Agent Movie Update: అఖిల్ ఏజెంట్ మూవీ అప్డేట్.. అదిరిపోయిన మేకింగ్ వీడియో.. విడుదలయ్యేది అప్పుడే-akhil agent movie will release on summer 2023 here the making video
Telugu News  /  Entertainment  /  Akhil Agent Movie Will Release On Summer 2023 Here The Making Video
అఖిల్ ఏజెంట్ మేకింగ్ వీడియో రిలీజ్
అఖిల్ ఏజెంట్ మేకింగ్ వీడియో రిలీజ్

Agent Movie Update: అఖిల్ ఏజెంట్ మూవీ అప్డేట్.. అదిరిపోయిన మేకింగ్ వీడియో.. విడుదలయ్యేది అప్పుడే

01 January 2023, 15:00 ISTMaragani Govardhan
01 January 2023, 15:00 IST

Agent Movie Update: అఖిల్ నటిస్తోన్న ఏజెంట్ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మేకింగ్ వీడియోను విడుదల చేసింది. అంతేకాకుండా ఈ సినిమా విడుదలకు ముహూర్తం ఫిక్స్ చేసింది చిత్రబృందం. వేసవి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

Agent Movie Update: అక్కినేని హీరో అఖిల్ అక్కినేని చిత్రసీమలోకి అడుగుపెట్టి 9 ఏళ్లు కావస్తున్నా.. అతడికి సరైన మాసివ్ హిట్ పడలేదనే చెప్పాలి. 2021లో పూజా హెగ్డేతో నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకున్నప్పటికీ.. అతడి స్టారడమ్‌ను పెంచే విజయం కాదనే చెప్పాలి. దీంతో తన తదుపరి సినిమాతో మాసివ్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు అఖిల్. సురేందర రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఏజెంట్ సినిమాతో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటున్నాడు ఈ యువ హీరో. ఇందులో మమ్మట్టి కీలక పాత్ర పోషించారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన అదిరిపోయే అప్డేట్ ఇచ్చింది చిత్రబృందం. ఏజెంట్ మేకింగ్ వీడియోను విడుదల చేసింది.

ఈ మేకింగ్ వీడియోను గమనిస్తే హై ఓల్టేజ్ యాక్షన్ సీన్ల కోసం ఏ విధంగా కష్టపడ్డారనేది ఇందులో చూపించారు. అంతేకాకుండా అఖిల్ స్టంట్లు అబ్బురపరుస్తాయి. ఈ సినిమా కోసం భారీ కసరత్తులే చేసినట్లు తెలుస్తోంది. ఇందులో అఖిల్ లుక్ అల్ట్రా స్ట్రైలిష్‌గా ఉండటమే కాకుండా.. అటు మాస్ ప్రేక్షకులు కూడా మెచ్చేలా ఉంది. యాక్షన్ థ్రిల్లర్ పవర్ ప్యాక్‌గా ఈ సినిమా రాబోతంది. సంక్రాంతికే విడుదల కావాల్సి ఉండగా.. షూటింగ్ ఆలస్యం కావడంతో వేసవికి వాయిదా పడిందీ చిత్రం.

ఇప్పటికే విడుదలైన ఏజెంట్ టీజర్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంది. ముఖ్యంగా అఖిల్ యాక్షన్ సన్నివేశాలు, స్టైలిష్‌కు కుర్రకారు ఫిదా అవుతున్నారు. తన గత చిత్రంతో పోలిస్తే లుక్‌ను పూర్తిగా మార్చివేశాడు అఖిల్. ఏజెంట్ సినిమాలో స్టంట్లు చూస్తుంటే హాలీవుడ్ చిత్రాలను తలపిస్తుంది. ఇందులో అఖిల్ స్పైగా నటించనున్నాడు. ఈ స్పై థ్రిల్లర్‌లో మమ్ముట్టీ కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఏకే ఎంటర్‌టైన్మెంట్స్ పతాకంపై అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వక్కంతం వంశీ కథను అందిస్తున్నారు. సాక్షి వైద్య ఈ చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తోంది. ధ్రువ సినిమాకు అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చిన హిప్ హాప్ తమిళన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూరుస్తున్నారు. సైరా లాంటి హిస్టారికల్ హిట్ తర్వాత సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులకు కూడా భారీగా అంచనాలు ఉన్నాయి. ఈ వేసవికి ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం.

సంబంధిత కథనం

టాపిక్