OTT: ఒక్క ఓటీటీలోనే 16 సినిమాలు, 4 వెబ్ సిరీసులు.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
17 July 2024, 10:18 IST
ETV Win OTT Movies And Web Series In A Year: ఒక్క ఈటీవీ విన్ ఓటీటీలోనే సంవత్సరంలో ఏకంగా 16 సినిమాలు, 4 వెబ్ సిరీసులు స్ట్రీమింగ్ కానున్నాయి. దీనికి సంబంధించిన విషయాన్ని ఈటీవీ విన్ ఓటీటీకి చెందిన సాయికృష్ణ శశి మథనం సక్సెస్ మీట్‌లో చెప్పారు.
ఒక్క ఓటీటీలోనే 16 సినిమాలు, 4 వెబ్ సిరీసులు.. తెలుగులోనే స్ట్రీమింగ్.. ఎక్కడంటే?
ETV Win OTT Movies And Web Series: తెలుగు కంటెంట్‌తో అదరగొట్టే ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ చాలానే ఉన్నాయి. కానీ, కేవలం ఒక తెలుగు కంటెంట్‌ను మాత్రమే అందించే ఓటీటీ వేదికలు చాలా తక్కువ. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో తెలుగు కంటెంట్ అందిస్తూ సక్సెస్‌ఫుల్‌గా దూసుకుపోతున్నవి రెండే. ఆ రెండే ఆహా ఓటీటీ, ఈటీవీ విన్ ఓటీటీ.
ఎప్పటికప్పుడు సరికొత్త జోనర్స్‌లో సినిమాలు, వెబ్ సిరీసులను అందిస్తూ యావత్ తెలుగు ఓటీటీ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నాయి ఈ ఓటీటీలు. వీటిలోని ఈటీవీ విన్ ఓటీటీలో సంవత్సరానికి ఏకంగా 16 సినిమాలతో పాటు నాలుగు వెబ్ సిరీసులు అందిస్తామని సదరు సంస్థ నిర్వాహకులు చెబుతున్నారు.
ఇటీవల ఈటీవీ విన్ ఓటీటీలో రిలీజై సూపర్ సక్సెస్ సాధించిన తెలుగు వెబ్ సిరీస్ శశిమథనం. జూలై 4న ఈటీవీ విన్‌లో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఈ తెలుగు రొమాంటిక్ కామెడీ వెబ్ సిరీస్ అతి తక్కువ సమయంలోనే ట్రెండింగ్‌లోకి వచ్చింది. హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుని ఈటీవీ విన్ ఓటీటీలో టాప్ 1 ప్లేసులో ట్రెండింగ్‌లోకి వచ్చి సక్సెస్ అయింది. దీంతో సిరీస్ యూనిట్ సక్సెస్ మీట్ నిర్వహించింది.
ఈ శశిమథనం సక్సెస్ మీట్‌లో ఈటీవీ విన్‌కు చెందిన సాయికృష్ణ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. "శశిమథనం సక్సెస్ మీట్‌ని సెలబ్రేట్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. డైరెక్టర్ వినోద్, నటీనటులు అందరికీ థాంక్ యూ. సోనియా, సిద్దు సిరిస్‌ని చాలా క్యూట్‌గా మార్చేశారు" అని సాయికృష్ణ తెలిపారు.
"మా దృష్టిలో కథ కథనాలే హీరో. కథ కథనాలే సెన్సేషనల్ కాంబినేషన్. రామోజీరావు గారి నేర్పిన విలువలు పాటిస్తూ ఆయన బాటలో నడుస్తాం. తెలుగుదనం ఉట్టిపడే కథలు చెప్పాలనేది మా ప్రయత్నం. ఏడాదిలో 16 సినిమాలు నాలుగు వెబ్ సిరిస్‌లు చేస్తున్నాం. ఈ ఇరవైమంది కొత్త దర్శకులతోపాటు ఎంతోమంది కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులు పరిచయం కాబోతున్నారు" అని సాయికృష్ణ అన్నారు.
"కథ బావుంటే కచ్చితంగా సినిమా, వెబ్ సిరిస్‌ని నిర్మిస్తాం. మంచి కథలు ఉంటే చెప్పండి. మేము సపోర్ట్ చేస్తాం. ఫ్యామిలీ అంతా కూర్చుని చూసే క్లీన్ ఎంటర్‌టైనర్స్‌ని అందిస్తాం" అని ఈటీవీ విన్ సాయికృష్ణ హామీ ఇచ్చారు. ఇలా ఈటీవీ విన్ ఒక్క ఓటీటీలో ఏడాదికి 16 సినిమాలు, 4 వెబ్ సిరీసులు రానున్నాయని తెలుస్తోంది. అలాగే వీటితో కొత్తగా 20 మంది డైరెక్టర్స్ పరిచయం కానున్నారు.
కాగా శశిమథనం వెబ్ సిరీస్‌లో సోనియా సింగ్, పవన్ సిద్ధూ హీరో హీరోయిన్స్‌గా నటించారు. ఈ వెబ్ సిరీస్‌కు గాలి వినోద్ దర్శకత్వం వహించారు. అలాగే హరీష్ కోహిర్కర్ నిర్మించారు. కాగా శశిమథనం వెబ్ సిరీస్‌కు సీక్వెల్ కూడా ఉంటుందని, త్వరలో శశిమథనం 2 కూడా వస్తుందని ఈటీవీ విన్ ఓటీటీ కంటెంట్ హెడ్ నితిన్ పేర్కొన్నారు.
ఇక శశిమథనం వెబ్ సిరీస్‌తో ఈటీవీ విన్‌కు సబ్‌స్క్రిప్షన్స్ పెరిగాయని, పెట్టిన పెట్టుబడి తొలి నెలలోనే వచ్చేసిందని కంటెంట్ హెడ్ నితిన్ చెప్పుకొచ్చారు. ఈ ఉత్సాహంతోనే ఈటీవీ విన్ నుంచి డిఫరెంట్ కంటెంట్‌తో తెలుగు సినిమాలు, వెబ్ సిరీసులు రూపొందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు.
టాపిక్