తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gopichand: ఆయన్ను గుడ్డిగా నమ్మేశాను.. పది టేకులు చేయాల్సి వచ్చింది.. గోపీచంద్ కామెంట్స్

Gopichand: ఆయన్ను గుడ్డిగా నమ్మేశాను.. పది టేకులు చేయాల్సి వచ్చింది.. గోపీచంద్ కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

19 October 2024, 11:07 IST

google News
  • Gopichand Comments On Viswam Movie: గోపీచంద్ నటించిన కామెడీ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం విశ్వం అక్టోబర్ 11న విడుదలై మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ నేపథ్యంలో విశ్వం దసరా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గోపీచంద్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

ఆయన్ను గుడ్డిగా నమ్మేశాను.. పది టేకులు చేయాల్సి వచ్చింది.. గోపీచంద్ కామెంట్స్
ఆయన్ను గుడ్డిగా నమ్మేశాను.. పది టేకులు చేయాల్సి వచ్చింది.. గోపీచంద్ కామెంట్స్

ఆయన్ను గుడ్డిగా నమ్మేశాను.. పది టేకులు చేయాల్సి వచ్చింది.. గోపీచంద్ కామెంట్స్

Gopichand Viswam Success Meet: మాచో స్టార్ గోపీచంద్, దర్శకుడు శ్రీను వైట్ల కాంబినేషన్‌లో తెరకెక్కిన సినిమా విశ్వం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, వేణు దోనేపూడి చిత్రాలయం స్టూడియోస్‌‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ హైబడ్జెట్‌తో నిర్మించారు. దోనేపూడి చక్రపాణి ఈ చిత్రాన్ని సమర్పించారు.

విశ్వం దసరా బ్లాక్ బస్టర్

దసరా కానుకగా అక్టోబర్ 11న వరల్డ్ వైడ్‌గా చాలా గ్రాండ్‌గా విశ్వం సినిమా రిలీజ్ అయింది. అయితే, విడుదలైన తొలిరోజు నుంచే విశ్వం మూవీకి అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. దాంతో బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో ఘన విజయాన్ని సాధించి సక్సెస్‌ఫుల్‌గా రన్ అవుతోంది. ఈ సందర్భంగా మేకర్స్ గ్రాండ్‌గా విశ్వం దసరా బ్లాక్ బస్టర్ సక్సెస్ మీట్ నిర్వహించారు.

ఎప్పుడు రుణపడి

విశ్వం సక్సెస్ మీట్‌లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. విశ్వం సినిమా అక్టోబర్ 11న రిలీజ్ అయినప్పుడు నుంచి ఈ సినిమాని ఇంత గొప్పగా ఆదరించిన తెలుగు ప్రేక్షకులు అందరికీ పేరు పేరునా థాంక్యూ సో మచ్. ఇంత మంచి సక్సెస్ ఇచ్చినందుకు మీ అందరికీ ఎప్పుడూ రుణపడి ఉంటాను. ఇంత బాగా సపోర్ట్ చేసిన మీడియాకి పేరుపేరునా ధన్యవాదాలు" అని అన్నాడు.

చాలా ఇబ్బంది పెట్టాను

"ఈ సినిమా విషయంలో డైరెక్టర్ గారిని బ్లైండ్‌గా నమ్మేశాను. చాలా మంచి రిజల్ట్ ఇచ్చారు. థాంక్యూ సో మచ్ సార్. నరేష్ గారు, ప్రథ్వీగారు.. ఇలా ఈ సినిమాలో పనిచేసిన ప్రతి యాక్టర్‌ని చాలా ఇబ్బంది పెట్టాను (నవ్వుతూ). వాళ్లంతా ఒకటే టేక్‌లో ఫినిష్ చేసి వెళ్లేవారు. నా వల్ల పది టేకులు చేయాల్సి వచ్చింది" అని గోపీచంద్ తెలిపాడు.

చాలా హ్యాపీగా ఉంది

"వాళ్లు యాక్ట్ చేసేటప్పుడు నవ్వుతూనే ఉన్నాను. ఆ రోజు నేను ఏదైతే ఫీలయ్యానో సేమ్ అదే థియేటర్లో ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు. ప్రతి సీన్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్స్‌లో ఆడియన్స్ నవ్వులు చూస్తుంటే చాలా హ్యాపీగా ఉంది. కామెడీ, యాక్షన్, ఎమోషన్ అన్ని సీన్స్‌ని చాలా ఎంజాయ్ చేస్తున్నారు" అని గోపీచంద్ పేర్కొన్నాడు.

పాప సెంటిమెంట్

"ఇందులో చిన్న పాప చాలా అద్భుతంగా నటించింది. ఆ పాప సెంటిమెంట్ కూడా చాలా బాగా వర్క్ అవుట్ అయింది. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్ చాలా హార్డ్ వర్క్ చేశారు. తెరవెనుక చాలా కష్టపడ్డారు. ఈ సినిమాలో పని చేసిన నటీనటులు, టెక్నీషియన్స్ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు. వర్డ్ ఆఫ్ మౌత్ అని వినేవాన్ని కానీ, ఈ సినిమాకి చూశాను. ప్రేక్షకులు వోన్ చేసుకుంటే సినిమాని ఎంత దూరమైనా తీసుకెళ్తారని ఈ సినిమాతో నిరూపించారు. అందరికీ థాంక్యూ సో మచ్' అని గోపీచంద్ తన స్పీచ్ ముగించాడు.

ఎడిటర్ చేసినందుకు

ఎడిటర్ అమర్ మాట్లాడుతూ.. "శ్రీనువైట్ల గారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. ఆయన సినిమాకు అసిస్టెంట్‌గా పని చేశాను. నన్ను నమ్మి ఇంత పెద్ద సినిమాలో ఎడిటర్ చేసిన శ్రీను గారికి థాంక్యూ. మా హీరో గోపీచంద్ గారికి, మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారికి, వేణు గారికి చాలా చాలా థాంక్యూ. ఇంత పెద్ద హిట్ ఇచ్చినందుకు ప్రేక్షకులు అందరికీ ధన్యవాదాలు" అని తెలిపారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం