తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Distributors Protest On Puri Jagannadh: పూరీపై లైగర్ డిస్ట్రిబ్యూటర్ల ధర్నా.. ఏం చేసుకుంటారో చేయండన్న దర్శకుడు!

Distributors Protest on Puri Jagannadh: పూరీపై లైగర్ డిస్ట్రిబ్యూటర్ల ధర్నా.. ఏం చేసుకుంటారో చేయండన్న దర్శకుడు!

25 October 2022, 10:47 IST

google News
    • Distributors Protest on Puri Jagannadh: లైగర్ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబీటర్లు ఆ సినిమా దర్శకుడు పూరీ జగన్నాథ్‌పై ధర్నాకు ప్లాన్ చేశారట. నష్టోపోయిన సొమ్ము తిరిగి ఇవ్వాలని డిమాండ్‌తో ఈ గురువారం నాడు ఆయన ఇంటి ముందు ఆందోళన చేయనున్నట్లు సమాచారం. ఇందుకు పూరీ కూడా వారికి దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
పూరీ జగన్నాథ్‌పై లైగర్ డిస్ట్రిబ్యూటర్ల ధర్నా
పూరీ జగన్నాథ్‌పై లైగర్ డిస్ట్రిబ్యూటర్ల ధర్నా

పూరీ జగన్నాథ్‌పై లైగర్ డిస్ట్రిబ్యూటర్ల ధర్నా

Distributors Protest on Puri Jagannadh: విజయ్ దేవరకొండ హీరోగా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ సినిమా డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమా ఘోరంగా నష్టాలను చవిచూసింది. విడుదలైన ప్రతి చోటా ఫ్లాప్ టాక్ రావడంతో డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు ఘోరంగా నష్టపోయారు. ముఖ్యంగా నైజాం ఏరియాలో భారీ రేటుకు కొనుగోలు చేయడంతో ఈ లాస్ ఎక్కువగా జరిగినట్లు తెలుస్తోంది. దీంతో నైజాం ఏరియా డిస్ట్రిబీటర్లు, ఎగ్జిబీటర్లంతా కలిసి పూరీ ఇంటిపై ధర్నాకు దిగాలని అనుకుంటున్నారట. ఇందుకు పూరీ కూడా గట్టిగానే వార్నింగ్ ఇచ్చినట్లు సోషల్ మీడియాలో ఆయన ఆడియో లీక్ ఒకటి హల్చల్ చేస్తోంది. ఇదిలా ఉంటే తాజాగా ఈ సీన్‌లోకి రామ్ గోపాల్ వర్మ దిగాడు.

సోషల్ మీడియాలో ఎగ్జిబీటర్ల నుంచి విడుదలైనట్లుగా చెబుతున్న ప్రకటనను ఆర్జీవీ షేర్ చేశారు. "వరంగల్ శీను లైగర్ బాధితులంతా మొత్తం 83 మంది ఎగ్జీబీటర్ల గురువారం ఉదయం 9 గంటలకు పూరి జగన్నాథ్ గారి ఇంటికి ధర్నాకు వెళ్తున్నాం. కావున ప్రతి ఒక ఎగ్జిబిటర్ మినిమం నాలుగు రోజులు ఉండటానికి బట్టలు తీసుకుని రావాలి. ఇలా అందరూ మాకెంతులే అని రాకపోతే ఈ బాధితుల లిస్టులో నుంచి మీ పేరును తొలగించి రావాల్సిన డబ్బును కూడా క్యాన్సిల్ చేయబడును. దీన్ని హెచ్చరికగా భావించకుండా తప్పనిసరిగా రాగలరు. ఎవరు ఆ రోజు రాకపోయినా మీకు మేము ఫోన్ చేయము. ఇన్ఫార్మేషన్ ఇవ్వము అందరూ బాధితులమే కాబట్టి అందరూ బాధ్యతగా వస్తేనే బాగుంటుంది. రాకపోతే మీ ఇష్టం అందరూ ఉదయం వేణు గోపాల్ రెడ్డి ఆఫీస్‌కు రావాలి. అక్కడి నుంచి పూరి జగన్నాథ్ ఇంటికి వెళ్లాలి. మళ్లీ మళ్లీ చెబుతున్నాం. దయచేసి మీరందరూ రావాలి. మీరు పైసలు వద్ద అనుకున్నవాళ్లు మాత్రం రాకండి దయచేసి" అంటూ ప్రకటనను షేర్ చేశారు ఆర్జీవీ.

ఈ ప్రకటనకు పూరి రిప్లయి ఇచ్చినట్లుగా ఉన్న మరో ప్రకటనను కూడా ఆర్జీవీ షేర్ చేశారు. "ఏంటి బ్లాక్ మెయిల్ చేస్తున్నారా? నేను ఎవరికి డబ్బు తిరిగి ఇవ్వాల్సిన అవసరం లేదు. అయినా ఇస్తున్నాను. ఎందుకు? పాపం వాళ్లు కూడా నష్ట పోయారులే అని. ఆల్రెడీ బయర్స్‌తో మాట్లాడటం జరిగింది. ఓ నెలలో అగ్రీ అయిన అమౌంట్ ఇస్తా అని చెప్పాను. ఇస్తాను అని చెప్పాక కూడా అతి చెస్తే ఇచ్చేది కూడా ఇవ్వబుద్ధి కాదు. ఎందుకు ఇస్తున్నాం? పరువు కోసం ఇస్తున్నాం. నా పరువు తీయాలి అని చూస్తే మాత్రం ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఇక్కడ అందంర గ్యాంబ్లింగ్ చేస్తున్నాం. కొన్ని ఆడతాయి. కొన్ని పోతాయి. పోకిరి దగ్గర నుంచి ఇస్మార్ట్ శంకర్ వరకు బయ్యర్స్ దగ్గర నుంచి నాకు రావాల్సిన డబ్బు ఎంతో ఉంది. బయ్యర్స్ అసొసోయేషన్ నాకు ఆ అమౌంట్ వసూలు చేసి పెడతారా? ధర్నా చేస్తాం అంటున్నారు. చెయ్యండి. ధర్నా చేసిన వాళ్ల లిస్ట్ తీసుకొని, వాళ్లకు తప్పా మిగతావాళ్లకు ఇస్తా." అంటూ ఈ ప్రకటనలో ఉంది.

మొత్తానికి లైగర్ తెచ్చిన కష్టాలు.. పూరీ మెడకు ఇంకా చుట్టుకునేలా ఉన్నాయి. ఎగ్జిబిటర్లు ధర్నా చేస్తామనడం చూస్తుంటే ఈ వివాదం ఇప్పుడప్పుడే తగ్గుముఖం పట్టేలా లేదు. ప్రస్తుతం తెలుగు చిత్రసీమలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది. నెటిజన్లు కూడా ఈ అంశంపై విశేషంగా స్పందిస్తున్నారు. ఈ ఏడాది వచ్చిన సినిమాల్లో బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచిన వాటిల్లో లైగర్ ముందు వరుసలో ఉంది. సినిమాపై ఉన్న భారీ అంచనాలు కారణంగా.. ఈ స్థాయిలో నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం