RRR Screening in USA: లాస్ ఏంజెల్స్‌లో ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్.. నాటు నాటు డ్యాన్స్‌తో ఫ్యాన్స్ సందడి
03 March 2023, 18:05 IST
- RRR Screening in USA: ఆర్ఆర్ఆర్ చిత్ర రీరిలీజ్ సందర్భంగా ఈ సినిమా స్పెషల్ స్క్రీనింగ్‌ను లాస్ ఏంజెల్స్‌లో ప్రదర్శించింది చిత్రబృందం. ఈ సందర్భంగా ప్రేక్షకుల తమ డ్యాన్సులతో అలరించారు. నాటు నాటు పాటకు డ్యాన్స్ చేస్తూ ఆకట్టుకున్నారు.
ఆర్ఆర్ఆర్ స్పెషల్ స్క్రీనింగ్
RRR Screening in USA: దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. సరిహద్దులు దాటి మారి ఈ సినిమా ఇంటర్నేషనల్ స్థాయిలో ప్రేక్షకులను విపరీతంగా అలరిస్తోంది. ఆస్కార్ నామినేషన్ కూడా దక్కించుకున్న ఈ సినిమా మార్చి 3న మరోసారి అమెరికాలో రీ రిలీజైంది. ఇందులో భాగంగా లాస్ఏంజెల్స్‌లో 1647 సీటింగ్ కెపాసిటీ కలిగిన థియేటర్‌లో స్పెషల్ స్క్రీనింగ్ నిర్వహించారు. ఈ స్క్రీనింగ్ కోసం హాల్ బయటు చాలా దూరం వరకు ఆడియెన్స్ క్యూలో నిలుచుని ఉన్న వీడియోను ఆర్ఆర్ఆర్ టీమ్ తన ట్విటర్ వేదికగా విడుదల చేసింది. అంతేకాకుండా స్క్రీనింగ్ సమయంలో ప్రేక్షకుల కేరింతలు కొడుతూ సందడి చేస్తున్న వీడియోలను కూడా షేర్ చేసింది.
లాస్ ఏంజిల్స్ థియేటర్లలో ప్రజలు నాటు నాటు పాటకు తమదైన శైలిలో నర్తిస్తున్నారు. అద్భుతంగా డ్యాన్స్ చేస్తున్న వారు థియేటర్లో రచ్చ రచ్చ చేయడం గమనించవచ్చు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
ఇందులో హీరోగా నటించిన రామ్ చరణ్ కూడా అభిమానుల సందడి చూపిస్తూ కొన్ని ఫొటోలను షేర్ చేశాడు. ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ సమయంలో ప్రేక్షకులను ఆనందాంపై సంతృప్తి వ్యక్తం చేశాడు. ఏస్ హోటెల్‌లో ఆర్ఆర్ఆర్ స్క్రీనింగ్ సమయంలో ప్రేక్షకుల ఆనందోత్సహాలను చూస్తుంటే సంతోషంగా ఉంది. స్టాండింగ్ ఓవేషన్‌ను చూస్తే జీవితాంతం ఇది గుర్తుండిపోయే జ్ఞాపకంగా మారుతుంది. థ్యాంక్యూ సో మచ్ అంటూ రామ్ చరణ్ తన ట్విటర్ వేదికగా తెలియజేశారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో రామ్‌చరణ్ సరసన సీత పాత్రలో ఆలియా భట్, తారక్ సరసన బ్రిటీష్ యాక్ట్రెస్ ఒలివియా మోరిస్ నటించారు. అజయ్ దేవగణ్ ప్రత్యేక పాత్రలో కనిపించారు. ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మించారు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రానికి ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూర్చారు. గతేడాది మార్చి 25న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయళ భాషల్లో ఈ సినిమా ఒకేసారి విడుదలైంది. మొత్తంగా రూ.1200 కోట్ల పైచిలుకు కలెక్షన్లు రాబట్టింది.