Pushpa 3: పుష్ప 3 కూడా ఉందోచ్‌ - క‌న్ఫామ్ చేసిన అల్లు అర్జున్ - ఫ్యాన్స్ ఖుషి-allu arjun confirms pushpa part 3 in berlin international film festival ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Allu Arjun Confirms Pushpa Part 3 In Berlin International Film Festival

Pushpa 3: పుష్ప 3 కూడా ఉందోచ్‌ - క‌న్ఫామ్ చేసిన అల్లు అర్జున్ - ఫ్యాన్స్ ఖుషి

Nelki Naresh Kumar HT Telugu
Feb 17, 2024 09:02 AM IST

Pushpa 3: పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా రాబోతోంది. ఈ విష‌యాన్ని బెర్లిన్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో అల్లు అర్జున్ క‌న్ఫామ్ చేశాడు. పుష్ప 2పై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.

అల్లు అర్జున్‌
అల్లు అర్జున్‌

Pushpa 3: పుష్ప ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ వినిపించాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. పుష్ప సినిమాకు మూడో పార్ట్ కూడా ఉంటుంద‌ని బెర్లిన్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో అల్లు అర్జున్‌ ప్ర‌క‌టించాడు. బెర్లిన్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో అల్లు అర్జున్ పుష్ప సినిమాను స్క్రీనింగ్ చేశారు.

పుష్ఫ త‌ర‌ఫునే కాకుండా ఈ ఇంట‌ర్‌నేష‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌కు ఇండియ‌న్ ప్ర‌తినిధిగా బ‌న్నీ అటెండ్ అయ్యాడు. బెర్లిన్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో బ‌న్నీ మాట్లాడుతూ పుష్ప‌ సినిమాకు మూడో భాగం కూడా వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని అన్నాడు. ఓ ఫ్రాంచైజ్‌లా పుష్ప సినిమాను తెర‌కెక్కించాల‌ని అనుకుంటున్న‌ట్లు చెప్పాడు.

ఓటీటీలోనే ఎక్కువ రీచ్‌...

పుష్ప సినిమా థియేట‌ర్ల కంటే ఓటీటీలో ఎక్కువ‌గా అభిమానుల‌కు రీచ్ అయ్యింద‌ని తెలిపాడు. ఓటీటీ వ‌ల్లే ఈ సినిమాకు ఇంట‌ర్‌నేష‌న‌ల్ వైడ్‌గా క్రేజ్ ఏర్ప‌డి 2021లో బిగ్గెస్ట్ ఫిల్మ్‌గా పుష్ప నిలిచింద‌ని అల్లు అర్జున్ అన్నాడు.

డిఫ‌రెంట్ షేడ్స్‌...

పుష్ప పార్ట్ 2పై బ‌న్నీ బెర్లిన్ ఇంట‌ర్‌నేష‌న్ ఫిల్మ్ ఫెస్టివ‌ల్‌లో ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశాడు. పుష్ప పార్ట్ 2లో పుష్ప‌రాజ్‌లోని ఓ డిఫ‌రెంట్ షేడ్‌ను చూస్తార‌ని బ‌న్నీ అన్నాడు. పుష్ప‌కు మించి త‌న క్యారెక్ట‌రైజేష‌న్ చాలా హై లెవెల్‌లో ఉంటుంద‌ని, పుష్ప‌రాజ్‌కు ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను ఆడియెన్స్ ఊహ‌ల‌కు మించి భారీ స్కేల్‌లో సుకుమార్ ఈ సినిమాలో చూపించ‌బోతున్నాడ‌ని బ‌న్నీ అన్నాడు. పుష్ప సినిమాను రీజ‌న‌ల్ లెవెల్‌లో తెర‌కెక్కించామ‌ని, పుష్ప 2ను మాత్రం ఇంట‌ర్‌సేష‌న‌ల్ స్టాండ‌ర్డ్స్‌తో రూపొందిస్తున్నామ‌ని చెప్పాడు.

ఆగ‌స్ట్ 15న రిలీజ్‌...

పుష్ప 2 మూవీ ఆగ‌స్ట్ 15న పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజ్ కాబోతోంది. ఎర్ర‌చంద‌నం సిండికేట్ నాయ‌కుడిగా మారిన త‌ర్వాత పుష్ప‌రాజ్ జీవితంలో జ‌రిగిన ప‌రిణామాలు, భ‌న్వ‌ర్‌సింగ్ షెకావ‌త్‌తో పుష్ప‌రాజ్‌కు ఏర్ప‌డిన వైరం నేప‌థ్యంలో సీక్వెల్ సాగ‌నున్న‌ట్లు స‌మాచారం. పుష్ప లో ఫ‌హాద్ ఫాజిల్ రోల్ త‌క్కువ నిడివితో క‌నిపించింది.

సెకండ్ పార్ట్‌లో మాత్రం ఫుల్ లెంగ్త్ రోల్‌లో అత‌డు క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతోన్నారు. పుష్ప 2లో ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టిస్తోంది. పుష్ప 2 పోస్ట్‌పోన్ అయ్యే అవ‌కాశం ఉన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.ఆగ‌స్ట్ 15 లోపు షూటింగ్‌తో పాటు పోస్ట్‌ప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్తికావ‌డం అనుమాన‌మేన‌ని, అందుకే ఈ సినిమా రిలీజ్ పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. అయితే పుష్ప టీమ్ మాత్రం ఈ పుకార్ల‌పై ఇప్ప‌టివ‌ర‌కు రియాక్ట్ కాలేదు.

నేష‌న‌ల్ అవార్డు...

పుష్ప సినిమాతో బెస్ట్ యాక్ట‌ర్‌గా అల్లు అర్జున్ నేష‌న‌ల్ అవార్డును అందుకున్నాడు. పుష్ప‌రాజ్ పాత్ర‌లో బ‌న్నీ డైలాగ్స్, త‌డి మేన‌రిజ‌మ్స్ ఇంట‌ర్‌నేష‌న‌ల్ వైడ్‌గా ఫేమ‌స్ అయ్యాయి. డేవిడ్ వార్న‌ర్‌తో పాటు ప‌లువురు క్రికెట‌ర్లు, ఫుట్‌బాల్ ప్లేయ‌ర్స్‌ అత‌డి మేన‌రిజ‌మ్స్‌ను ఇమిటేట్ చేశారు. 2021 డిసెంబ‌ర్‌లో రిలీజైన పుష్ప మూవీ వ‌ర‌ల్డ్ వైడ్‌గా 370 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టింది. అల్లు అర్జున్ కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది.

పుష్ప 2 త‌ర్వాత అల్లు అర్జున్ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్, యానిమ‌ల్ ఫేమ్ సందీప్ వంగాల‌తో సినిమాలు చేయ‌బోతున్నాడు. అట్లీ, మురుగ‌దాస్‌ల‌తో అల్లు అర్జున్ సినిమాలు ఉండే అవ‌కాశం ఉంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

IPL_Entry_Point