Gopichand 30th Movie Title: గోపీచంద్ 30వ సినిమాకు మైథ‌లాజిక‌ల్ టైటిల్ - అనౌన్స్ చేసిన బాల‌కృష్ణ‌-gopichand 30th movie title announced by balakrishna ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
Telugu News  /  Entertainment  /  Gopichand 30th Movie Title Announced By Balakrishna

Gopichand 30th Movie Title: గోపీచంద్ 30వ సినిమాకు మైథ‌లాజిక‌ల్ టైటిల్ - అనౌన్స్ చేసిన బాల‌కృష్ణ‌

రామ‌బాణం
రామ‌బాణం

Gopichand 30th Movie Title: గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న 30వ సినిమా టైటిల్‌ను శ‌నివారం ఫిక్స్ చేశారు. అన్‌స్టాప‌బుల్ టాక్‌ షో ద్వారా ఈ సినిమా టైటిల్‌ను బాల‌కృష్ణ అనౌన్స్‌చేశాడు.

Gopichand 30th Movie Title: ల‌క్ష్యం, లౌక్యం త‌ర్వాత హీరో గోపీచంద్‌, ద‌ర్శ‌కుడు శ్రీవాస్ క‌ల‌యిక‌లో మూడో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా టైటిల్‌ను శ‌నివారం రివీల్ చేశారు. రామ‌బాణం అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ టైటిల్‌ను డిఫ‌రెంట్‌గా అనౌన్స్‌చేశారు. ఇటీవ‌లే బాల‌కృష్ణ హోస్ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తోన్న అన్‌స్టాప‌బుల్ టాక్‌షోకు ప్ర‌భాస్‌తో పాటు గోపీచంద్ హాజ‌రైన సంగ‌తి తెలిసిందే. ఈ షోలో బాల‌కృష్ణ స్వ‌యంగా గోపీచంద్ సినిమా టైటిల్‌ను అనౌన్స్ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

క‌మ‌ర్షియ‌ల్ సినిమాకు మైథ‌లాజిక‌ల్ ట‌చ్‌తో కూడిన టైటిల్ పెట్ట‌డం ఆస‌క్తిని రేకెత్తిస్తోంది. ఫ్యామిలీ ఎమోష‌న్స్‌కు సామాజిక సందేశాన్ని జోడించి రామ‌బాణం సినిమాను ద‌ర్శ‌కుడు శ్రీవాస్ తెర‌కెక్కించ‌బోతున్నాడు. రామ‌బాణం సినిమాలో డింపుల్ హ‌య‌తి హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఇందులో గోపీచంద్ అన్న‌య్య‌గా జ‌గ‌ప‌తిబాబు క‌నిపిచ‌బోతున్నాడు. ఖుష్బూ వ‌దిన పాత్ర‌లో న‌టిస్తోంది.

గోపీచంద్ హీరోగా న‌టిస్తోన్న 30వ సినిమా ఇది. గ‌తంలో గోపీచంద్‌, డైరెక్ట‌ర్ శ్రీవాస్ క‌ల‌యిక‌లో వ‌చ్చిన ల‌క్ష్యం, లౌక్యం సినిమాల‌కు మించి ఉండ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ సినిమా షూటింగ్ తుది ద‌శ‌కు చేరుకున్న‌ది. ఇటీవ‌లే ధ‌మాకాతో పెద్ద విజ‌యాన్ని అందుకున్న పీపుల్స్ మీడియా ఫ్యాక్ట‌రీ సంస్థ రామ‌బాణం సినిమాను నిర్మిస్తోంది.

ఈ ఏడాది వేస‌విలో రామ‌బాణం సినిమాను రిలీజ్ చేసేందుకు స‌న్నాహాలు చేస్తోన్నారు. ఈ సినిమాకు మిక్కీ జే మేయ‌ర్ సంగీతాన్ని అందిస్తోన్నాడు. రామ‌బాణం త‌ర్వాత ద‌ర్శ‌కుడు శ్రీనువైట్ల‌తో గోపీచంద్ ఓ సినిమా చేయ‌బోతున్నాడు.

WhatsApp channel
హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే బిగ్‌బాస్ 7 తెలుగు, ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.