తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhanush Vetrimaran Movie: కేజీఎఫ్ బ్యాక్‌డ్రాప్‌లో ధనుష్, వెట్రిమారన్ మూవీ

Dhanush Vetrimaran movie: కేజీఎఫ్ బ్యాక్‌డ్రాప్‌లో ధనుష్, వెట్రిమారన్ మూవీ

Hari Prasad S HT Telugu

02 May 2023, 22:17 IST

    • Dhanush Vetrimaran movie: కేజీఎఫ్ బ్యాక్‌డ్రాప్‌లో ధనుష్, వెట్రిమారన్ మూవీ రాబోతోంది. ఇది నిజంగా అభిమానులకు పండగలాంటి వార్తే. ఈ ఇద్దరి కాంబినేషన్ మ్యాజిక్ చేస్తుందని వాళ్లు నమ్ముతున్నారు.
ధనుష్, వెట్రిమారన్
ధనుష్, వెట్రిమారన్

ధనుష్, వెట్రిమారన్

Dhanush Vetrimaran movie: తమిళ సినిమాలో ధనుష్ ఓ సూపర్ స్టార్. ఇక డైరెక్టర్ వెట్రిమారన్ ఇప్పటికే పలు కల్ట్ క్లాసిక్ లను అందించాడు. అందులోనూ ధనుష్ తో కలిసి అసురన్ లాంటి సూపర్ డూపర్ హిట్ తీశాడు. ఇక ఇప్పుడు ఈ ఇద్దరూ మరోసారి చేతులు కలుపుతున్నారు. అయితే ఈసారి సూపర్ హిట్ కేజీఎఫ్ బ్యాక్‌డ్రాప్ లో వీళ్ల సినిమా ఉండనుండటం మరింత ఆసక్తి రేపుతోంది.

ట్రెండింగ్ వార్తలు

Preminchoddu: పిల్లలకు తల్లిదండ్రులు చూపించాల్సిన సినిమా.. తెలుగులో తమిళ ఫ్లేవర్‌తో ప్రేమించొద్దు

Krishnamma OTT: థియేట‌ర్ల‌లో రిలీజైన వారంలోనే ఓటీటీలోకి వ‌చ్చిన స‌త్య‌దేవ్ కృష్ణ‌మ్మ - స్ట్రీమింగ్ ఎందులో అంటే?

Blink OTT Streaming: వీకెండ్‌లో ఈ కన్నడ సై-ఫి థ్రిల్లర్ మూవీ అస్సలు మిస్ కావద్దంటున్న ఓటీటీ ప్రేక్షకులు

Flop Movies With super hit songs: పాట హిట్.. బొమ్మ ఫట్.. తెలుగులో సూపర్ హిట్ సాంగ్స్ ఉన్న ఫ్లాప్ మూవీస్ ఇవే

ఈ విషయాన్ని మూవీ ప్రొడ్యూసర్ కేఈ జ్ఞానవేల్ రాజా వెల్లడించాడు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన అతడు.. ధనుష్, వెట్రిమారన్ మరో సినిమా చేస్తున్నారని, ఇది కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ (కేజీఎఫ్) బ్యాక్‌డ్రాప్ లో ఉంటుందని చెప్పడం విశేషం.అయితే ఈ మూవీ గురించి మిగతా వివరాలేవీ అతడు చెప్పలేదు. భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందనుంది.

ఇప్పటికే కేజీఎఫ్, కేజీఎఫ్ 2 ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేశాయో మనకు తెలుసు. అలాంటి కేజీఎఫ్ నేపథ్యంలోనే ధనుష్, వెట్రిమారన్ మూవీ రానుండటం అభిమానుల్లో ఎక్కడ లేని ఆసక్తి రేపుతోంది. ఈ మధ్యే వెట్రిమారన్ విడుదలై పార్ట్ 1తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. ఈ మూవీ తెలుగులో విడుదల పేరుతో రిలీజైంది.

అటు ధనుష్ కూడా సార్ మూవీతో మంచి హిట్ అందుకున్నాడు. వెంకీ అట్లూరి డైరెక్ట్ చేసిన సార్ మూవీ ఇటు తెలుగు, అటు తమిళ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తమిళంలో వాతి పేరుతో ఈ సినిమా రిలీజైంది. వ్యాపారంగా మారిన విద్యా వ్యవస్థపై తీసిన మూవీ ఇది. ధనుష్ తనదైన రీతిలో లెక్చరర్ పాత్రలో జీవించేశాడు. ఈ సార్ మూవీ సుమారు రూ.118 కోట్లు వసూలు చేసింది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం