తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Lucky Bhaskar: ఓటీటీలోకి లక్కీ భాస్కర్ మరింత ఆలస్యం.. ఇంట్రస్టింగ్ రీజన్

OTT Lucky Bhaskar: ఓటీటీలోకి లక్కీ భాస్కర్ మరింత ఆలస్యం.. ఇంట్రస్టింగ్ రీజన్

Galeti Rajendra HT Telugu

17 November 2024, 21:38 IST

google News
  • Lucky Bhaskar OTT Release: కంగువా, మట్కా సినిమాలు రిలీజ్‌తో లక్కీ భాస్కర్ సినిమా థియేటర్లలో కనుమరుగు అవుతుందని అంతా ఊహించారు. కానీ.. మూడు రోజుల వ్యవధిలోనే అంతా రివర్స్ అయ్యింది. 

ఓటీటీలోకి ఆలస్యంగా లక్కీ భాస్కర్
ఓటీటీలోకి ఆలస్యంగా లక్కీ భాస్కర్

ఓటీటీలోకి ఆలస్యంగా లక్కీ భాస్కర్

దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన లక్కీ భాస్కర్ మూవీ ఓటీటీలోకి ఆలస్యంగా వచ్చే సంకేతాలు కనిపిస్తున్నాయి. దీపావళి కానుకగా అక్టోబరు 31న విడుదలైన ఈ సినిమా.. పాజిటివ్ మౌత్ టాక్‌తో గత రెండు వారాల నుంచి థియేటర్లలో సందడి చేస్తోంది.

రూ.100 కోట్ల క్లబ్‌లోకి

మిడిల్ క్లాస్‌ ఫ్యామిలీస్‌ను లక్ష్యంగా చేసుకుని వెంకీ అట్లూరి ఈ సినిమాని తెరకెక్కించగా.. ఫ్యామిలీ ఆడియెన్స్‌తో పాటు యూత్‌కి ఈ సినిమా నచ్చడంతో ఇప్పటికే రూ.100 కోట్ల క్లబ్‌లో ఈ సినిమా చేరిపోయింది. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో రూ.100 కోట్లు కలెక్ట్ చేసిన ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం.

వాస్తవానికి లక్కీ భాస్కర్ రిలీజ్ అయిన రోజే.. అమరన్, క సినిమాలు రిలీజ్ అయ్యాయి. అనూహ్యంగా.. మూడు సినిమాలకీ పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ మూడు సినిమాల్లో క తొలుత వెనకబడగా.. ఆ తర్వాత లక్కీ భాస్కర్‌కి కలెక్షన్లు తగ్గుతున్నట్లు కనిపించింది. అమరన్ మాత్రం తొలి 10 రోజులు మంచిగా వసూళ్లని రాబట్టి.. రూ.200 కోట్లకి పైగానే ఖాతాలో వేసుకుంది.

కంగువా, మట్కా‌.. నో ఇంపాక్ట్

సూర్య నటించిన కంగువా సినిమా, వరుణ్ తేజ్ నటించిన మట్కా గురువారం (నవంబరు 14) విడుదల అవగా.. ఈ మూడు సినిమాల కలెక్షన్లపై ఈ రెండు సినిమాల ప్రభావం పడుతుందని అంతా ఊహించారు. కానీ.. మిక్స్‌డ్ టాక్ తెచ్చుకున్న కంగువా, మట్కా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో అనూహ్యంగా లక్కీ భాస్కర్ మళ్లీ థియేటర్లలో పుంజుకుంది. ఎంతలా అంటే.. రిలీజ్ రోజు కంటే 18వ రోజైన (ఆదివారం) హవర్లి బుకింగ్స్ ఎక్కువగా నమోదవడం గమనార్హం.

ఓటీటీలోకి ఆలస్యం

లక్కీ భాస్కర్ సినిమాని నవంబరు చివరి వారంలో ఓటీటీలో స్ట్రీమింగ్‌కి ఉంచబోతున్నట్లు తొలుత వార్తలు వినిపించాయి. మంచి ఫ్యాన్సీ రేటుకి నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమా ఓటీటీ హక్కుల్ని కొనుగోలు చేసింది. కానీ.. థియేటర్లలో ఈ సినిమా మళ్లీ పుంజుకోవడంతో ఓటీటీ స్ట్రీమింగ్ ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. డిసెంబరు మొదటి లేదా రెండో వారంలో ఓటీటీకి రావొచ్చని తెలుస్తోంది.

లక్కీ భాస్కర్ మూవీలో దుల్కర్ సల్మాన్‌కి జోడీగా మీనాక్షి చౌదరి నటించగా.. హైపర్ ఆది, మానస చౌదరి, సూర్య శ్రీనివాస్ తదితరులు ఈ సినిమాలో నటించారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకి జీవీ ప్రకాశ్‌ కుమార్‌ సంగీతం అందించారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం