తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gundeninda Gudigantalu Serial: శృతి కోసం బాలును ఎదురించిన ర‌వి - రోహిణికి ఇచ్చిప‌డేసిన మీనా - సంజు రివేంజ్‌

Gundeninda Gudigantalu Serial: శృతి కోసం బాలును ఎదురించిన ర‌వి - రోహిణికి ఇచ్చిప‌డేసిన మీనా - సంజు రివేంజ్‌

28 September 2024, 9:09 IST

google News
  • Gundeninda Gudigantalu Serial: గుండెనిండా గుడిగంట‌లు ప్రోమోలో బాలు వార్నింగ్‌ను లెక్క‌చేయ‌కుండా షాపింగ్ మాల్‌లో సీక్రెట్‌గా శృతిని క‌లుస్తాడు ర‌వి. నువ్వు లేకుండా బ‌త‌క‌లేన‌ని త‌న మ‌న‌సులో మాట శృతికి చెబుతారు. కుటుంబ‌స‌భ్యుల‌కు తెలియ‌కుండా పెళ్లి చేసుకోవాల‌ని శృతి, ర‌వి, ఫిక్స‌వుతారు.

గుండెనిండా గుడిగంట‌లు సీరియల్
గుండెనిండా గుడిగంట‌లు సీరియల్

గుండెనిండా గుడిగంట‌లు సీరియల్

Gundeninda Gudigantalu Serial: పార్కులో దొరికిన కూప‌న్స్ ఆఫీస్‌లో ఇచ్చార‌ని రోహిణితో అబ‌ద్ధం ఆడుతాడు మ‌నోజ్‌. ఆ కూప‌న్స్‌తో ప్ర‌భావ‌తి ఫ్యామిలీ మొత్తం షాపింగ్‌కు వ‌స్తారు. షాపింగ్‌కు వ‌స్తోన్న టైమ్‌లో బాలు కారును షేర్ ఆటోతో పోలుస్తూ చుల‌క‌న చేసి మాట్లాడుతుంది ప్ర‌భావ‌తి.

మ‌నోజ్ కారు పెద్ద‌గా ద‌ర్జాగా ఉండేద‌ని అంటుంది. ఆ కారు ఏమైందో, ఇప్పుడు మ‌నోజ్ ద‌గ్గ‌ర ఎందుకు లేదో చెప్పాల‌ని ప్ర‌భావ‌తిని ఇరికించేస్తాడు. కారు ఎక్కువ రోజులు వాడ‌టంతో బోర్ కొట్టి అమ్మేశాన‌ని రోహిణికి డౌట్ రాకుండా మ‌నోజ్ అబ‌ద్ధం ఆడుతాడు.

సంజు డామినేష‌న్‌...

మ‌రోవైపు శృతి, సంజు కూడా షాపింగ్‌కువ‌స్తారు. వాళ్లు కూడా ప్ర‌భావ‌తి అండ్ ఫ్యామిలీ ఉన్న షాపింగ్‌మాల్‌లోనే అడుగుపెడ‌తారు. అక్క‌డ ర‌వి క‌నిపించ‌డంతో శృతి హ్యాపీగా ఫీల‌వుతుంది. షాపింగ్‌మాల్‌లో శృతిపై సంజు డామినేట్ చేస్తుండ‌టం ర‌వి స‌హించ‌లేక‌పోతాడు.

శృతి టేస్ట్‌తో సంబంధం లేకుండా ఓ క‌ల‌ర్ చీర‌ను సెలెక్ట్‌చేస్తాడు సంజు. ఆ చీర త‌న‌కు న‌చ్చ‌లేద‌ని శృతి చెప్పిన విన‌కుండా సెలెక్ట్‌చేస్తాడు. ఆ త‌ర్వాత తెలివిగా సంజును అక్క‌డి నుంచి పంపిచేస్తాడు ర‌వి.

నువ్వే నాకు ముఖ్యం...

సంజు వెళ్లిపోగానే...నేను ఎవ‌రి గురించి ఆలోచించుకోద‌ల‌చుకోలేదు. నువ్వే నాకు ముఖ్యం...నిన్ను దూరం చేసుకొని బ‌త‌క‌లేన‌ని శృతికి త‌న మ‌న‌సులోని మాట‌ను చెబుతాడు ర‌వి. శృతి చేతిపై ముద్దిస్తాడు. పెళ్లి విష‌యంలో మా అమ్మ నాన్న త‌గ్గేలా లేర‌ని శృతి అంటుంది.

మా అమ్మ‌కు ప్రేమ గురించి తెలిస్తే ప‌రిస్థితి వేరేలా ఉంటుంద‌ని ర‌వి భ‌య‌ప‌డ‌తాడు. శృతి, ర‌వి మాట్లాడుకుంటుండ‌గా అక్క‌డికి ప్ర‌భావ‌తి, మ‌నోజ్‌, రోహిణి వ‌స్తారు. వారికి క‌నిపించ‌కుండా ర‌వి, శృతి దాక్కుంటారు. మ‌రోవైపు శృతిని వెతుకుతూ షాపింగ్‌మాల్ మొత్తం తిరుగుతుంటాడు సంజు.

