Emraan Hashmi in OG: ఓజీ ఫస్ట్ లుక్‍లో ఇమ్రాన్ హష్మి పట్టుకున్న లైటర్‌పై ఏం రాసుందో తెలుసా?
24 March 2024, 17:44 IST
- Emraan Hashmi in OG Movie: ఓజీ సినిమా నుంచి బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి ఫస్ట్ లుక్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో ఇమ్రాన్ విలన్‍గా చేస్తున్నారు. ఈ ఫస్ట్ లుక్‍లో ఇమ్రాన్ చేతిలో ఉన్న లైటర్‌పై ఏం రాసుందంటే..
Emraan Hashmi in OG: ఓజీ ఫస్ట్ లుక్‍లో ఇమ్రాన్ హష్మి పట్టుకున్న లైటర్‌పై ఏం రాసుందో తెలుసా?
Emraan Hashmi in OG: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటిస్తున్న ఓజీ చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. గ్యాంగ్‍స్టర్స్ యాక్షన్ మూవీగా ఈ చిత్రం ఉండనుంది. సాహో ఫేమ్ సుజీత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీలో పవన్ వైలెంట్ గ్యాంగ్‍స్టర్‌గా నటిస్తుండటంతో చాలా ఆసక్తి ఉంది. ఈ మూవీ గ్లింప్స్ హైప్‍ను విపరీతంగా పెంచేసింది. పాన్ ఇండియా రేంజ్‍లో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ చిత్రంతో బాలీవుడ్ స్టార్ ఇమ్రాన్ హష్మి.. తెలుగులో అడుగుపెడుతున్నారు. నేడు (మార్చి 24) ఇమ్రాన్ పుట్టిన రోజు సందర్భంగా ఓజీ మూవీ నుంచి ఆయన ఫస్ట్ లుక్ వచ్చింది.
ఫస్ట్ లుక్ ఇలా..
ఓజీ సినిమాలో ఇమ్రాన్ ఖాన్ ఫస్ట్ లుక్‍తో పాటు ఆయన క్యారెక్టర్ పేరును కూడా మూవీ టీమ్ నేడు వెల్లడించింది. ఈ మూవీలో ఓమీ బవూ అనే గ్యాంగ్‍స్టర్‌గా ఇమ్రాన్ నటించనున్నారు. లాంగ్ హెయిర్‌తో ఇంటెన్స్ లుక్‍తో ఈ పోస్టర్‌లో ఆయన ఉన్నారు. కనురెప్ప పైభాగంలో కత్తిపోటు ఉంది. స్టైలిష్‍గా పెన్ లాంటి లైటర్‌తో ఇమ్రాన్ చుట్ట కాల్చుతున్నట్టు ఈ ఫస్ట్ లుక్‍లో ఉంది.
ఆ లైటర్‌పై ఏముందంటే..
ఈ పోస్టర్‌లో ఇమ్రాన్ హష్మి చేతిలో ఉన్న లైటర్‌పై జపనీస్‍లో రెండు పదాలు ఉన్నాయి. ఈ పోస్టర్ జూమ్ చేసి మరీ అదేంటోనని నెటిజన్లు సెర్చ్ చేస్తున్నారు. ఈ లైటర్‌పై జపనీస్‍లో రాసి ఉన్న పదాలకు అర్ధం ‘క్రూరమైన హైనా’ అని తెలుస్తోంది.
హంగ్రీ చీతా vs హైనా
ఓజీలో పవన్ కల్యాణ్ పాత్రను హంగ్రీ చీతా (ఆకలితో ఉన్న పులి) అంటూ మూవీ టీమ్ పోస్టర్లలో పేర్కొంది. ఇప్పుడు ఇమ్రాన్ హష్మి లుక్‍తో అతడి క్యారెక్టర్ ‘క్రూరమైన హైనా’లా ఉంటుందనే హిట్‍ను ఇచ్చింది. దీంతో ఈ చిత్రంపై హైప్ మరింత పెరిగిపోయింది.
పవన్ పాత్ర పేరు ఇదేనా..!
ఓజీ సినిమాలో తన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను ఇమ్రాన్ హష్మి కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. “గంభీరా.. నువ్వు తిరిగి బాంబే వస్తున్నావని విన్నా! ప్రామిస్ ఇద్దరిలో ఒక్క తలే మిగులుతుంది” అని ఆయన ట్వీట్ చేశారు. దీంతో ఓజీ చిత్రంలో పవన్ క్యారెక్టర్ పేరు గంభీర అనే అంచనాలు వెలువడుతున్నాయి. మరి.. ఆ చిత్రంలో పవన్ పాత్ర పేరు అదేనా.. లేకపోతే విలన్ అలా పిలుస్తాడా అనేది చూడాలి.
ఓజీ సినిమాలో పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‍గా నటిస్తున్నారు. అర్జున్ దాస్, శ్రీయారెడ్డి, హరీశ్ ఉత్తమన్, అభిమన్యు సింగ్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నారు.
ఓజీ సినిమాను సెప్టెంబర్ 27వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీమ్ ప్రకటించింది. ప్రస్తుతం పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో సార్వత్రిక ఎన్నికల తర్వాత మిగిలిన షూటింగ్‍ను కంప్లీట్ చేయనున్నారు. దీంతో ప్రకటించిన డేట్‍కు ఈ చిత్రాన్ని రిలీజ్ చేస్తామని మూవీ టీమ్ కన్ఫిడెంట్‍గా ఉంది. డీవీవీ ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.