తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Devara Trailer Release Date: దేవర నుంచి సర్‌ప్రైజ్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే.. ఎన్టీఆర్ నయా పవర్‌ఫుల్ పోస్టర్

Devara Trailer Release Date: దేవర నుంచి సర్‌ప్రైజ్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే.. ఎన్టీఆర్ నయా పవర్‌ఫుల్ పోస్టర్

07 September 2024, 15:20 IST

google News
    • Devara Trailer Release Date: దేవర సినిమా నుంచి సాలిడ్ అప్‍డేట్ వచ్చేసింది. ఈ చిత్రం ట్రైలర్ రిలీజ్ డేట్ రివీల్ అయింది. వినాయక చవితి సందర్భంగా నేడు అప్‍డేట్‍ను మూవీ టీమ్ వెల్లడించింది. ఓ కొత్త పోస్టర్ కూడా తీసుకొచ్చింది.
Devara Trailer Release Date: దేవర నుంచి సర్‌ప్రైజ్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే.. ఎన్టీఆర్ నయా పవర్‌ఫుల్ పోస్టర్
Devara Trailer Release Date: దేవర నుంచి సర్‌ప్రైజ్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే.. ఎన్టీఆర్ నయా పవర్‌ఫుల్ పోస్టర్

Devara Trailer Release Date: దేవర నుంచి సర్‌ప్రైజ్.. ట్రైలర్ రిలీజ్ డేట్ ఇదే.. ఎన్టీఆర్ నయా పవర్‌ఫుల్ పోస్టర్

మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న దేవర సినిమా రిలీజ్ దగ్గరపడుతోంది. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ సెప్టెంబర్ 27 తేదీనే థియేటర్లలో విడుదల కానుంది. దీంతో ట్రైలర్ ఎప్పుడొస్తుందన్న నిరీక్షణ ఉంది. ఈ తరుణంలో ట్రైలర్ రిలీజ్‍పై సర్‌ప్రైజింగ్ అప్‍డేట్ వచ్చేసింది. వినాయక చవితి సందర్భంగా ట్రైలర్ డేట్‍ను నేడు మూవీ టీమ్ వెల్లడించింది.

ట్రైలర్ డేట్ ఇదే

దేవర సినిమా నుంచి ట్రైలర్ సెప్టెంబర్ 10వ తేదీన రానుంది. అంటే మరో మూడు రోజుల్లో ఈ హైవోల్టేజ్ యాక్షన్ ట్రైలర్ రిలీజ్ కానుంది. వినాయక చవితి రోజైన నేడు (సెప్టెంబర్ 7) ఈ సాలిడ్ అప్‍డేట్ వచ్చింది.

పండుగ శుభాకాంక్షలతో ఈ అప్‍డేట్‍ను దేవర మూవీ టీమ్ వెల్లడించింది. “మీ అందరికీ దేవర టీమ్.. వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తోంది. తన జోన్‍లో దేవర అడుగుపెట్టేందుకు టైమ్ ఖరారైంది. సెప్టెంబర్ 10 నుంచి దేవర ట్రైలర్‌తో సముద్రమంత సెలెబ్రేషన్స్ చేసుకునేందుకు సిద్ధంగా ఉండండి” అని ఎన్‍టీఆర్ ఆర్ట్స్ ట్వీట్ చేసింది. ఎన్టీఆర్ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అంటూ ఈ డేట్ పోస్ట్ చేశారు.

పోస్టర్ ఇలా..

దేవర ట్రైలర్ రిలీజ్ ప్రకటన కోసం మూవీ టీమ్.. ఎన్టీఆర్ నయా పోస్టర్‌ను నేడు రివీల్ చేసింది. చేతిలో పూజ చేసిన ఆయుధాన్ని పట్టుకొని.. ఎగసిపడుతున్న సముద్రం ముందు ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్‍తో నిలుచొని ఉన్నారు. ఈ పోస్టర్ పవర్‌ఫుల్‍గా ఉంది. సెప్టెంబర్ 10న వచ్చే ట్రైలర్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతో వేచిచూస్తున్నారు.

దేవర మూవీ నుంచి మూడు రోజుల కిందట ‘దావూదీ’ అంటూ వచ్చిన మూడో సాంగ్ సూపర్ పాపులర్ అయింది. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ డ్యాన్స్ స్టెప్‍లతో అదరగొట్టేశారు. ఈ ఫాస్ట్ బీట్ సాంగ్ మార్మోగుతోంది. ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నారు. ఈ మూవీ నుంచి వచ్చిన ఫియర్ సాంగ్.. ఆ తర్వాత రెండో పాట ‘చుట్టమల్లే’ చార్ట్‌బస్టర్లు అయ్యాయి. ఇప్పుడు థర్డ్ సాంగ్ కూడా అదే రేంజ్‍లో దుమ్మురేపుతోంది.

దేవరలో ఎన్టీఆర్ సరసన నటిస్తున్న బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్.. ఈ మూవీతోనే టాలీవుడ్‍లోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ కూడా ఈ చిత్రంతోనే తెలుగులోకి ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీలో షైన్ టామ్ చాకో, శృతి మరాఠే, ప్రకాశ్ రాజ్, శ్రీకాంత్, అభిమన్యు సింగ్ నరైన్, మురళీశర్మ కీరోల్స్ చేశారు. సముద్రం బ్యాక్‍డ్రాప్‍లో పవర్‌ఫుల్ యాక్షన్ మూవీగా ఈ చిత్రాన్ని డైరెక్టర్ కొరటాల శివ తెరకెక్కిస్తున్నారు.

దేవర చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు భారీ బడ్జెట్‍తో ప్రొడ్యూజ్ చేస్తున్నాయి. సెప్టెంబర్ 27న తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ మూవీపై దేశవ్యాప్తంగా చాలా బజ్ ఉంది. రికార్డులు బద్దలుకొడుతుందనే అంచనాలు నెలకొన్నాయి. విదేశాల్లో ఇప్పటికే కొన్ని చోట్ల అడ్వాన్స్ బుకింగ్స్ మొదలుకాగా టికెట్లు భారీ స్థాయిలో అమ్ముడవుతున్నాయి.

తదుపరి వ్యాసం