Liger is Streaming on Disney+Hotstar: విజయ్ దేవరకొండ హీరోగా పూరిజగన్నాథ్ దర్శకత్వలో ఎన్నో అంచనాల నడుమ విడుదలైన లైగర్ సినిమా పెద్దగా ఆకట్టుకోని విషయం తెలిసిందే. ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు డిజాస్టర్ టాక్ రావడంతో ఎప్పుడెప్పుడు ఓటీటీలోకి వస్తుందాని అభిమానులు ఎదురుచూశారు. దీంతో మేకర్స్ కూడా ఈ సినిమాను ముందు ప్లాన్ చేసిన సమయం కంటే నాలుగు వారాలు ముందుగానే ఓటీటీలో విడుదల చేయాలని నిర్ణయించింది. అనుకున్నట్లుగానే ఈ సినిమా ఓటీటీలో విడుదలైంది.
సెప్టంబరు 22(గురువారం) నుంచి ఈ చిత్రం డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో లైగర్(Liger OTT Release)ను ఈ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. రెండు రోజులుగా ఈ విషయంపై సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నా.. చిత్రబృందం ఎలాంటి ధ్రువీకరణ ఇవ్వలేదు. అధికారికంగా ప్రకటించడం కానీ, ప్రమోషన్స్ కానీ లేకుండా సైలెంట్‌గా ఓటీటీలో విడుదల చేసింది. చిన్న ట్వీట్‌తో సెడన్‌గా స్ట్రీమింగ్‌కు తీసుకొచ్చి అభిమానులకు సర్‌ప్రైజ్ ఇచ్చింది.
ఈ సినిమా వల్ల నష్టాలను ఎదుర్కొన్న డిస్ట్రిబ్యూటర్లకు తిరిగి చెల్లించేందుకు పూరి జగన్నాథ్ సంప్రదింపులు జరుపుతున్నారు. ఇలాంటి సమయంలో హాట్ స్టార్‌తో ఒప్పందం కుదుర్చుకుని ఇలా ముందుగానే ఓటీటీలోకి విడుదల చేయడం వల్ల మేకర్స్‌కు కాస్త ఉపశమనాన్ని కలిగించిందట.
విజయ్ దేవరకొండ నటించిన లైగర్ చిత్రం ఆగస్టు 25న విడుదలై ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించారు. ఆయనతో పాటు కరణ్ జోహార్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ఇది విజయ్‌కు హిందీలో తొలి చిత్రం. రమ్య కృష్ణ ఇందులో రౌడీ హీరోకు తల్లి పాత్రలో కనిపించింది. అనన్యా పాండే హీరోయిన్ కాగా.. రోనిత్ రాయ్ విజయ్‌కు కోచ్ పాత్రలో కనిపించారు. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లోనూ ఈ సినిమా ఏకకాలంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
సంబంధిత కథనం