తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Gaami Ott: ఓటీటీలో నేషనల్ వైడ్‍లో టాప్‍లో విశ్వక్‍సేన్ సినిమా.. అదిరిపోయే రెస్పాన్స్

Gaami OTT: ఓటీటీలో నేషనల్ వైడ్‍లో టాప్‍లో విశ్వక్‍సేన్ సినిమా.. అదిరిపోయే రెస్పాన్స్

13 April 2024, 21:22 IST

    • Gaami OTT Streaming: గామి సినిమా ఓటీటీలోనూ సూపర్ రెస్పాన్ దక్కించుకుంటోంది. థియేటర్లలో మంచి సక్సెస్ అయిన ఈ చిత్రం డిజిటల్‍లోనూ దుమ్మురేపుతోంది. దీంతో నేషనల్ వైడ్‍గా టాప్‍లో ట్రెండ్ అవుతోంది.
Gaami OTT Streaming: ఓటీటీలో నేషనల్ వైడ్‍లో టాప్‍లో విశ్వక్‍సేన్ సినిమా.. అదిరిపోయే రెస్పాన్స్
Gaami OTT Streaming: ఓటీటీలో నేషనల్ వైడ్‍లో టాప్‍లో విశ్వక్‍సేన్ సినిమా.. అదిరిపోయే రెస్పాన్స్

Gaami OTT Streaming: ఓటీటీలో నేషనల్ వైడ్‍లో టాప్‍లో విశ్వక్‍సేన్ సినిమా.. అదిరిపోయే రెస్పాన్స్

Gaami OTT Streaming: ఎపిక్ అడ్వెంచర్ థ్రిల్లర్ మూవీ ‘గామి’ సూపర్ హిట్ అయింది. ప్రశంసలతో పాటు కలెక్షన్లు విషయంలోనూ దుమ్మురేపింది. మాస్ కా దాస్ విశ్వక్‍సేన్ హీరోగా నటించిన ఈ సినిమా మంచి సక్సెస్ అయింది. విభిన్నమైన స్టోరీ, డిఫరెంట్ నరేషన్‍తో దర్శకుడు విద్యాధర్ కాగిత ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. మార్చి 8న థియేటర్లలో రిలీజై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఇప్పుడు ఓటీటీలోనూ గామి దుమ్మురేపుతోంది. నేషనల్ వైడ్‍లో ట్రెండ్ అవుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Panchayat 3 Trailer: పంచాయత్ సీజన్ 3 ట్రైలర్ వచ్చేసింది.. మరింత రాజకీయం, నవ్వులతో అదిరిపోయింది

Getup Srinu: ఆ ఇద్దరు హీరోలపై నమ్మకం కుదర్లేదు.. గెటప్ శ్రీను పర్ఫెక్ట్.. డైరెక్టర్ కామెంట్స్

Suchitra Dhanush: హీరో ధనుష్ గే.. రాత్రి 3 గంటలకు నా భర్తతో ఏం పని.. సింగర్ సుచిత్ర కామెంట్స్

Maya Petika OTT: మరో ఓటీటీలోకి కూడా వచ్చేస్తున్న పాయల్ రాజ్‌పుత్ మాయా పేటిక మూవీ

టాప్‍లో ట్రెండింగ్

గామి సినిమా ఏప్రిల్ 12వ తేదీన జీ5 ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ డబ్బింగ్ వెర్షన్‍లలోనూ స్ట్రీమింగ్‍కు వచ్చింది. మంచి హైప్ ఉన్న ఈ చిత్రం ఓటీటీలోనూ దూసుకెళుతోంది. మంచి వ్యూస్ దక్కించుకుంటోంది.

గామి సినిమా ప్రస్తుతం జీ5 ఓటీటీలో ఇండియా ట్రెండింగ్‍లో టాప్‍కు వచ్చింది. నంబర్ వన్‍లో ట్రెండ్ అవుతోంది. హనుమాన్ చిత్రం జీ5లో సుమారు 28 రోజులుగా టాప్‍లో ట్రెండ్ అవుతుండగా.. ఇప్పుడు గామి ఫస్ట్ ప్లేస్‍కు వచ్చింది.

సూపర్ రెస్పాన్స్

గామి సినిమాకు ఓటీటీలోనూ మంచి రెస్పాన్స్ వస్తోంది. ఓటీటీలో ఈ చిత్రాన్ని చూసిన కొందరు నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు. ముఖ్యంగా ఈ మూవీలోని విజువల్స్, విశ్వక్‍సేన్ యాక్టింగ్‍ను పొగుడుతున్నారు. ఈ మూవీ నరేషన్‍ను కూడా ప్రశంసిస్తూ పోస్టులు చేస్తున్నారు. మొత్తంగా థియేటర్లలో సూపర్ హిట్ అయిన గామి.. జీ5 ఓటీటీలోనూ దూసుకెళుతోంది.

గామి సినిమాలో శంకర్ అనే అఘోరగా విశ్వక్‍సేన్ నటించారు. మనిషి స్పర్శతో తనకు ఉన్న ఇబ్బందిని పోగొట్టుకునేందుకు హిమాలయాల్లోని మాలికా పత్రాల కోసం చేసే సాహస ప్రయాణం ప్రధాన అంశంగా ఈ మూవీ తెరకెక్కింది. ఈ మూవీలో చాందినీ చౌదరి, అభినయ, మహమ్మద్ సమాద్, హారికా పెద్ది, దయానంద్ రెడ్డి, శాంతి రావు కీరోల్స్ చేశారు.

గామి చిత్రానికి నరేశ్ కుమారన్ సంగీతం అందించారు. విశ్వనాథ్ రెడ్డి సినిమాటోగ్రఫీ ఈ మూవీలో మెప్పించింది. కార్తీక్ కల్ట్ క్రియేషన్స్, వీ సెల్యూలాయిడ్స్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మించాయి. తక్కువ బడ్జెట్‍లోనే హైక్వాలిటీ వీఎఫ్‍ఎక్స్, విజువల్స్‌తో ఈ చిత్రాన్ని డైరెక్టర్ విద్యాధర్ కాగిత తెరకెక్కించారు.

ప్రైమ్ వీడియోలో ఓం భీమ్ బుష్

శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఓం భీమ్ బుష్ సినిమా కూడా ఏప్రిల్ 12వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు వచ్చింది. శ్రీవిష్ణు, రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి ప్రధాన పాత్రలు పోషించిన ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ ఆ ఓటీటీలో ట్రెండ్ అవుతోంది. మార్చి 22వ తేదీన థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ అవగా.. ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. ఓం భీమ్ బుష్ చిత్రానికి శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించారు. ప్రీతీ ముకుందన్, అయేషా ఖాన్, శ్రీకాంత్ అయ్యంగార్, ఆదిత్య మీనన్ కీరోల్స్‌లో కనిపించారు. ఈ చిత్రానికి సన్నీ ఎంఆర్ మ్యూజిక్ ఇచ్చారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం