తెలుగు న్యూస్  /  Entertainment  /  Custody Glimpse Released On The Occasion Of New Year Eve

Custody Glimpse: నాగ చైతన్య కస్టడీ గ్లింప్స్‌.. ఇంటెన్స్‌ లుక్‌లో చైతూ

Hari Prasad S HT Telugu

01 January 2023, 13:21 IST

    • Custody Glimpse: నాగ చైతన్య కస్టడీ మూవీ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు మేకర్స్‌. న్యూ ఇయర్‌ సందర్భంగా ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌ ఇచ్చారు. ఈ గ్లింప్స్‌లో చైతూ ఇంటెన్స్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు.
కస్టడీ మూవీలో నాగ చైతన్య
కస్టడీ మూవీలో నాగ చైతన్య

కస్టడీ మూవీలో నాగ చైతన్య

Custody Glimpse: న్యూఇయర్‌ సందర్భంగా టాలీవుడ్‌లో సర్‌ప్రైజ్‌ల మీద సర్‌ప్రైజ్‌లు వస్తూనే ఉన్నాయి. ఎన్టీఆర్‌30 రిలీజ్‌ డేట్‌ను అనౌన్స్‌ చేసి ఫ్యాన్స్‌ను ఆశ్చర్యపరచగా.. తాజాగా నాగచైతన్య కస్టడీ మూవీ నుంచి కూడా గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ ఏడాది మే 12 ఈ సినిమా రిలీజ్‌ కానుండగా.. న్యూ ఇయర్‌ సందర్భంగా జనవరి 1న గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Theatre releases this week: ఈ వారం థియేటర్లలోకి రానున్న 5 సినిమాలు.. డిఫరెంట్ జానర్లతో..

Bullet 50 Days: ప్రభాస్, గోపీచంద్ లాగా రవి వర్మ.. పాపులర్ డైరెక్టర్ కామెంట్స్

Biggest Flop Movie: ఒక్క సినిమాతోనే రూ.170 కోట్ల నష్టం.. ఇండియన్ సినిమాలో భారీ నష్టాలను మిగిల్చిన మూవీస్ ఇవే

Shaitaan OTT: ఓటీటీలోకి 4 రోజుల్లో బ్లాక్ బస్టర్ హారర్ థ్రిల్లర్.. 211 కోట్ల సినిమాను ఎక్కడ చూస్తారంటే?

తెలుగుతోపాటు తమిళంలోనూ రిలీజ్‌ అవుతున్న కస్టడీ మూవీ అక్కినేని నాగ చైతన్య అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. ముఖ్యంగా గతేడాది థ్యాంక్యూ డిజాస్టర్‌తో డల్లయిపోయిన చైతూ.. ఈ కస్టడీ మూవీలో మాత్రం చాలా ఇంటెన్స్‌ లుక్‌లో కనిపిస్తున్నాడు. గతంలోనూ ఫస్ట్ లుక్‌ రాగా.. ఇప్పుడు వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో కేవలం యాక్షన్‌ సీన్స్‌ మాత్రమే చూపించారు.

ఎలాంటి డైలాగ్స్‌ లేవు. ఈ పవర్‌ ఫుల్‌ యాక్షన్‌ డ్రామాలో చైతన్య పోలీస్‌ ఆఫీసర్‌ పాత్రలో కనిపించనున్నాడు. న్యూ ఇయర్‌ రోజు ఫ్యాన్స్‌లో ఉత్సాహం నింపేలా ఈ కస్టడీ గ్లింప్స్‌ ఉంది. యాక్షన్‌ సీన్లకు తగినట్లు బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, ఏరియల్‌ షాట్స్‌ ఫ్యాన్స్‌లో ఆసక్తి రేపుతున్నాయి.

వెంకట్‌ప్రభు డైరెక్షన్‌లో కస్టడీ తెరకెక్కుతోంది. ఇక కోలీవుడ్ స్టార్‌ అరవింద్ స్వామి విలన్‌గా నటిస్తున్నాడు. చైతూ సరసన అందాల నటి కృతి శెట్టి మరోసారి నటిస్తోంది. గతేడాది రిలీజ్‌ అయిన బంగార్రాజు మూవీలోనూ ఈ జంట కనువిందు చేసిన విషయం తెలిసిందే.

అంతేకాదు మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా, అతని తనయుడు యువన్‌ శంకర్‌ రాజా కలిసి ఈ సినిమాకు మ్యూజిక్‌ అందిస్తుండటం కూడా చాలా ఆసక్తి రేపుతోంది. శ్రీనివాస సిల్వర్‌ స్క్రీన్‌ బ్యానర్‌లో భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ప్రియమణి, శరత్‌కుమార్‌, సంపత్‌రాజ్‌, ప్రేమ్‌జీ అమరన్, వెన్నెల కిశోర్‌, ప్రేమి విశ్వనాథ్‌లాంటి నటీనటులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.