Gopichand 31st Movie Launched: కన్నడ దర్శకుడికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ - 31వ సినిమా లాంఛ్
03 March 2023, 10:22 IST
Gopichand 31 Movie Launched: హీరో గోపీచంద్ 31వ సినిమా శుక్రవారం లాంఛనంగా ప్రారంభమైంది. ఈ సినిమాతో కన్నడ డైరెక్టర్ టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. అతడు ఎవరంటే...
గోపీచంద్, హర్ష
Gopichand 31 Movie Launched: జయాపజయాలకు అతీతంగా వరుససినిమాలకు గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నాడు గోపీచంద్. తాజాగా గోపీచంద్ 31వ సినిమా శుక్రవారం ప్రారంభమైంది. ఈ సినిమాతో కన్నడ డైరెక్టర్ హర్ష టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
కన్నడంలో శివరాజ్‌కుమార్, పునీత్‌రాజ్‌కుమార్‌లతో పలు విజయవంతమైన సినిమాల్ని తెరకెక్కించాడు హర్ష. శివరాజ్‌కుమార్ హీరోగా హర్ష దర్శకత్వంలో రూపొందిన వేద సినిమా ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. శుక్రవారం గోపీచంద్, హర్ష సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలను నిర్వహించారు.
ఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ఈ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్నట్లు సమాచారం. గోపీచంద్ హీరోగా నటిస్తోన్న 31వ సినిమా ఇది. కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించబోతున్నాడు. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కేకే రాధమోహన్ నిర్మిస్తోన్నాడు.
ప్రస్తుతం రామబాణం షూటింగ్‌తో గోపీచంద్ బిజీగా ఉన్నాడు. ఫ్యామిలీ యాక్షన్ అంశాలతో రూపొందుతోన్న ఈసినిమాకు శ్రీవాస్ దర్వకత్వం వహించబోతున్నాడు. లక్ష్యం, లౌక్యం తర్వాత గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న హ్యాట్రిక్ సినిమా ఇది కావడం గమనార్హం.
టాపిక్