తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Siddharth Roy:అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ క‌థ‌ల‌తో సిద్ధార్థ్ రాయ్ సినిమా చేశారా? - హీరో దీప‌క్ స‌రోజ్ ఏమ‌న్నాడంటే?

Siddharth Roy:అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ క‌థ‌ల‌తో సిద్ధార్థ్ రాయ్ సినిమా చేశారా? - హీరో దీప‌క్ స‌రోజ్ ఏమ‌న్నాడంటే?

21 February 2024, 5:58 IST

google News
  • Siddharth Roy: అర్జున్ రెడ్డి, యానిమ‌ల్ క‌థ‌ల స్ఫూర్తితోనే సిద్ధార్థ్ రాయ్ సినిమాను తెర‌కెక్కిస్తోన్న‌ట్లుగా టాలీవుడ్‌లో ప్ర‌చారం జ‌రుగుతోంది. సిద్ధార్థ్ రాయ్ లుక్‌, క్యారెక్ట‌రైజేష‌న్ మొత్తం అర్జున్ రెడ్డి నుంచే కాపీ చేశార‌ని అంటున్నారు. ఈ కంపేరిజ‌న్స్‌పై హీరో దీప‌క్ స‌రోజ్ ఏమ‌న్నాడంటే?

సిద్దార్థ్ రాయ్ హీరో దీప‌క్ స‌రోజ్‌
సిద్దార్థ్ రాయ్ హీరో దీప‌క్ స‌రోజ్‌

సిద్దార్థ్ రాయ్ హీరో దీప‌క్ స‌రోజ్‌

Siddharth Roy: తెలుగులో చైల్డ్ ఆర్టిస్ట్‌గా ప‌లు సినిమాలు చేసిన దీపక్ సరోజ్ ‘సిద్ధార్థ్ రాయ్’ మూవీతో హీరోగా అరంగేట్రం చేస్తున్నారు. హరీష్ శంకర్, వంశీ పైడిపల్లి వంటి పెద్ద దర్శకుల వద్ద పనిచేసిన వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఫిబ్రవరి 23న సిద్దార్థ్ రాయ్ వ‌ర‌ల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది. సిద్ధార్థ్ రాయ్ సినిమా గురించి దీప‌క్ స‌రోజ్ ఏమ‌న్నాడంటే?

నంది అవార్డ్ విన్న‌ర్‌...

-చైల్డ్ ఆర్టిస్ట్ గా మిణుగురులు చిత్రంలో నేను చేసిన పాత్రకు నంది అవార్డ్ వ‌చ్చింది. ఈ మూవీతో పాటు వెంక‌టేష్‌, చిరంజీవి వంటి స్టార్ హీరోల సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్‌గా న‌టించాను. అప్పుడే సినిమాలపై ఇష్టం పెరిగింది. ఎంబీఏ , ఆ త‌ర్వాత ఫ్యామిలీ బిజినెస్ కోసం ఐదేళ్లు సినిమాల‌కు దూర‌మ‌య్యా. ఆ టైమ్‌లోనే దర్శకుడు యశస్వీ సిద్ధార్థ్ రాయ్ క‌థ చెప్పారు. కథ విన్నాక షాక్ అయ్యాను. అసలు అలాంటి పాత్ర చేయగలనా? అనుకున్నాను. యశస్వీ నన్ను బలంగా నమ్మారు. అలా ‘సిద్ధార్థ్ రాయ్’ మొదలైంది.

రెండు నెల‌లు ట్రైనింగ్‌...

- సిద్ధార్థ్ రాయ్ పాత్ర లాజికల్ గా ఎక్స్ట్రీమిజంలో ప్ర‌వ‌ర్తిస్తుంది. చాలా నాన్ రియాక్టివ్ గా ఉంటాడు. నా రియ‌ల్ లైఫ్‌కు పూర్తి భిన్న‌మైన ఈ పాత్ర‌కు న్యాయం చేయ‌డానికి దాదాపు రెండు నెలలు పాటు ట్రైనింగ్ తీసుకున్నాను. కొంత ఫిలాసఫీ కూడా చదివాను.‘సిద్ధార్థ్ రాయ్’ క్యారెక్ట‌ర్ చాలా ఎమోష‌న‌ల్‌గా ఉంటుంది. ఎంత కంట్రోల్ గా ఉంటాడో తర్వాత అంత అన్ కంట్రోల్ అయిపోతాడు.ఈ క్యారెక్ట‌ర్ కోసం చాలా ప్రిపేర్ అయ్యాను. అనుకున్నట్లు వస్తుందా రాదా అనే విషయంలో చాలా సార్లు టెన్ష‌న్ కూడా ప‌డ్డాను

అర్జున్‌రెడ్డితో కంపేరిజ‌న్స్‌...

-‘సిద్ధార్థ్ రాయ్’ లుక్ చూసి చాలా మంది అర్జున్ రెడ్డితో సిద్ధార్థ్ రాయ్‌ని కంపేర్ చేస్తున్నారు. కానీ ‘సిద్ధార్థ్ రాయ్’, అర్జున్ రెడ్డి కథలకు ఏ విషయంలోనూ పోలిక ఉండ‌దు. యానిమ‌ల్‌తో సంబంధం ఉండ‌దు. పాత్రల పరంగా చూసుకుంటే.. ఈ మూడు పాత్రల్లో ఎక్స్ ట్రీమిజం కామన్ గా అనిపించవచ్చు కానీ.. ఈ మూడు కథల నేపధ్యాలు వేరు. ట్రీట్ మెంట్ లో కూడా లింక్ వుండదు. సినిమా చూసినప్పుడు ప్రేక్షకులు కూడా పదో నిమిషం నుంచి మెల్లగా ‘సిద్ధార్థ్ రాయ్’ వరల్డ్ లోకి వచ్చేస్తారు. సిద్ధార్థ్ రాయ్ లో ప్రధాన సంఘర్షణ తను నమ్మి ఫిలాసఫీ, నమ్మకం పైన వుంటుంది. అది చాలా యూనిక్ చూపించాం.

ఖుషిలో ప‌వ‌న్ పాత్ర స్ఫూర్తితోనే...

-ఈ సినిమాకి ‘సిద్ధార్థ్ రాయ్’ పేరుపెట్టడానికి బలమైన కారణం వుంది. ఇందులో సిద్ధార్థ్ అనేది రివర్స్ థీసెస్ అఫ్ గౌతమ బుద్ధ. ఈ టైటిల్‌కు ఖుషిలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్ఫూర్తి ఏం లేదు.

ప్రేక్ష‌కులు యాక్సెప్ట్ చేసేలానే...

-సామాజిక భాద్యతతోనే ఈ క్యారెక్టర్ ని డీల్ చేశాం. సిద్ధార్థ్ రాయ్‌ అలా మారడానికి, ప్రవర్తించడానికి మూలం ఎక్కడ మొదలైయింది ? అది ఎలా రూపాంతరం చెందిందనేది సినిమాలో చూపించబోతున్నాం. ప్రేక్షకులు యాక్సప్ట్ చేసే విధంగానే క్యారెక్ట‌ర్ డిజైనింగ్ ఉంటుంది.

కొత్త సినిమాలు...

సిద్దార్థ్ రాయ్ త‌ర్వాత తెలుగులో మ‌రో రెండు సినిమాలు చేయబోతున్నాను. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్స్‌గా తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలు మార్చి, జూన్ నుంచి మొద‌ల‌వుతాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం