తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lucky Baskhar: లక్కీ భాస్కర్ నుంచి రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్.. శ్రీమతి గారు అంటూ బుట్టలో వేసిన దుల్కర్ సల్మాన్

Lucky Baskhar: లక్కీ భాస్కర్ నుంచి రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్.. శ్రీమతి గారు అంటూ బుట్టలో వేసిన దుల్కర్ సల్మాన్

Galeti Rajendra HT Telugu

16 November 2024, 18:02 IST

google News
  • Srimathi Garu Video Song From Dulquer Salmaan: లక్కీ భాస్కర్ మూవీ ఇటీవల దీపావళి రోజున విడుదలై రూ.100 కోట్లకిపైగా వసూళ్లని రాబట్టింది. త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్న ఈ సినిమా నుంచి రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజైంది. 

మీనాక్షి చౌదరి, దుల్కర్ సల్మాన్
మీనాక్షి చౌదరి, దుల్కర్ సల్మాన్

మీనాక్షి చౌదరి, దుల్కర్ సల్మాన్

లక్కీ భాస్కర్ మూవీ నుంచి రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజైంది. దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి జంటగా నటించిన ఈ సినిమా దీపావళి రోజున విడుదలై.. మంచి వసూళ్లని రాబట్టిన విషయం తెలిసిందే. దాదాపు రెండు వారాలు సక్సెస్‌ఫుల్‌గా థియేటర్లలో సందడి చేసిన లక్కీ భాస్కర్.. రెండు రోజుల క్రితం కంగువా రిలీజ్‌తో జోరు తగ్గింది.

హిట్ సాంగ్ ఫస్ట్ రిలీజ్

లక్కీ భాస్కర్ మూవీలో దుల్కర్ సల్మాన్ సాధారణ బ్యాంక్ ఉద్యోగిగా నటించి ప్రేక్షకుల్ని మెప్పించగా.. హౌస్ వైఫ్‌గా మీనాక్షి చౌదరి నటించంది. ఇందులో ప్రమోషన్ కోసం నిరీక్షిస్తూ కుటుంబం భారాన్ని నెట్టుకొచ్చే భర్త కోపం, అసహనాన్ని అర్థం చేసుకునే భార్యగా మీనాక్షి చౌదరి నటనకి మంచి మార్కులుపడ్డాయి. అయితే.. మీనాక్షి చౌదరి కోపాన్ని తగ్గించడానికి డైరెక్టర్ వెంకీ అట్లూరి ‘‘శ్రీమతి గారు’’ అంటూ ఒక సాంగ్‌ని రాయించారు.

‘‘శ్రీమతి గారు’’ సాంగ్‌లో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరి కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది. మూవీలోనే బెస్ట్ సాంగ్‌గా చాలా మంది నెటిజన్లు అభివర్ణించారు. దాంతో సినిమా నుంచి ఈ సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుదల చేసింది.

గట్టి పోటీ.. అయినా రూ.100 కోట్లు

లక్కీ భాస్కర్ మూవీ ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకి పైగానే వసూళ్లని రాబట్టింది. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమా ఇదే కావడం గమనార్హం. అమరన్, క సినిమాలు కూడా లక్కీ భాస్కర్ విడుదలైన రోజే (అక్టోబరు 31) రిలీజై.. హిట్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. దాంతో.. తొలి వారంతో క, అమరన్‌తో పోటీపడిన లక్కీ భాస్కర్.. రెండో వారంలో అమరన్‌తో మాత్రమే పోటీపడుతూ మంచి వసూళ్లనే రాబట్టింది.

ఓటీటీలోనూ ఈ నెల చివర్లో లేదా డిసెంబరు మొదటి వారంలో లక్కీ భాస్కర్ స్ట్రీమింగ్‌కి వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ భారీ ధరకి ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని సొంతం చేసుకుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం