తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Surender Reddy Injured: డైరెక్టర్ సురేందర్ రెడ్డికి గాయం.. ఏమైందంటే?

Surender Reddy Injured: డైరెక్టర్ సురేందర్ రెడ్డికి గాయం.. ఏమైందంటే?

07 January 2023, 22:42 IST

    • Surender Reddy Injured: టాలీవుడ్ దర్శకుడు సురేందర్ రెడ్డికి గాయమైంది. అఖిల్ అక్కినేనితో అతడు ఏజెంట్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా చిత్రీకరణలో అతడు గాయపడ్డాడు.
డైరెక్టర్ సురేందర్ రెడ్డికి గాయం
డైరెక్టర్ సురేందర్ రెడ్డికి గాయం

డైరెక్టర్ సురేందర్ రెడ్డికి గాయం

Surender Reddy Injured: టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సురేందర్ రెడ్డి ప్రస్తుతం ఏజెంట్ చిత్రంతో బిజీగా ఉంటున్న సంగతి తెలిసిందే. అక్కినేని అఖిల్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. తాజాగా దర్శకుడు సురేందర్ రెడ్డి ఈ సినిమా సెట్‌లో గాయపడ్డారు. ఈ మూవీ చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా సురేందర్ రెడ్డి కాలికి గాయమైంది. దీంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించి.

ట్రెండింగ్ వార్తలు

Malayalam Movie: వామ్మో ఇదేం టైటిల్‌ -ఈ కొత్త మ‌ల‌యాళం మూవీ పేరు చెప్ప‌డానికి నోరు తిర‌గ‌డం క‌ష్ట‌మే!

NNS May 17th Episode: మళ్లీ భూలోకానికి అరుంధతి.. ఈసారి యముడు కూడా.. అమర్​కి తలంటిన భాగీ.. పిల్లలను రెచ్చగొట్టిన మనోహరి

Brahmamudi May 17th Episode: బ్రహ్మముడి- అనామికకు కల్యాణ్ విడాకులు- లేచిపోదామన్న అప్పు- తాతయ్య వార్నింగ్- కావ్యకు 2 డేస్

Ntr Prashanth Neel Movie: ఎన్టీఆర్‌, ప్ర‌శాంత్ నీల్ మూవీ టైటిల్ ఇదేనా? - కేజీఎఫ్‌కు మించి యాక్ష‌న్‌…ఎలివేష‌న్స్?

ఏజెంట్ చిత్రీకరణ సమయంలో ఓ ఇనుప చువ్వ బలంగా సురేందర్ రెడ్డి కాలికి తగలడంతో ఆయనకు గాయమైనట్లు చిత్రవర్గాలు తెలిపాయి. వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. కాలుకు కట్టుకట్టిన వైద్యులు కొంతకాలం విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. అయితే ఏజెంట్ షూటింగ్‌ను వీలైనంత త్వరగా పూర్తి చేయాలనే దృఢ నిశ్చయంతో ఉన్న సురేందర్ రెడ్డి కాలికి కట్టుతోనే పనిచేస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్స్‌కు సంబంధించిన పనులను పర్యవేక్షిస్తున్నారు.

ఈ సినిమా ఇప్పటికే ఆలస్యం కాగా.. వీలైనంత త్వరగా పూర్తి చేయాలని టీమ్ భావిస్తోంది. ఈ ఏడాది వేసవికి సినిమాను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించిన తరుణంలో చిత్రీకరణ పనులు వేగవంతం చేశారు. దాదాపు సినిమా షూటింగ్ పూర్తవడంతో పోస్ట్ ప్రొడక్షన్స్ పనులు చూస్తున్నారు.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ధ్రువ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన హిప్ హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సైరా లాంటి హిస్టారికల్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ వేసవికి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం