Lucky Baskhar OTT: ఓటీటీలోకి లక్కీ భాస్కర్ స్ట్రీమింగ్‌ తేదీపై క్లారిటీ, ఎట్టకేలకి నెరవేరిన దుల్కర్ సల్మాన్ కల!-dulquer salmaan first ever rs 100 crore grosser with lucky baskhar ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Lucky Baskhar Ott: ఓటీటీలోకి లక్కీ భాస్కర్ స్ట్రీమింగ్‌ తేదీపై క్లారిటీ, ఎట్టకేలకి నెరవేరిన దుల్కర్ సల్మాన్ కల!

Lucky Baskhar OTT: ఓటీటీలోకి లక్కీ భాస్కర్ స్ట్రీమింగ్‌ తేదీపై క్లారిటీ, ఎట్టకేలకి నెరవేరిన దుల్కర్ సల్మాన్ కల!

Galeti Rajendra HT Telugu
Nov 14, 2024 08:30 PM IST

Lucky Bhaskar collection: లక్కీ భాస్కర్‌తో ఎట్టకేలకి దుల్కర్ సల్మాన్ సుదీర్ఘ కల నెరవేరింది. సౌత్‌లో మంచి క్రేజ్ ఉన్నప్పటికీ.. తనని ఊరిస్తూ వస్తున్న క్లబ్‌లోకి దుల్కర్ సల్మాన్ చేరిపోయాడు.

దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్

మలయాళ సూపర్ స్టార్ దుల్కర్ సల్మాన్ ఎట్టకేలకి తన కలని నెరవేర్చుకున్నారు. అతను హీరోగా నటించిన లక్కీ భాస్కర్ మూవీ అక్టోబరు 31న దీపావళి కానుకగా విడుదలైంది.

మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌ను ఆకట్టుకున్న ఈ సినిమా.. పాజిటివ్ మౌత్ టాక్‌తో నిన్నటి వరకూ థియేటర్లలో సందడి చేసింది. మధ్యతరగతి బ్యాంక్ ఉద్యోగిగా దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో నటించగా.. మీనాక్షి చౌదరి గృహిణిగా కనిపించింది.

ఫస్ట్ టైమ్ రూ.100 కోట్ల క్లబ్‌లోకి దుల్కర్

సౌత్‌లో క్రేజ్ ఉన్నప్పటికీ.. దుల్కర్ సల్మాన్ సినిమాలు ఇప్పటి వరకూ ఒక్కటి కూడా రూ.100 కోట్ల వసూళ్లని రాబట్టేకపోయాయి. కానీ.. లక్కీ భాస్కర్ మూవీ తాజాగా ఆ రూ.100 కోట్ల క్లబ్‌లో చేరింది. ఈ మేరకు ఒక వీడియో ద్వారా సోషల్ మీడియాలో దుల్కర్ సల్మాన్ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు.

దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో ఇప్పటి వరకూ సీతారామం సినిమా పెద్ద హిట్‌గా ఉంది. ఆ సినిమా అప్పట్లో రూ.91 కోట్ల వరకూ వసూళ్లని రాబట్టింది. తాజాగా ఆ రికార్డ్‌ను లక్కీ భాస్కర్ బ్రేక్ చేసి రూ.100 కోట్లకి పైగా వసూళ్లని రాబట్టింది.

రిలీజ్‌కి ముందే చెప్పిన దుల్కర్

వాస్తవానికి లక్కీ భాస్కర్ మూవీ రిలీజ్‌కి ముందు దుల్కర్ సల్మాన్ ఈ రూ.100 కోట్ల క్లబ్‌ గురించి మాట్లాడుతూ.. కనీసం ఈ సినిమాతోనైనా ఆ మైలురాయిని దాటాలని ఆశిస్తున్నట్లు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు. దాంతో మొత్తానికి ఇప్పుడు అతని కల నెరవేరింది.

గట్టి పోటీ ఎదురైనా

లక్కీ భాస్కర్ సినిమా రిలీజ్ రోజునే అమరన్, క సినిమాలు కూడా రిలీజ్ అయ్యాయి. ఇందులో అమరన్ ఇప్పటికే రూ.200 కోట్లని దాటిపోగా.. క సినిమా వసూళ్లలో మధ్యలోనే ఆగిపోయింది. గురువారం (నవంబరు 14) సూర్య నటించిన కంగువా సినిమా రిలీజైంది. దాంతో లక్కీ భాస్కర్, అమరన్ సినిమాలకి థియేటర్లు గణనీయంగా తగ్గాయి.

థియేటర్లలో షోలు తగ్గడంతో ఓటీటీలోకి వేగంగానే లక్కీ భాస్కర్ వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. నెట్‌ఫ్లిక్స్ ఇప్పటికే లక్కీ భాస్కర్ ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేయగా.. ఇప్పటి వరకూ వెలువడిన వార్తల ప్రకారం నవంబర్ 29 నుంచి లక్కీ భాస్కర్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

మిడిల్ క్లాస్ పల్స్ పట్టుకున్న డైరెక్టర్

లక్కీ భాస్కర్ సినిమాలో దుల్కర్ సల్మాన్, మీనాక్షి చౌదరితో పాటు హైపర్‌ ఆది, సూర్య శ్రీనివాస్‌, రాంకీ, మానస చౌదరి నటించారు. ఈ సినిమాకి జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం అందించగా.. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించారు.

బ్యాంకింగ్ వ్యవస్థలోని లోపాల్ని ఎత్తిచూపుతూ.. స్టాక్‌ మార్కెట్‌లో మిడిల్ క్లాస్ మైండ్ సెట్‌ను మేళవిస్తూ లక్కీ భాస్కర్‌ సినిమాను దర్శకుడు వెంకీ అట్లూరి ఆసక్తికరంగా చిత్రీకరించారు.

Whats_app_banner