తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Dhanush And Aishwarya: విడాకుల తర్వాత తొలిసారి కలిసి కనిపించిన ధనుష్‌, ఐశ్వర్య

Dhanush and Aishwarya: విడాకుల తర్వాత తొలిసారి కలిసి కనిపించిన ధనుష్‌, ఐశ్వర్య

HT Telugu Desk HT Telugu

23 August 2022, 11:17 IST

google News
    • Dhanush and Aishwarya: ధనుష్‌, ఐశ్వర్య విడాకుల తర్వాత తొలిసారి కలిసి ఫొటోలకు పోజులిచ్చారు. ఇప్పుడీ ఫొటోలు సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతున్నాయి.
తమ ఇద్దరు కొడుకులతో ధనుష్, ఐశ్వర్య
తమ ఇద్దరు కొడుకులతో ధనుష్, ఐశ్వర్య

తమ ఇద్దరు కొడుకులతో ధనుష్, ఐశ్వర్య

Dhanush and Aishwarya: తమిళ సూపర్‌ స్టార్‌ ధనుష్‌, మరో సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ కూతురు ఐశ్వర్య.. ఈ ఇద్దరూ ఈ ఏడాది జనవరిలో విడిపోయిన విషయం తెలిసిందే. పెళ్లి తర్వాత 18 ఏళ్ల పాటు కలిసి ఉన్న జంట విడిపోవడం ఫ్యాన్స్‌ను తీవ్రంగా కలిచి వేసింది. అయితే తాజాగా సోషల్‌ మీడియాలో వచ్చిన ఫొటో ఒకటి వైరల్‌ అవుతోంది.

విడిపోయిన తర్వాత ధనుష్‌, ఐశ్వర్య జంట తొలిసారి కలిసి పబ్లిక్ అప్పియరెన్స్‌ ఇచ్చారు. ఈ ఇద్దరూ తమ కొడుకు యాత్ర రాజు స్కూల్‌ ఫంక్షన్‌ సందర్భంగా కలిశారు. ఈ ఫొటోను ఐశ్వర్య తన ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో షేర్‌ చేసింది. ఈ ఫొటోలో వీళ్ల చిన్న కొడుకు లింగా కూడా ఉన్నాడు. అటు ఈ జంట పీఆర్‌వో రియాజ్‌ అహ్మద్‌ కూడా ఈ ఫొటోను ట్వీట్‌ చేశాడు.

తమ కొడుకు యాత్ర స్పోర్ట్స్‌ కెప్టెన్‌ అయిన సందర్భంగా నిర్వహించిన సెర్మనీకి ఈ ఇద్దరూ హాజరైనట్లు అతడు చెప్పాడు. ఐశ్వర్య కూడా తన కొడుకు గురించి చెబుతూ.. "రోజును ఇంతకన్నా అద్భుతంగా ప్రారంభించలేము! సోమవారం ఉదయం నా పెద్ద కొడుకు స్పోర్ట్స్‌ కెప్టెన్‌గా ప్రతిజ్ఞ చేస్తున్న ఇన్వెస్టిచర్‌ సెర్మనీ చూడటం బాగుంది" అని ట్వీట్‌ చేసింది.

ఆరు నెలలు డేటింగ్‌లో ఉన్న తర్వాత 2004లో ధనుష్‌, ఐశ్వర్య పెళ్లితో ఒక్కటయ్యారు. అయితే 18 ఏళ్ల తర్వాత ఈ ఏడాది జనవరిలో వీళ్లు విడాకులతో విడిపోయారు. ఈ మధ్య హాలీవుడ్‌ డెబ్యూ మూవీ గ్రేమ్యాన్‌తోపాటు తిరు మూవీ సక్సెస్‌తో ధనుష్‌ మంచి ఊపు మీదున్నాడు. అతడు వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో వస్తున్న వారసుడు మూవీలో నటిస్తున్నాడు.

తదుపరి వ్యాసం