Gundeninda Gudigantalu: మీనాకు బాలు శిక్ష - కోడలిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టిన ప్రభావతి - సత్యం కన్నీళ్లు
Gundeninda Gudigantalu: గుండెనిండా గుడిగంటలు అక్టోబర్ 14 ఎపిసోడ్‌లో మీనానే దగ్గరుడి రవి, శృతిల పెళ్లి జరిపించిందని తెలిసి బాలు, సత్యంతో పాటు అందరూ షాకవుతారు.మీనా కారణంగానే తండ్రి జైలుపాలయ్యాడనే ఆవేశంతో మీనా చెంప పగలగొడతాడు. తన కళ్ల ముందు కనిపించొద్దని మీనాకు వార్నింగ్ ఇస్తాడు.
Gundeninda Gudigantalu: శృతిని రవితో కలిసి సత్యం కిడ్నాప్ చేయించాడని పోలీస్ కేసు పెడతాడు సురేంద్ర. పోలీసులు సత్యాన్ని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తీసుకొస్తారు. సత్యం, రవి కిడ్నాప్‌లు చేసేవాళ్లు కాదని, మంచివాళ్లని ఎస్ఐతో వాదిస్తుంది మీనా. వారికి పెళ్లికి జరిగిన విషయం ఎలా చెప్పాలో తెలియక సతమతమవుతుంది.
మీనా మాటల్ని పట్టించుకోకుండా ఆమెను స్టేషన్ నుంచి బయటకు పంపిస్తాడు ఎస్ఐ. సత్యానికి బెయిల్ ఇప్పించేందుకు రోహిణి ప్రయత్నాలు చేస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన శోభన...తన కూతురు దొరక్కపోతే ఏ ఒక్కరిని వదిలిపెట్టనని ప్రభావతికి వార్నింగ్ ఇస్తుంది. పెన్షన్ ఆపించారని పగతోనే తన కూతురు పెళ్లి సత్యం చెడగొట్టాడని రచ్చ చేస్తుంది.
లాకప్‌లో సత్యం...
ఇలాగేనా కొడుకును పెంచేది...ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే కొడుకులను కన్నావా అంటూ సత్యంపై శోభన ఫైర్ అవుతుంది. శోభన ఎంత అడిగిన ఏం జరిగిందో తనకు తెలియదని సత్యం అంటాడు.
సత్యం మాటల్ని సహించలేకపోతాడు పోలీస్ ఆఫీసర్. సత్యాన్నిలాకప్‌లో వేస్తాడు. ఆయన వయసుకు గౌరవం ఇచ్చి అయినా వదిలేయమని పోలీస్ ఆఫీసర్‌ను ప్రభావతి, రోహిణి బతిమిలాడుతారు.
మీనా కంగారు..
మరోవైపు రవి, శృతి ఆచూకీ గురించి సుమతికి ఫోన్ చేస్తుంది మీనా. కానీ వాళ్లు ఎక్కడున్నారో తనకు తెలియదని సుమతి సమాధానమిస్తుంది. రవి, శృతికి తానే పెళ్లిచేశానని తెలిస్తే ఏం జరుగుతుందోనని మీనా బయపడుతుంది. రవి, శృతి చేసిన తప్పుకు తనకు ఎక్కడ శిక్ష పడుతుందోనని టెన్షన్ పడుతుంది.
బాలు ఎంట్రీ...
అప్పుడే పోలీస్ స్టేషన్‌కు బాలు వస్తాడు. తండ్రి లాకప్‌లో ఉండటం చూసి తట్టుకోలేకపోతాడు. నిన్ను ఇలా చూడలేకపోతున్నానని అంటాడు. నేను నిన్ను బయటకు తీసుకొస్తానని లాకప్ బద్దలు కొట్టబోతాడు. ఎస్ఐ అతడిని ఆపి...కిడ్నాప్ కేసులో మీ తండ్రిని అరెస్ట్ చేశామని అసలు నిజం చెబుతాడు. ఆ మాట వినగానే రవి షాకవుతాడు. సురేంద్ర మీ నాన్నపై కంప్లైంట్ ఇచ్చాడని బాలుతో అంటాడు పోలీస్ ఆఫీసర్.
బాలు రౌడీయిజం...
వీడే పెద్ద ఫ్రాడ్..వాటి మాట పట్టుకొని మా నాన్నపై ఎలా కేసు పెడతారని ఎస్ఐతో బాలు వాదిస్తాడు. ఆవేశంగా వెళ్లి సురేంద్ర కాలర్ పట్టుకుంటాడు బాలు. నా మీద కోపంతో మా నాన్నపై ఎందుకు తప్పుడు కేసులు పెట్టావని వార్నింగ్ ఇస్తాడు. పోలీస్ స్టేషన్‌లో రౌడీయిజం చేస్తున్నావా అంటూ బాలును ఎస్ఐ ఆపుతాడు.
