Gunde Ninda Gudi Gantalu: అత్తింట్లోకి మీనాకు నో ఎంట్రీ - భార్యతో తనకు సంబంధం లేదన్న బాలు - కొత్త జంటకు కష్టాలు
19 October 2024, 8:37 IST
Gunde Ninda Gudi Gantalu: గుండెనిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ప్రోమోలో తన మాట ధిక్కరించి రవి, శృతిల పెళ్లిని మీనానే జరిపించిందని బాలు భ్రమపడతాడు. మీనాపై కోపంతో ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదని అంటాడు. నా భార్యగా ఉండే అర్హత నీకు లేదని మీనా మనసు ముక్కలు చేస్తాడు.
గుండెనిండా గుడిగంటలు సీరియల్ లేటెస్ట్ ప్రోమో
Gunde Ninda Gudi Gantalu: రవి, శృతిల పెళ్లిని మీనానే జరిపించిందని బాలు భ్రమపడతాడు. రవి తనకు అబద్ధం చెప్పి గుడికి తీసుకెళ్లాడని మీనా ఎంత చెప్పిన బాలు నమ్మడు. వదిన ఏ తప్పు చేయలేదని రవి కూడా బాలును కన్వీన్స్ చేయబోతాడు. రవిపై ఉన్న కోపంతో తమ్ముడి మాట కూడా బాలు పట్టంచుకోడు.
గెంటేసిన ప్రభావతి...
పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికొచ్చిన మీనాను ప్రభావతి గెంటేస్తుంది. మా కుటుంబానికి ద్రోహం చేసిన నిన్ను ఇంట్లోకి రానిస్తానని ఎలా అనుకున్నావని మీనాపై ఫైర్ అవుతుంది. నాపై ప్రతీకారం తీర్చుకోవడానికే రవి, శృతిల పెళ్లిని సీక్రెట్‌గా జరిపించావని, నా భర్తను జైలుకు పంపించావని మీనాపై నిందలు వేస్తుంది ప్రభావతి.
మీనా ప్లాన్ ఫెయిల్...
మావయ్య సత్యాన్ని కలిసి అసలు జరిగింది ఏమిటో, రవి తనను ఎలా మోసం చేసింది చెప్పాలని మీనా ప్రయత్నిస్తుంది. కానీ సత్యాన్ని మీనా కలవకుండా ప్రభావతి అడ్డుకుంటుంది. తిండికి గతిలేని నిన్ను ఈ ఇంటి కోడలిగా తీసుకొచ్చిన సత్యానికి గొప్ప సన్మానం చేశావని మీనాను ప్రభావతి అవమానిస్తుంది, మనోజ్, రోహిణి కూడా మీనానే తప్పుపడతారు. నీ వల్లే ఇంటి పరువు బజారు పాలైందని, నువ్వు రవి పెళ్లి చేయడం వల్లే సత్యం జైలుకు వెళ్లాడని కోప్పడుతారు. నువ్వు చేసిన తప్పుకు ఇంట్లో నుంచి వెళ్లిపోవడమే శిక్ష అని మీనాకు ప్రభావతి వార్నింగ్ ఇస్తుంది.
అత్తయ్యపై రివర్స్...
ప్రభావతికి ఎదురుతిరుగుతుంది మీనా. మీరు పొమ్మంటే ఎక్కడికి వెళతానని, ఇదే తన ఇళ్లు అని అంటుంది. చచ్చేదాకా ఇక్కడే ఉంటానని చెబుతుంది. మీనాను బలవంతంగా ఇంట్లో నుంచి బయటకు నెట్టివేస్తుంది ప్రభావతి. తనను ఇంట్లో నుంచి వెళ్లగొట్టే అధికారం, హక్కుమీకు లేదని అత్తయ్యపై మీనా ఫైర్ అవుతుంది. నా మెడలో తాళికట్టిన భర్తకే ఆ హక్కు ఉందని అంటుంది. ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మని బాలు చెబితే వెళ్లిపోతానని అంటుంది.
నీకు నాకు ఏ సంబంధం లేదు...
భర్త తనను ఉండమంటాడని మీనా ఆశిస్తుంది. కానీ బాలు ఆమెకు ఊహించని షాకిస్తాడు. ఇకపై నీకు నాకు ఎలాంటి సంబంధం లేదని మీనాతో తెగేసి చెబుతాడు బాలు. ఇకపై నీకు ఈ ఇంట్లో స్థానం లేదని అంటాడు. నా భార్యగా ఉండే అర్హతను నువ్వు కోల్పోయావని మీనాపైఫైర్ అవుతాడు. భర్త మాటలతో మీనా ఎమోషనల్ అవుతుంది. కన్నీళ్లతో అత్తింటి నుంచి బయటఅడుగుపెడుతుంది.
సత్యం మీనాకు సపోర్ట్ చేస్తాడా? తిరిగి అత్తింట్లోకి మీనా అడుగుపెడుతుందా? అన్నది నెక్స్ట్ ఎపిసోడ్‌లో ఆసక్తికరంగా ఉండనుంది.
శృతిపై పగతో సంజు...
మరోవైపు తనను మోసం చేసి రవిని పెళ్లిచేసుకున్న శృతిపై పగతో రగిలిపోతుంటాడు సంజు. రవిపై ఎటాక్ చేసి శృతి ఎత్తుకొచ్చి పెళ్లిచేసుకోవాలని సంజు ప్లాన్ చేస్తాడు. మరోవైపు తమ్ముడిపై కోపంతో అతడి కోసం బాలు వెతుకుంటాడు. ఈ ఇద్దరిలో రవి, శృతి ఎవరి కంటపడ్డారు? సంజు బారి నుంచి తన భార్యను రవి ఎలా కాపాడుకున్నాడన్నది సోమవారం నాటి గుండెనిండా గుడిగంటలు సీరియల్‌లో చూడాల్సిందే