Gundeninda Gudigantalu: బాలుకు మీనా షాకింగ్ ట్విస్ట్ - భర్త అరెస్ట్‌తో ప్రభావతి కన్నీళ్లు - రవి నమ్మకద్రోహం
11 October 2024, 12:47 IST
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 11 ఎపిసోడ్‌లో రవి, శృతి పెళ్లి జరిగిందనే నిజం పోలీస్ ఎంక్వైరీలో బయటపడుతుంది. వారి పెళ్లికి మీనానే సాక్షి సంతకం చేసిందని ఎస్ఐ అనగానే బాలు షాకవుతాడు. మరోవైపు పోలీస్ స్టేషన్‌లో ఉన్న భర్తను చూసి ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది.
గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 11 ఎపిసోడ్
Gundeninda Gudigantalu: సంజును బకరా చేసి రవిని పెళ్లిచేసుకుంటుంది శృతి. కొన్నాళ్లు ఇంట్లోవాళ్లకు కనిపించకుండా ఓ ఫ్రెండ్ గెస్ట్‌హౌజ్‌లో తలదాచుకోవాలని రవి, శృతి అనుకుంటారు. ఇద్దరి ఫోన్‌లు స్విచ్చాఫ్ చేస్తారు. తనపై పగ తీర్చుకోవడానికి శృతిని రవి చేత సత్యం కిడ్నాప్ చేయించాడని సురేంద్ర భ్రమపడతాడు. సత్యంతో పాటు రవిపై పోలీస్ కేసు పెడతాడు. సత్యాన్ని పోలీసులు అరెస్ట్ చేస్తారు. ప్రభావతి, మనోజ్, రోహిణి కూడా పోలీస్ జీపును ఫాలో అవుతూ పోలీస్ స్టేషన్‌కు వస్తారు.
మీనా కంగారు...
అప్పుడే గుడినుంచి ఇంటికొచ్చిన మీనా...సత్యాన్ని అరెస్ట్ చేశారనే న్యూస్ విని కంగారు పడుతుంది. సత్యం, రవి కలిసి శృతిని కిడ్నాప్ చేశారని చుట్టుపక్కల వారు మాట్లాడుకోవడం చూసి ఆమె ఆందోళన మరింత పెరుగుతుంది. ఏ తప్పు చేయని తాను పోలీస్ స్టేషన్ గడపతొక్కాల్సిరావడం చూసి సత్యం ఎమోషనల్ అవుతాడు.
మా నాన్న దగ్గర స్టేట్‌మెంట్ తీసుకొని ఆయన్ని ఇంటికి పంపించేయండి అంటూ మనోజ్ అంటాడు. శృతిని ఎక్కడ దాచారో తెలుసుకొని అప్పుడే పంపిస్తానని అంటాడు. పోలీస్ ఆఫీసర్ మాట మార్చడం చూసి ప్రభావతి, రోహిణి ఫైర్ అవుతారు. ఎక్కువ మాట్లాడితే మనోజ్‌ను కూడా ఆరెస్ట్ చేస్తానని పోలీస్ ఆఫీసర్ అనడంతో ఇద్దరు షాకవుతారు.
ఏ అపకారం తలపెట్టడు...
శృతి మిస్సింగ్ కేసులో సత్యం ఇన్‌వాల్వ్ అయ్యాడని కంప్లైంట్ వచ్చిందని పోలీస్ ఆఫీసర్ ప్రభావతితో వాదిస్తాడు. మా ఆయన కలలో కూడా ఎవరికి ఏ అపకారం తలపెట్టడని, రవి కూడా తండ్రి మాదిరిగానే నిజాయితీగా బతుకుతున్నాడని ప్రభావతి అంటుంది.
ఆమె మాటల్ని సురేంద్ర కొట్టిపడేస్తాడు. వీళ్లు ఏం చెప్పిన నమ్మొద్దని ఎస్ఐతో అంటాడు. నాలుగు రోజుల్లో పెళ్లి కావాల్సిన తన కూతురిని కిడ్నాప్ చేసి ఎక్కడ దాచిపెట్టారో తెలియాల్సిందేనని పట్టుపడతాడు.
ప్రేమ పేరుతో వేధింపులు...
ప్రేమ పేరుతో శృతిని రవి వేధించాడని నిందలు వేస్తాడు సురేంద్ర. ప్రేమను ఒప్పుకోలేదని శృతిని కిడ్నాప్‌చేశారని, తన ఆస్తిని సొంతం చేసుకోవడానికి ఈ డ్రామాలు ఆడుతున్నారని గొడవపడతాడు. సురేంద్ర ఎంత వాదించినా రవి, శృతి మధ్య ఉన్నది స్నేహమేనని సత్యం అంటాడు.
రవి వచ్చి సరెండర్ అయ్యే వరకు సత్యం పోలీస్ స్టేషన్‌లోనే ఉండాలని పోలీస్ ఆఫీసర్ అంటాడు. మా నాన్న పోలీస్ స్టేషన్‌లో ఎందుకు ఉండాలి అంటూ ఎస్ఐతో మనోజ్ వాదిస్తాడు. మనోజ్‌ను కూడా సెల్‌లో వేస్తానని ఎస్ఐ వార్నింగ్ ఇస్తాడు.
