకర్ శ్రీముఖి టాస్క్ ఇవ్వగా...ఆమెను ఎత్తుకొన్నాడు రిషి. ఈ ప్రోమోలో శ్రీముఖికి రిషి ప్రపోజ్ చేశాడు. రిషి వెంట జబర్ధస్థ్ రోహిణి పడగా...ఆమె నుంచి తప్పించుకోవడానికి రిషి వేసిన పంచ్‌లు నవ్విస్తోన్నాయి. ఈ ప్రోమో సోషల్ మీడియాలోవైరల్గా మారింది.
జన్మజన్మలకు చెరగని ప్రేమ...
ప్రోమో చివరలో రిషి, వసుధారలతో ఫ్యాన్స్ మాట్లాడినట్లుగా చూపించారు. బోర్డ్‌పై ఉన్న రాతలను చెరపగలమేమో గానీ నా మనసులో నీ పట్ల ఉన్న ప్రేమను జన్మజన్మలకు చెరపలేం బావ అంటూ రిషికి ఓ లేడీ ఫ్యాన్ ప్రపోజ్ చేసింది. సీరియల్లో రిషి, వసుధారల రొమాన్స్ బాగుంటుందని మరోమహిళా అభిమాని చెప్పింది. వారి మాటలతో పొంగిపోయిన రిషి మీ కోసమే రీఎంట్రీ ఇచ్చినట్లు చెప్పడం ఈ ప్రోమోలో ఆకట్టుకుంటోంది.