Gundeninda Gudigantalu: రవి పెళ్లికి పెద్దగా మారిన మీనా - హౌజ్ అరెస్ట్ నుంచి శృతికి విముక్తి - మందేసిన బాలు
07 October 2024, 10:18 IST
Gundeninda Gudigantalu Serial: గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 7 ఎపిసోడ్‌లో మీనా ఆశ్వీరాదంతోనే శృతిని పెళ్లిచేసుకోవాలని రవి అనుకుంటాడు. అబద్ధం చెప్పి మీనాను గుడికి రావడానికి ఒప్పిస్తాడు. తల్లిదండ్రులు తనన రూమ్‌లో బంధించడంతో సంజు సాయంతో తప్పించుకోవాలని శృతి స్కెచ్ వేస్తుంది
గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 7 ఎపిసోడ్
Gundeninda Gudigantalu Serial: శృతి బయటకు వెళ్లకుండా గదిలో పెట్టి లాక్ చేస్తారు సురేంద్ర, శోభన. ఇంట్లో నుంచి తప్పించుకునే దారి కోసం శృతి తెగ ఆలోచిస్తుంది. సంజు సాయంతో ఇంటి నుంచి బయటపడాలని అనుకుంటుంది. ఓ ఫ్రెండ్ పెళ్లికి వెళ్లాలని, తనకు తోడు రావాలని సంజును కోరుతుంది. పెళ్లికి ముందే శృతి తన పర్మిషన్ అడగటంతో సంజు ఈగో సాటిస్‌ఫై అవుతుంది. పెళ్లికి తీసుకెళతానని శృతికి మాటిస్తాడు.
బాలుపై ప్రభావతి సెటైర్లు...
ఔట్ స్టేషన్ గిరాకి రావడంతో బాలు మరోఊరికి వెళతాడు. బాలు ఇంట్లో లేకపోవడంతోప్రశాంతంగా ఉందని రోహిణితో అంటుంది ప్రభావతి. బాలు ఉన్నాడంటే రచ్చబండ దగ్గర ఉన్న గొడవలు, తీర్పులు, వాదనలు అన్ని తెచ్చి మన ఇంట్లో పెట్టేవాడని కొడుకుపై ఉన్న కోపం మొత్తం బయటపెడుతుంది.
ప్రభావతి మాటలను విన్న మీనా...భర్తను ఎగతాళి చేయడం సహించలేకపోతుంది. భోజనం చేయకుండా తన రూమ్‌లోకి వెళుతుంది. మన మాటల్ని మీనా విన్నదా అని ప్రభావతితో అంటుంది రోహిణి. విన్నా నష్టం ఏం లేదని ప్రభావతి బదులిస్తుంది.
మందు తాగిన బాలు...
బాలుకు ఫోన్ చేస్తుంది మీనా. భార్యను పేరును సాగదీసి చెప్పడంతో బాలు తాగేసి ఉన్నాడని మీనా అర్థం చేసుకుంటుంది. ఒళ్లు మర్చిపోయేంత తాగొద్దని బాలును హెచ్చరిస్తుంది మీనా. తాను తిరిగి రావడానికి రెండు రోజులు టైమ్ పడుతుందని మీనాతో అంటాడు బాలు.
కుటుంబం కోసం, అప్పుల తీర్చడం కోసం బాలు పడుతోన్న కష్టం చూసి ఎమోషనల్ అవుతుంది. తెలిసిన పని చేయడంలో తప్పు లేదని భార్యకు సర్ధిచెబుతాడు బాలు. బాలుతో మాట్లాడుతూ ఉంటే అతడి నిద్రకు డిస్ట్రబ్ అవుతుందని మీనా అనుకుంటుంది. ఫోన్ కట్ చేయబోతుంది. కానీ బాలు మాట్లాడమని అంటాడు. నీతో మాట్లాడుతూ ఉంటేనే నేను అలసిపోయాననే విషయం మర్చిపోతానని చెబుతాడు. మీనాతో మాట్లాడుతూనే బాలు నిద్రలోకి జారుకుంటాడు.