రవికి తాను తీసుకొస్తానని, కానీ తన తండ్రిని మాత్రం లాకప్ నుంచి విడిపించమని ఎస్ఐని బాలు రిక్వెస్ట్‌చేస్తాడు. రవికి ఫోన్ చేయమని మీనాతో అంటాడు. రవి ఫోన్ స్విఛాఫ్‌లో ఉంది కాబట్టే నాన్నను పోలీసులు అరెస్ట్ చేశారని మనోజ్ అసలు సంగతి బయటపెడతాడు.
కుప్పకూలిపోయిన సత్యం...
రవి, శృతి గురించి ఎంక్వైరీ చేయడానికి వెళ్లిన కానిస్టేబుల్స్ స్టేషన్‌కు వస్తారు. రవి, శృతి ఉదయమే గుడిలో పెళ్లిచేసుకున్నారని చెబుతారు.ఆ మాట వినగానేసత్యం లాకప్‌లో కుప్పకూలిపోతాడు. పెళ్లికి సాక్షిగా రిజిస్ట్రేషన్ పేపర్‌పై మీనా సంతకం కనిపిస్తుంది. మీనా ఎవరనిఎస్ఐ అడుగుతాడు. నా భార్య అని మీనాను చూపిస్తాడు బాలు. తన గురించి ఎందుకు అడుగుతున్నారని ఎస్ఐతో అంటాడు బాలు.సాక్షి సంతకం తనే చేసింది అని ఎస్ఐ అనగానే బాలు షాకవుతాడు.
మీనా నమ్మకద్రోహం...
పోలీస్ ఆఫీసర్ మాట బాలు నమ్మడు. కావాలంటే నువ్వే చూడమని రిజిస్ట్రేషన్ బుక్‌ను బాలుకు చూపిస్తాడు ఎస్ఐ. ఏం తెలియని దానిలా మా వెంటే ఉంటూ మాకే నమ్మకద్రోహం చేస్తావా అని మీనాపై ప్రభావతి ఫైర్ అవుతుంది.
మేము ఏదైనా తప్పులు చేస్తే మమ్మల్ని నానా మాటలు అంటావు కదా...ఇప్పుడు నీ పెళ్లాం చేసిన పని వల్ల మీ నాన్న జైలులో ఖైదీలా కూర్చోవల్సివచ్చిందని ప్రభావతి అంటుంది. రవి, శృతిల పెళ్లి జరిగింది...పెళ్లి జరిగిన విషయం ఎందుకు పోలీసులకు చెప్పలేదని అందరూ మీనాను అడుగుతారు.
మీనాను కొట్టిన బాలు...
ఆ పెళ్లికి నువ్వే సాక్షి సంతకం చేశావా అని మీనాను అడుగుతాడు రవి. చేశానని మీనా సమాధానం చెప్పగానే ఆమె చెంపపై గట్టిగా ఒక్కటి కొడతాడు. ఎంత నమ్మాను నిన్ను...ఎంత ధైర్యం ఉంటే వాడి పెళ్లిని నువ్వే దగ్గరుండి చేస్తావని మీనాపై ఫైర్ అవుతుంది. నా క ళ్ల ముందు ఒక్క క్షణం కూడా ఉండొద్దని అంటాడు. నేను చెప్పేది వినమని భర్తను బతిమిలాడుతుంది మీనా. ఇంకో మాట మాట్లాడితే నిన్ను ఇక్కడే చంపి జైలుకు వెళతానని బాలు అంటాడు.
పరువు గంగలో కలిసిపోయింది...
తిండికిగతిలేని దానిని కోడలు చేస్తే ఎంతకు తెగించిందో చూశారా...ఇంటి పరువే గంగలో కలిపి కొడుకు పెళ్లిచేసింది...మిమ్మల్ని జైలు పాలు చేసిందని సత్యంతో అంటుంది ప్రభావతి. సత్యం కన్నీళ్లు పెట్టుకుంటాడు. శోభన, సురేంద్రపై ఎస్ఐ ఫైర్ అవుతాడు. వారిద్దరు ప్రేమించుకున్న సంగతి నా దగ్గర ఎందుకు దాచిపెట్టారని ఫైర్ అవుతాడు. రవిని తీసుకొచ్చి సత్యాన్ని తీసుకెళ్లమని బాలుతో అంటాడు ఎస్ఐ.
ప్రభావతి ఆవేశం...
పోలీస్ స్టేషన్ నుంచి బయటకు రాగానే మీనాపై ప్రభావతి, బాలు కోప్పడతారు. నువ్వు మా ఇంటికి పట్టిన దరిద్రానివి అని కోప్పడుతారు. నువ్వు నాకు ఎప్పటికీ కనిపించొద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపొమ్మని మీనాతో బాలు అంటాడు. మీనా కన్నీళ్లు పెట్టుకుంటుంది. అక్కడితో నేటి గుండెనిండా గుడిగంటలు సీరియల్ ముగిసింది.