మీనాపై సెటైర్లు...

రోహిణి, ప్ర‌భావ‌తి, మ‌నోజ్ క‌లిసి షాపింగ్ చేస్తుంటారు. బాలు, మీనా విడిగా చీర‌లు సెలెక్ట్ చేసుకుంటుంటారు. వారిని చూసి మీ రేంజ్‌కు త‌గ్గ చీర‌లు సెలెక్ట్ చేయ‌డం పూర్త‌యిందా అంటూ మీనాను ఎగ‌తాళి చేసి మాట్లాడుతుంది ప్ర‌భావ‌తి. త‌క్కువ రేటు చీర‌లు క‌ట్టుకోవాల్సిన ఖ‌ర్మ ఈ బాలుగాడి పెళ్లానికి ప‌ట్ట‌లేదంటూ కాల‌ర్ ఎగ‌ర‌వేస్తూ త‌ల్లికి స‌మాధాన‌మిస్తాడు బాలు.

మీనాపై వివ‌క్ష‌...

ఆ త‌ర్వాత చీర‌ల సెలెక్ష‌న్‌లో రోహిణి కోసం ఖ‌రీదైన శారీని సెలెక్ట్ చేస్తుంది ప్ర‌భావ‌తి. మీనాకు మాత్రం త‌క్కువ ధ‌ర‌వి చూడ‌టం మొద‌లుపెడుతుంది. మీనాకు ఇంట్లో క‌ట్టుకొనే మాములు చీర‌లు చాల‌ని అంటుంది. ప్ర‌భావ‌తితో షాపింగ్ మాల్‌లోనే గొడ‌వ‌ప‌డ‌తాడు బాలు. రోహిణి, మీనాకు ఒకే రేట్ చీర‌లు కొన‌మ‌ని లేదంటే వ‌ద్ద‌ని త‌ల్లితో వాదిస్తాడు బాలు.

మ‌నోజ్‌కు పంచ్‌...

మా ఆయ‌న సంపాద‌న‌తోనే చీర‌లు కొనుక్కుంటున్నాన‌ని ప్ర‌భావ‌తితో అంటుంది మీనా. ఫ్రీగా వ‌స్తే ఫినాయిల్ తాగే వీళ్ల‌తో మ‌న‌కు మాట‌లు ఏంటి అంటూ రోహిణి, మ‌నోజ్‌లకు బాలు పంచ్ ఇస్తాడు.

మ‌రోవైపు ర‌వితో మాట్లాడేందుకు శృతి తెగ ప్ర‌య‌త్నిస్తుంటుంది. శృతి ఇదే షాపింగ్ మాల్‌లో ఉన్న విష‌యం త‌న ఫ్యామిలీ మెంబ‌ర్స్‌కు తెలియ‌కుండా ర‌వి జాగ్ర‌త్త‌ప‌డ‌తాడు.

బాలు డౌట్‌...

ర‌వి తీరుపై బాలుకు డౌట్ వ‌స్తుంది. ఎక్క‌డికి వెళుతున్నావ‌ని త‌మ్ముడిని నిల‌దీస్తాడు. ర‌వి త‌డ‌బాటుగా స‌మాధానం చెప్ప‌డంతో అత‌డి అనుమానం మ‌రింత బ‌ల‌ప‌డుతుంది.

రవి, శృతిలు బాలుకు రెడ్ హ్యాండెడ్‌గా షాపింగ్ మాల్‌లో దొరికిపోతారు. త‌న వార్నింగ్‌ను ప‌ట్టించుకోకుండా శృతిని ర‌వి క‌ల‌వ‌డంపై బాలు ఫైర్ అవుతాడు.తాను శృతిని పెళ్లిచేసుకోబోతున్న‌ట్లు బాలుకు ర‌వి చెప్ప‌నున్న‌ట్లు తెలుస్తోంది. ర‌వి, శృతి పెళ్లిని బాలు వ్య‌తిరేకించ‌గా మీనా మాత్రం స‌పోర్ట్ చేస్తున్న‌ట్లుగా క‌నిపిస్తోంది. పెద్ద‌ల‌కు తెలియ‌కుండా ర‌వి, శృతి సీక్రెట్ మ్యారేజ్ చేసుకోనున్న‌ట్లు నెక్స్ట్ ఎపిసోడ్‌లో చూపించ‌బోతున్నారు.

బ‌య‌ట‌ప‌డ్డ మ‌నోజ్ అబ‌ద్ధం…

మ‌రోవైపు షాపింగ్ కూప‌న్స్ విష‌యంలో మ‌నోజ్ ఆడిన అబ‌ద్ధం కూడా బ‌య‌ట‌ప‌డుతుంది. దాంతో రోహిణి హ‌ర్ట్ అవుతుంది. త‌న‌ను పెళ్లి పేరుతో మోసం చేసిన శృతిపై సంజు ప‌గ‌ను పెంచుకున్న సంజు ఏం చేశాడ‌న్న‌ది నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆస‌క్తిక‌రంగా ఉండ‌నుంది.

తదుపరి వ్యాసం