Vedha OTT Release Date: శివరాజ్‌కుమార్ హీరోగా నటించిన వేద సినిమా తెలుగులో థియేటర్లలో విడుదలైన తర్వాత రోజే ఓటీటీలోకి రానుంది. రివేంజ్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమా కన్నడంలో డిసెంబర్ 23న రిలీజైంది. ఈ సినిమాకు హర్ష దర్శకత్వం వహించాడు. థియేటర్లలో మిక్స్డ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న ఈ సినిమాను అదే పేరుతో తెలుగులో డబ్ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ,ఈ నెల 9న తెలుగు వెర్షన్‌ను థియేటర్లలో రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగు డబ్బింగ్ రైట్స్ కొన్న నిర్మాతలకు జీ5 ఓటీటీ సంస్థ బిగ్ షాక్ ఇచ్చింది. వేద సినిమాను ఫిబ్రవరి 10న ఓటీటీలో రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించింది. కన్నడంతో పాటు దక్షిణాది భాషలన్నింటిలో ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు వెల్లడించింది. ,తెలుగు వెర్షన్ థియేటర్లలో 9వ తేదీన రిలీజ్ కానుండా ఓటీటీలో 10వ డేట్ నుంచి సినిమా స్ట్రీమింగ్ కానుంది. థియేటర్లలో విడుదలైన తర్వాత రోజే ఈ సినిమా ఓటీటీలో రిలీజ్ కానుండటం ఆసక్తికరంగా మారింది. వేద సినిమాను గీతా పిక్చర్స్ పతాకంపై శివరాజ్‌కుమార్ స్వయంగా నిర్మించారు. అతడు నిర్మించిన తొలి సినిమా ఇదే కావడం గమనార్హం. ,వేద సినిమాలో ఘనవి లక్ష్మణ్, అదితి సాగర్ ప్రధాన పాత్రల్లో నటించారు. కన్నడంలో భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ఫెయిల్యూర్‌గా నిలిచింది.