అరెస్ట్ చేశాం...
తాను ఏం తప్పు చేయలేదని, రవి వస్తే నేనే అతడిని పోలీస్‌స్టేషన్‌కు తీసుకొస్తానని సత్యం వెళ్లబోతాడు. ఏంటి వెళతావా...నిన్ను అరెస్ట్ చేసి తీసుకొచ్చామని ఎస్ఐ అంటాడు. ఆ మాటతో సత్యం కుటుంబసభ్యులు అందరూ షాకవుతారు. నీ అనుమానంతో నాపై అనవసరంగా కేసు పెట్టావని, పెళ్లికాబోయే నీ కూతురిని నువ్వే అల్లరిపాలు చేస్తున్నావని సురేంద్రపై సత్యం ఫైర్ అవుతాడు.
చేయాల్సిన తప్పులు చేసి ఇప్పుడు నీతులు చెబుతున్నావా అంటూ సత్యానికి సమాధానమిస్తాడు సురేంద్ర. ఏం చేసైనా సత్యంతో నిజం ఒప్పించమని ఎస్ఐతో అంటాడు సురేంద్ర. నిజం చెప్పకపోతే కిడ్నాప్ కేసు ఫైల్ చేసి కోర్టుకు పంపించాల్సివుంటుందని సత్యాన్ని బెదిరిస్తాడు ఎస్ఐ.
సత్యాన్ని స్టేషన్‌లోని చైర్‌పై తోసేస్తాడు కానిస్టేబుల్. ప్రభావతి, మనోజ్‌లను బయటకు వెళ్లమని ఆర్డర్ వేస్తాడు.
ప్రభావతి కన్నీళ్లు...
సత్యం షాక్‌లో ఏం మాట్లాడలేకపోతాడు. భర్తను పోలీస్ స్టేషన్‌లో చూసి ప్రభావతి కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఎలాగైనా ఆయన్ని స్టేషన్ నుంచి విడిపించమని రోహిణి, మనోజ్‌లను బతిమిలాడుతుంది. రవి తొందరపాటుతోనే ఈ గొడవలన్నీ జరిగాయని మీనా ఎమోషనల్ అవుతుంది.
తనను కూడా రవి మోసం చేసి సాక్షి సంతకం పెట్టేలా చేశాడని అనుకుంటుంది. రవి, శృతిలకు సత్యం అరెస్ట్ అయినా సంగతి చెప్పాలని ఫోన్ చేస్తుంది. కానీ ఇద్దరి ఫోన్‌లు స్విఛాఫ్ అని వస్తాయి.
భర్త బాలుకు ఫోన్ చేసి జరిగింది చెప్పాలని అనుకుంటుంది. మీనా కన్నీళ్లతో మాట్లాడటం చూసి బాలు కంగారు పడతారు. సత్యాన్ని అరెస్ట్ చేసిన సంగతి వినగానే బాలు షాకవుతాడు. రవి పెళ్లి గురించి చెప్పేలోపు సిగ్నల్ లేక ఫోన్ కట్ అవుతుంది.
మనోజ్‌కు చివాట్లు...
తన భర్త ఏ తప్పు చేయలేదని, ఆయన్ని వదిలిపెట్టమని పోలీసులను బతిమిలాడుతుంది ప్రభావతి.కానీ ఆమె మాట ఎవరు వినరు. మరోవైపు మనోజ్ తన పార్క్ ఫ్రెండ్స్‌తో మాట్లాడుతూ కనిపిస్తాడు. ఇంటి పెద్ద కొడుకువి అయిఉండి...కన్న తండ్రి జైలులో ఉంటే ఏం చేయలేకపోతున్నావని ఏం బతుకురా నీది అంటూ మనోజ్‌ను దులిపేస్తుంది ప్రభావతి.
కనీసం రోహిణి మాట్లాడినంత ధైర్యంగా కూడా మాట్లాడలేకపోయావని క్లాస్ ఇస్తుంది. ముగ్గురు కొడుకుల్ని కన్న మనిషికి ఒక్క కొడుకు వల్ల సుఖం, శాంతి లేకుండా పోయాయని కన్నీళ్లు పెట్టుకుంటుంది. తల్లికి క్షమాపణలు చెబుతాడు మనోజ్.
దొరికిపోయిన మీనా
కంగారుగా పోలీస్ స్టేషన్‌లో అడుగుపెడుతుంది మీనా. స్టేషన్‌లో దిగాలుగా బెంచ్‌పై కూర్చున్న సత్యాన్ని చూసి ఎమోషనల్ అవుతుంది. గుడిలో ఎంక్వైరీ చేసిన పోలీసులు రవి, శృతి పెళ్లి చేసుకున్నారనే నిజాన్ని బయటపెడతాడు. మీనానే పెళ్లికి సాక్షి సంతకం చేసిందని చెబుతారు. అది వినిసత్యం, బాలుతో పాటు ప్రభావతి ఫ్యామిలీ అందరూ షాకవుతారు. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.