Ram Charan on Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు సినిమాపై స్పందించిన రామ్‍చరణ్
13 August 2024, 17:15 IST
- Ram Charan on Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి సక్సెస్ అవుతోంది. నిహారిక కొణిదెల నిర్మించిన ఈ చిత్రం కలెక్షన్లతో దుమ్మురేపుతోంది. ఈ మూవీపై చాలా మంది సెలెబ్రిటీలు స్పందిస్తున్నారు. మెగాపవర్ స్టార్ రామ్‍చరణ్ నేడు ఈ చిత్రం గురించి ట్వీట్ చేశారు.
Ram Charan on Committee Kurrollu: కమిటీ కుర్రోళ్ళు సినిమాపై స్పందించిన రామ్‍చరణ్
తక్కువ బడ్జెట్‍తో రూపొందిన కమిటీ కుర్రోళ్ళు సినిమా భారీ హిట్ దిశగా దూసుకెళుతోంది. అంచనాలకు మించి కలెక్షన్లతో ఈ యూత్‍ఫుల్ రూరల్ కామెడీ మూవీ అదరగొడుతోంది. నిర్మాతగా మెగా డాటర్ కొణిదెల నిహారికకు ఇదే తొలి చిత్రంగా ఉంది. ప్రొడ్యూజర్‌గా ఫస్ట్ మూవీతోనే ఆమె మంచి సక్సెస్ సాధించారు. ఆగస్టు 9న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ మంచి వసూళ్లను సాధిస్తోంది. కమిటీ కుర్రోళ్ళు సినిమాపై చాలా మంది సినీ సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. ఈ మూవీ టీమ్‍కు విషెస్ చెప్పారు. తన సోదరి నిహారిక నిర్మించిన ఈ చిత్రంపై మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ నేడు (ఆగస్టు 13) స్పందించారు.
నిహారిక తల్లి అంటూ..
ప్రొడ్యూసర్‌గా తొలి సినిమాతోనే హిట్ అందుకున్న నిహారికకు అభినందనలు తెలిపారు రామ్‍చరణ్. ఈ మూవీ టీమ్ మొత్తంగా అద్భుతంగా కష్టడిందంటూ ట్వీట్ చేశారు. “కమిటీ కుర్రోళ్ళు భారీ సక్సెస్ అయినందుకు నిహారిక తల్లికి కంగ్రాచులేషన్స్. ఈ విజయానికి పూర్తి అర్హత ఉంది. టీమ్‍తో కలిసి నువ్వు చేసిన శ్రమ, అంకితబావం చాలా స్ఫూర్తిదాయకం. అద్భుతంగా పని చేసిన నటీనటులు, క్రూకు అభినందనలు. ఈ స్టోరీకి ప్రాణం పోసిన డైరెక్టర్ యధు వంశీకి ప్రత్యేకమైన అభినందనలు తెలుపుతున్నా” రామ్‍చరణ్ ట్వీట్ చేశారు.
కమిటీ కుర్రోళ్ళు సినిమాలో 11 మంది హీరోలు అంటూ ముందు నుంచి మూవీ టీమ్ ప్రోమోట్ చేస్తోంది. అందుకు తగ్గట్టే ఈ చిత్రంలో ఫ్రెండ్స్ గ్రూప్‍లో అందరికీ ప్రాధాన్యత ఉంది. కామెడీతో పాటు అప్పటి జ్ఞాపకాలను గుర్తు చేస్తూ ప్రేక్షకుల మనసులను ఈ మూవీ గెలుచుకుంటోంది. ఈ సినినిమాలో సందీప్ సరోజ్, యశ్వంత్ పెండ్యాల, ప్రసాద్ బెహరా,, త్రినాథ్ వర్మ, మణికంఠ పరసు, ఈశ్వర్ రాచిరాజు, లోకేశ్ కుమార్ పరిమి, అక్షయ్ శ్రీనివాస్, శ్యామ్ కల్యాణ్, రఘువరన్, శివకుమార్ ఫ్రెండ్స్ పాత్రలు చేశారు. గోదావరి జిల్లాలోని ఓ గ్రామం బ్యాక్‍డ్రాప్‍లో ఈ మూవీ సాగుతుంది.
కమిటీ కుర్రోళ్ళు సినిమాను దర్శకుడు యధు వంశీ ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా చూపించారు. స్నేహితుల మధ్య బంధం, గ్రామీణ నేపథ్యంతో ఆకట్టుకునేలా తెరకెక్కించారు. దర్శకుడిగా తొలి చిత్రంతోనే మెప్పించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధాదామోదర స్టూడియోస్ పతాకాలపై.. నిహారిక సమర్పణలో ఈ చిత్రం వచ్చింది.
నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి..
కమిటీ కుర్రోళ్ళు సినిమా రిలీజైన నాలుగు రోజుల్లోనే లాభాల్లోకి వచ్చేసినట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి నాలుగు రోజుల్లోనే రూ.7.48 కోట్ల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి. ఆరంభం నుంచి పాజిటివ్ టాక్ రావటంతో ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద దూసుకెళుతోంది.
కమిటీ కుర్రోళ్ళు సినిమాపై సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, స్టార్ డైరెక్టర్ సుకుమార్, నేచురల్ స్టార్ నాని సహా మరికొందరు టాలీవుడ్ సెలెబ్రిటీలు సోషల్ మీడియాలో పోస్టులు చేశారు. మంచి సక్సెస్ సాధించిన టీమ్‍ను అభినందించారు.
మెగా పవర్ స్టార్ రామ్‍చరణ్ నటించిన గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ కావాల్సింది ఉంది. స్టార్ డైరెక్టర్ శంకర్ రూపొందించిన ఈ భారీ బడ్జెట్ పొలిటికల్ యాక్షన్ చిత్రాన్ని డిసెంబర్‌లో రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
టాపిక్