Mahesh Babu: నా ప్రతి జ్ఞాపకంలో నువ్వుంటావు నాన్న - తండ్రిని గుర్తుచేసుకుంటూ మహేష్ ఎమోషనల్ పోస్ట్
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా తండ్రిని గుర్తుచేసుకుంటూ మహేష్‌బాబు ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. నా ప్రతి జ్ఞాపకంలో ఎప్పటికీ నువ్వు ఉంటావని మహేష్‌బాబు ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. మహేష్‌బాబు ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
Mahesh Babu: సూపర్ స్టార్ కృష్ణ జయంతిని పురస్కరించుకొని శుక్రవారం మహేష్‌బాబు ట్విట్టర్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు. కృష్ణ యంగ్ లుక్‌లో ఉన్న ఓ ఫొటోను మహేష్‌బాబు ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ ఫొటోను ఉద్దేశిస్తూ హ్యాపీ బర్త్‌డే నాన్న అంటూ మహేష్‌బాబు ట్వీట్ చేశాడు. మిమ్మల్ని నేను చాలా మిస్సవుతున్నా. నా గుండె లోతుల్లో...నా ప్రతి జ్ఞాపకంలో నువ్వు ఎప్పటికీ జీవిస్తూనే ఉంటావు అని మహేష్‌బాబు ఈ ట్వీట్‌లో పేర్కొన్నాడు. తండ్రి కృష్ణను గుర్తుచేసుకుంటూ మహేష్‌బాబు పెట్టిన ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
2022లో కృష్ణ కన్నుమూత...
2022 నవంబర్ 15న హార్ట్ ఎటాక్‌తో కృష్ణ కన్నుమూశాడు. కృష్ణ మరణం అనంతరం ఆరు నెలల పాటు మహేష్‌బాబు సినిమాలకు బ్రేక్ ఇచ్చాడు. ఆ తర్వాత గుంటూరు కారం సినిమా చేశాడు.
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబోలో హ్యాట్రిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన గుంటూరు కారం మిక్స్‌డ్ టాక్‌ను తెచ్చుకున్నది. త్రివిక్రమ్ కథతో పాటు టేకింగ్, మేకింగ్ పై దారుణంగా విమర్శలొచ్చాయి. రిజల్ట్‌తో సంబంధం లేకుండా ఈ మూవీ మూడు వందలకుపైగా కోట్ల కలెక్షన్స్‌ను రాబట్టినట్లు నిర్మాతలు వెల్లడించారు. గుంటూరు కారం మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు.
రాజమౌళితో మూవీ...
గుంటూరు కారం తర్వాత అగ్ర దర్శకుడు రాజమౌళితో ఓ అడ్వెంచరస్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ చేయబోతున్నాడు మహేష్‌బాబు. అతడు హీరోగా నటిస్తోన్న 29వ సినిమా ఇది. కృష్ణ జయంతి సందర్భంగా ఈ మూవీకి సంబంధించిన అప్‌డేట్‌ను మేకర్స్ వెల్లడించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమి లేదని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోన్నట్లు సమాచారం. మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఆగస్ట్ 9న అప్‌డేట్ వెల్లడించనున్నట్లు చెబుతోన్నారు.
రాజమౌళి మూవీ కోసం వర్కవుట్స్...
రాజమౌళి సినిమా కోసం మహేష్‌బాబు తన లుక్‌తో పాటు ఫిజిక్‌లో మార్చబోతున్నట్లు తెలుస్తోంది. బరువు పెరగనున్నట్లు చెబుతోన్నారు. ఇందుకోసం స్పెషల్ వర్కవుట్స్‌తో పాటు డైట్‌ను కూడా మహేష్ బాబు ఫాలో అవుతోన్నట్లు హరోంహర ప్రమోషన్స్‌లో సుధీర్ బాబు రివీల్ చేశాడు. మహేష్‌బాబు ఇంతకుమునుపెన్నడూ చూడని లుక్‌లో ఈ సినిమాలో కనిపిస్తాడని సుధీర్ బాబు పేర్కొన్నాడు.
పాన్ ఇండియన్ యాక్టర్స్...
మహేష్‌బాబు, రాజమౌళి మూవీలో పలువురు పాన్ ఇండియన్ నటీనటులు కీలక పాత్రలు పోషించనున్నట్లు సమాచారం. ఇందులో నాగార్జున, మోహన్‌లాల్ నటించే అవకాశం ఉన్నట్లు వార్తలు వినిపిస్తోన్నాయి. ఆదిపురుష్ ఫేమ్ దేవదత్తా నాగే నెగెటివ్ షేడ్స్ క్యారెక్టర్‌లో నటించనున్నట్లు చెబుతోన్నారు. దాదాపు వెయ్యి కోట్ల బడ్జెట్‌తో ఈ మూవీ తెరకెక్కబోతున్నట్లు వార్తలొస్తున్నాయి.
హాలీవుడ్ మూవీ ఇండియానా జోన్స్ తరహాలో అడ్వెంచరస్ థ్రిల్లర్‌గా ఈ మూవీ ఉండబోతున్నట్లు రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ పేర్కొన్నాడు. ఈ భారీ బడ్జెట్ మూవీకి కీరవాణి సంగీతాన్ని సమకూర్చుతున్నాడు.