శృతికి దూరమై బతకలేను…
తమ పెళ్లి విషయంలో బాలును మీనా చేత కన్వీన్స్ చేయించాలని ప్రయత్నిస్తాడు రవి. శృతి పెళ్లిచేసుకోమని తొందరపెడుతుందని మీనా చెబుతాడు. తమ ప్రేమ విషయంలో ఎవరూ మమ్మల్ని అర్థం చేసుకోవడం లేదని బాధపడతాడు. శృతికి దూరమై తాను జీవితాంతం బాధతో బతకాల్సివస్తుందని అంటాడు. తాను ఎంత చెప్పినా మీ పెళ్లికి అన్నయ్య ఒప్పుకుంటాడనే నమ్మకం నాకైతే లేదని రవితో అంటుంది మీనా. రెస్టారెంట్‌లో రవికి బాలు ఇచ్చిన వార్నింగ్‌ను గుర్తుచేస్తుంది.
మీనా ఆశీర్వాదంతో…
శృతిని తాను పెళ్లిచేసుకోబోతున్న దాచిపెట్టి ఆమెను గుడికి తీసుకెళ్లాలని బాలు అనుకుంటాడు. మీనా ఆశీర్వాదంతోనే పెళ్లిచేసుకోవాలని ప్లాన్ వేస్తాడు. శృతిని రేపు గుడికి రమ్మంటానని తనతో మాట్లాడి పెళ్లి విషయంలో కొన్నాళ్లు ఆగేలా ఆమెను కన్వీన్స్ చేయమని మీనాతో అబద్ధం చెబుతాడు రవి. శృతిని కలవనని బాలుకు మాటిచ్చానని, భర్తకు ఇచ్చిన మాటను తప్పనని అంటుంది మీనా. నాన్న, అన్నయ్యల కోసం ఆలోచించి అయినా తన కోసం గుడికి రమ్మని రవి అడగటంతో భయపడుతూనే మీనా అంగీకరిస్తుంది.
రవి మోసం…
శృతిని క లవబోతున్న విషయం ఇంట్లో ఎవరికి తెలియకుండా ఉంటే మంచిదని రవి, మీనా అనుకుంటారు. పెళ్లి విషయంలో మీనాను మోసం చేస్తున్ననందుకు రవి బాధపడతాడు.
సంజు ఫైర్…
శృతిని కలవడానికి ఆమె ఇంటికొస్తాడు సంజు. నేరుగా ఆమె రూమ్‌కు వెళ్లబోతాడు. కానీ రూమ్ బయటి నుంచి గడియపెట్టడం చూస్తే శృతిపై అతడికి అనుమానం వస్తుందని సురేంద్ర, శోభన కంగారు పడతారు. శోభన వెళ్లి శృతిని హాల్‌లోకి తీసుకొస్తుంది. శృతిని ఓ ఫ్రెండ్ పెళ్లికి తీసుకెళుతున్నానని సంజు చెప్పగానే సురేంద్ర, శోభన కంగారు పడతారు. ఆ పెళ్లికి మేము కూడా వస్తామని పట్టుపడతారు. వద్దని సంజు అంటాడు. మీ కూతురిగా శృతిని తీసుకెళ్లి...రేపు నా భార్యగా తిరిగి తీసుకొస్తానని సంజు జోక్ చేస్తాడు.
తల్లిదండ్రులకు క్షమాపణలు...
శృతి ఫోన్‌ను తీసుకోవాలని శోభన ప్లాన్ చేస్తుంది. కానీ సంజు పట్టుపట్టి ఫోన్ శృతికి తిరిగి ఇచ్చేలా చేస్తాడు. శృతి వెళ్లబోతూ మనసులోనే తల్లిదండ్రులకు క్షమాపణలు చెబుతుంది. మిమ్మల్ని మోసం చేసి వెళ్లిపోతున్నాని, మళ్లీ నన్ను తిరిగి ఇంటికిరానిస్తారో లేదో తెలియదని అంటాడు. గుడికి వెళ్లడానికి మీనాను తొందరపెడతాడు. ఎంటి పెళ్లి ముహూర్తం దాటిపోయినట్లుగా కంగారు పడుతున్నావని రవితో అంటుంది మీనా. కానీ అతడు సమాధానం చెప్పడు. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.