Akhil Akkineni: అఖిల్ ఏజెంట్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్...-akhil akkineni agent movie teaser release date announced ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Akhil Akkineni Agent Movie Teaser Release Date Announced

Akhil Akkineni: అఖిల్ ఏజెంట్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్...

HT Telugu Desk HT Telugu
Jul 10, 2022 05:17 PM IST

అవుట్ అండ్ అవుట్ యాక్ష‌న్ క‌థాంశంతో అఖిల్ (akhil akkineni)అక్కినేని చేస్తున్న చిత్రం ఏజెంట్‌(agent movie). సురేంద‌ర్‌రెడ్డి ఈ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఏజెంట్ టీజ‌ర్ రిలీజ్ డేట్‌ను ఆదివారం వెల్ల‌డించారు. టీజ‌ర్ ఎప్పుడు రిలీజ్ కానుందంటే...

అఖిల్ అక్కినేని
అఖిల్ అక్కినేని (twitter)

ఘ‌న‌మైన ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్‌, స్టార్ డైరెక్ట‌ర్స్ తో సినిమాలు చేసినా క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్ మాత్రం అఖిల్ కు ఇప్పటివరకు దక్కలేదు. హ్యాట్రిక్ ఫ్లాప్ ల త‌ర్వాత మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌ల‌ర్ (most eligible bachelor) ఊర‌డింపును ఇచ్చింది. అయితే హిట్ అనే మాట మాత్రం అనిపించుకోలేక‌పోయింది. ప్ర‌స్తుతం ఏజెంట్ సినిమాపైనే అఖిల్ బోలెడు ఆశ‌లు పెట్టుకున్నాడు. స్పై థ్రిల్ల‌ర్ క‌థాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి సురేంద‌ర్‌రెడ్డి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమా టీజ‌ర్ డేట్ ను ఆదివారం వెల్ల‌డించారు.

జూలై 15న టీజర్ ను రిలీజ్ చేయబోతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. ఈ సినిమాలో ఎయిట్ ప్యాక్ లుక్ లో అఖిల్ క‌నిపించ‌బోతున్నాడు. పూర్తిగా ఈ క్యారెక్ట‌ర్ కోసం త‌న‌ను తాను కొత్త‌గా మేకోవ‌ర్ చేసుకొని న‌టిస్తున్నాడు. ఏజెంట్ సినిమాలో మ‌ల‌యాళ అగ్ర న‌టుడు మ‌మ్ముట్టి కీల‌క పాత్ర‌ను పోషిస్తున్నాడు. అత‌డి క్యారెక్ట‌ర్ స‌ర్‌ప్రైజింగ్ గా సాగుతుంద‌ని స‌మాచారం. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ తుదిద‌శ‌కు చేరుకున్న‌ది.

ఆగస్ట్ లో ఈ సినిమా రిలీజ్ కానున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు. ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉన్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏజెంట్ తో సాక్షివైద్య టాలీవుడ్‌లో తొలి అడుగు వేయ‌బోతున్నది. గ‌తంలో ఆమె ప‌లు యాడ్స్ లో న‌టించింది. ధృవ ఫేమ్ హిప్ హాప్ తామిజా ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నాడు. ఏకే ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ తో క‌లిసి ద‌ర్శ‌కుడు సురేంద‌ర్‌రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నాడు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్