తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Eagle Ott Release Date: ఈగల్ వచ్చేది ఈ ఓటీటీలోకే.. ఎప్పుడు రాబోతోందంటే?

Eagle OTT Release Date: ఈగల్ వచ్చేది ఈ ఓటీటీలోకే.. ఎప్పుడు రాబోతోందంటే?

Hari Prasad S HT Telugu

23 February 2024, 18:37 IST

google News
    • Eagle OTT Release Date: రవితేజ నటించిన ఈగల్ మూవీ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఏదో తేలిపోయింది. ఈ సినిమా డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది.
ఈగల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. త్వరలోనే రానున్న మూవీ
ఈగల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. త్వరలోనే రానున్న మూవీ

ఈగల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. త్వరలోనే రానున్న మూవీ

Eagle OTT Release Date: మాస్ మహారాజా రవితేజ నటించిన మూవీ ఈగల్. మొదట సంక్రాంతికే రావాల్సిన ఈ సినిమా.. తర్వాత వాయిదా పడి ఫిబ్రవరి 9న సోలో రిలీజ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో ఈ సినిమా సక్సెస్ సాధించలేదు. తాజాగా ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ ఈటీవీ విన్ భారీ మొత్తానికి సొంతం చేసుకుంది.

ఈగల్.. ఓటీటీలోకి వచ్చేది అప్పుడే..

రవితేజ నటించిన ఈగల్ మూవీని కార్తీక్ ఘట్టమనేని డైరెక్ట్ చేశాడు. టైగర్ నాగేశ్వర్ రావు డిజాస్టర్ తర్వాత రవితేజ నటించిన మూవీ ఇది. ఈ సినిమాలో తన వరకూ అతడు బాగానే చేసినా.. మొత్తంగా మూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. కావ్యా థాపర్ ఫిమేల్ లీడ్ గా నటించిన ఈగల్ మూవీ ఓటీటీ హక్కులను ఈటీవీ విన్ సొంతం చేసుకోగా.. మార్చి రెండో వారం నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

యాక్షన్ డ్రామా అయిన ఈగల్ మూవీలో రవితేజ నటన అందరినీ ఆకట్టుకుంది. తొలి రోజే మిక్స్‌డ్ టాక్ వచ్చినా ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా రూ.50 కోట్లకుపైనే వసూలు చేసింది. ఈ మూవీని సోలో రిలీజ్ చేయడానికి టిల్లూ స్క్వేర్ ను వచ్చే నెలకు, ఊరు పేరు భైరవకోన మూవీని వారం రోజులు వాయిదా వేశారు. ఈగల్ సమయంలో వచ్చిన యాత్ర 2, లాల్ సలామ్ డిజాస్టర్ కావడం కూడా రవితేజ మూవీ కలెక్షన్లు పెరగడానికి ఓ కారణంగా చెప్పొచ్చు.

ఈగల్ మూవీ ఎలా ఉందంటే?

ఈగ‌ల్ స్టైలిష్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీ. గ్యాంగ్‌స్ట‌ర్ మూవీకి చిన్న‌పాటి సోష‌ల్ మేసేజ్‌ను జోడించి డైరెక్ట‌ర్ కార్తిక్ ఘ‌ట్ట‌మ‌నేని ఈ మూవీని తెర‌కెక్కించాడు. ర‌వితేజ‌కు మాస్‌లో ఉన్న ఇమేజ్‌ను దృష్టిలో పెట్టుకొని హీరోయిజం, ఎలివేష‌న్స్‌తో ద‌ర్శ‌కుడు గ‌ట్టెక్కాల‌ని అనుకున్నారు. అందుకు త‌గ్గ‌ట్లే ఫ‌స్ట్ హాఫ్ మొత్తం సాగుతుంది.

స‌హ‌దేవ వ‌ర్మ పేరు చెప్ప‌గానే సీబీఐ, ఆర్మీలాంటి సంస్థలు కూడా గ‌డ‌గ‌డ వ‌ణికిపోవ‌డం లాంటి సీన్స్‌తో ర‌వితేజ క్యారెక్ట‌ర్‌పై భీభ‌త్స‌మైన హైప్‌ను క్రియేట్ చేశాడు డైరెక్ట‌ర్‌. అస‌లు స‌హ‌దేవ వ‌ర్మ ఎవ‌రు అనే క్యూరియాసిటీని ఆడియెన్స్‌లో క‌లిగిస్తూ క‌థ‌ను ముందుకు తీసుకెళ్లాడు. న‌ళీనీరావు పాత్ర ద్వారా హీరో క్యారెక్ట‌ర్‌లోని ఒక్కో కోణాన్ని రివీల్ చేయ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తుంది.

చేనేత రైతుల‌కు సాయం, అక్ర‌మ ఆయుధాల వ్యాపారం రెండు కంప్లీట్‌గా భిన్న‌మైన నేప‌థ్యాలు. వాటిని లింక్ చేస్తూ ఈగ‌ల్ క‌థ‌ను అల్లుకున్నారు డైరెక్ట‌ర్‌. హీరో పాత్ర‌, అత‌డి ఫ్లాష్‌బ్యాక్‌కు సంబంధించి అనేక ప్ర‌శ్న‌ల‌తోఫ‌స్ట్ హాఫ్‌ను ఎండ్ చేశాడు డైరెక్ట‌ర్‌.

స‌హ‌దేవ వ‌ర్మ‌గా ర‌వితేజ స్టైలిష్‌గా క‌నిపించాడు. ర‌వితేజ ఎలివేష‌న్స్‌, యాక్ష‌న్ సీన్స్‌లో అత‌డి ఎన‌ర్జీ మెప్పిస్తుంది. డైలాగ్ డెలివ‌రీ కొత్త‌గా ఉంది. న‌ళినీరావు అనే జ‌ర్న‌లిస్ట్‌గా అనుప‌మ యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పాత్ర చేసింది. ర‌చ‌న‌గా కావ్య థాప‌ర్ సినిమాలో క‌నిపించేది త‌క్కువ టైమే. ర‌వితేజ‌తో ఆమె కెమిస్ట్రీ బాగుంది. ర‌వితేజ అసిస్టెంట్‌గా న‌వ‌దీప్‌తోపాటు మ‌ధుబాల, శ్రీనివాస అవ‌స‌రాల ప్ర‌తి ఒక్క పాత్ర‌ను ఇంట్రెస్టింగ్‌గా డైరెక్ట‌ర్ రాసుకున్నాడు.

తదుపరి వ్యాసం